Ramayanam – 18 : Bharata angry

భరతుడు తన అమ్మమ్మ తాతయ్య ఇంటి నుంచి బయల్దేరి అయోధ్యకి చేరుకుంటాడు. అయోధ్యలోకి రథం ప్రవేశించగానే, అక్కడి వాతావరణంలోని మార్పుల కారణంగా ఆయన మనసు కీడు శంకిస్తుంది. మనసు పరిపరివిధాలపోతూ ఉండగా ఆయన తన తల్లి మందిరానికి వెళతాడు. తల్లి తెల్లని వస్త్రాలను ధరించి ఉండటం చూసి, కన్నీళ్ల పర్యంతమవుతాడు. ఏం జరిగిందంటూ, తన తండ్రిని తలచుకుంటూ కన్నీళ్ల పర్యంతమవుతాడు. తను ఊరు వెళ్లడానికి ముందు ఆరోగ్యంగానే ఉన్న తండ్రికి ఇంతలోనే ఏమైందని అడుగుతాడు.

దాంతో జరిగినదంతా అతనికి కైకేయి వివరంగా చెబుతుంది. అయోధ్య సింహాసనాన్ని అతనికి కట్టబెట్టడం కోసమే అలా చేశానని అంటుంది. ఏ తల్లి అయినా కొడుకు విషయంలో అలాగే ఆలోచిస్తుందనీ, తానూ అదే చేశానని చెబుతుంది. అతని ఆవేశాన్నీ ఆవేదనను తాను అర్థం చేసుకోగలననీ, కానీ జరిగిన ఏ సంఘటన తిరిగి మారడానికి అవకాశం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అందువలన జరిగిపోయిన వాటిని గురించి చింతన చేయకుండా అయోధ్య నగరాన్ని ఏలుకోమని అంటుంది.

తండ్రి మరణం గురించి తన అన్నగారు అడవులకు వెళ్లడం గురించి ఆమె అంత తేలికగా మాట్లాడటం, భరతుడికి తీవ్రమైన ఆగ్రహావేశాలను కలిగిస్తుంది. ఆమె స్వార్థం కారణంగా అయోధ్య నగరం ఒంటరిగా మిగిలిపోయిందని ఆవేదన చెందుతాడు. ఆమె కుమారుడినని చెప్పుకోవడానికి తనకి చాలా బాధగా ఉందనీ, తన గురించి రాముడు ఏమనుకుని ఉంటాడోననే ఆలోచన తనకి సిగ్గుగా అనిపిస్తుందని అంటాడు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా తాను బ్రతికున్నంతవరకూ అపనిందలు మోయవలసి ఉంటుందని కన్నీళ్లు పెట్టుకుంటాడు.

ఈర్ష్యా ద్వేషాలతో ఆమె రాముడిని అడవులకు పంపించడం, అందువలన తండ్రి మరణించడం జరిగిందని అంటాడు. రెండు ఘోరమైన పాపాలు చేసిన కారణంగా, ఆమె కోరికను తాను మన్నించలేనని చెబుతాడు. ఆమె కారణంగా తనకి లభించే కిరీటాన్ని తాను ఎప్పటికీ ధరించననీ, సింహాసనం అధిష్టించడం ఎలాంటి పరిస్థితుల్లోను జరగదని అంటాడు. రాముడిని తీసుకొచ్చి ఆయనకి సింహాసనాన్ని అప్పగించేంతవరకూ తనకి మనశ్శాంతి లేదని చెప్పేసి అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోతాడు. అతని ధోరణికి నివ్వెరపోయి కైకేయి అలాగే చూస్తుండిపోతుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 18 : Bharata angry

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: