Ramayanam – 17 : Dasharatha death

సీతారాములు ఎప్పుడైతే అంతఃపురం నుంచి అవతలకి కాలు పెట్టారో, అప్పుడే అంతఃపుర భవనాలన్నీ కళ తప్పుతాయి. అంతవరకూ పట్టాభిషేక మహోత్సవం పేరుతో సందడిగా కనిపించిన వీధులన్నీ వెల వెలబోతుంటాయి. కైకేయి మందిరాన కటిక నేలపైనే కూలిపోయిన దశరథుడు కన్నీళ్ల పర్యంతమవుతుంటాడు. తన రాముడు లేని రాజ్యాన్ని తాను చూడలేనని చెప్పి, అడుగు బయటికి వేయకుండా అక్కడే రోదిస్తూ ఉంటాడు. వశిష్ఠ మహర్షి అతణ్ణి ఓదార్చడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది.

తాను ఎవరికి ఏ అపకారం చేశానని చెప్పి ఇంతటి శిక్ష విధించావు? అంటూ దశరథుడు దైవాన్ని తలచుకుంటూ ఉండగా, గతంలో జరిగిన ఒక సంఘటన ఆయన కళ్లముందు కదలాడుతుంది. ఆ సంఘటన కారణంగానే తనకి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనే విషయం దశరథుడికి అర్థమవుతుంది. ఆ రోజున జరిగిన ఆ సంఘటన పదేపదే అతని మదిలో మెదులుతూ ముల్లులా పొడుస్తూ ఉంటుంది. ఆ బాధను మరిచిపోవడానికి ఆయన ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. ఆయన ఏ దిక్కుకు తిరిగినా ఆ దృశ్యమే కళ్ల వాకిళ్లలో నిలుస్తూ ఉంటుంది.

ఒకసారి దశరథ మహారాజు వేటకు వెళతాడు. అలా ఆయన క్రూరమృగాలను వేటాడుతూ దట్టమైన అడవిలో ముందుకు వెళుతుంటాడు. ఆ సమయంలో ఒక పొదల చాటున ఏదో అలికిడి అవుతుంది. ఏదో మృగమే అక్కడ ఉండి ఉంటుందని భావించిన దశరథ మహారాజు గురి చూసి బాణం వదులుతాడు. ఆ బాణం వెళ్లిన దిశ నుంచి “అమ్మా” అంటూ ఒక అరుపు వినిపిస్తుంది. దాంతో దశరథుడు పరుగున అక్కడికి వెళతాడు. తన బాణం దెబ్బకి విలవిలలాడుతున్న ముని కుమారుడిని చూస్తాడు. తాను చేసిన పనికి ఎంతగానో బాధపడతాడు.

తన పేరు శ్రవణ కుమారుడని చెప్పిన ఆ ముని కుమారుడు, అంధులైన తన తల్లిదండ్రులు అక్కడికి దగ్గరలోనే ఉన్నారని చెబుతాడు. వాళ్లకి దాహంగా ఉండటంతో మంచినీళ్ల కోసం ఆ కొలను దగ్గరికి వచ్చానని అంటాడు. వెంటనే మంచినీళ్లు తీసుకెళ్లి వారి ప్రాణాలను నిలబెట్టమని చెప్పి తన ప్రాణాలను వదులుతాడు. దశరథుడు ఒక దొన్నెలో మంచినీళ్లు తీసుకుని ఆ ముని దంపతుల దగ్గరకి వెళతాడు. తమ కుమారుడు ఏమయ్యాడని అడిగిన ఆ దంపతులకు జరిగింది చెబుతాడు. దాంతో తమ మాదిరిగానే పుత్రశోకంతో తనువు చాలించమని శపించి వారు మరణిస్తారు. ఆ శాపం గుర్తుకురాగానే దశరథుడు మరింతగా కుమిలిపోతూ కూలిపోయి మరణిస్తాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 17 : Dasharatha death

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: