Ramayanam – 73 : Birth of Lava Kusha

శత్రుఘ్నుడి ధైర్యాన్ని రాముడు అభినందిస్తాడు. లవణాసురుడు సామాన్యుడు కాదనే విషయం ఆయన దగ్గర గల శివప్రసాదమైన శూలం కారణంగా తెలుస్తోంది. ఆయనను సంహరించడం అంత తేలికైన విషయం కాదు. లవణుడి చేతిలో ఆ శూలం లేని సమయంలో మాత్రం అతని సంహారం జరగాలి. ఆ శూలం అతనికి అందుబాటులో లేని సమయంలో ఆ పని జరగాలి. లేదంటే ఆయనను ఎదిరించడం ఎవరి వలనా కాదు. శూలాన్ని గురించి ఆయన ఆలోచన చేసే సమయంగానీ, దానిని తీసుకొచ్చే సమయం కానీ ఇవ్వకూడదు అని రాముడు చెబుతాడు.

ఎంతో ధైర్య సాహసాలతో పాటు తెలివి తేటలు కూడా ఇందుకు అవసరం. అందువలన అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. ముందుగా మహర్షులను సైన్యాన్ని తోడుగా ఇచ్చి పంపించు. ఆ తరువాత నువ్వు ఆయుధాలు ధరించి వెళ్లు. తనపైకి యుద్ధానికి వస్తున్నారనే విషయాన్ని లవణుడు ఎలాంటి పరిస్థితుల్లోను గ్రహించకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే తాను ఇచ్చే వైష్ణవ అస్త్రాన్ని ఉపయోగించమని చెప్పి, శత్రుఘ్నుడికి ఇస్తాడు. ఆ దివ్యాస్త్రాన్ని శత్రుఘ్నుడు అందుకుంటాడు.

తాము వచ్చిన పని పూర్తికావడంతో, చ్యవన మహర్షితో పాటు ఆయన శిష్యులంతా రాముడి దగ్గర సెలవు తీసుకుని వెనుదిరుగుతారు. ఎక్కడ ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా మహర్షిలతో సైన్యం బయల్దేరుతుంది. రాముడు చెప్పినట్టుగానే కొన్ని రోజుల తరువాత శత్రుఘ్నుడు బయల్దేరతాడు. లవణుడిని సంహరించిన తరువాత, మధుపురానికి రాజుగా అక్కడే పాలన సాగించమని అతనిని రాముడు ఆదేశిస్తాడు. అన్నగారికి దూరంగా ఉండటం ఇష్టం లేకపోయినా, ఆయన మౌనంగానే అంగీకరిస్తాడు.

సీతాదేవికి పురుటి నొప్పులు మొదలవుతాయి. ఈ విషయం తెలియగానే వాల్మీకి మహర్షి, ఆశ్రమవాసులను ఆమె దగ్గరే ఉంచుతాడు. సీతాదేవి ఇద్దరు మగ శిశువులకు జన్మనిస్తుంది. ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చిందని తెలిసి వాల్మీకి మహర్షి సంతోషిస్తాడు. ఆ పిల్లలిద్దరినీ ఆశీర్వదించి వాళ్లకి “లవ – కుశ” అని నామకరణం చేస్తాడు. సీతాదేవి కూడా ఎంతో ఆనందిస్తుంది. సమయానికి పుట్టింటివారుగానీ, అత్తింటివారుగాని దగ్గర లేనందుకు బాధపడుతుంది. అదే సమయంలో ఆ ఆశ్రమంలోకి శత్రుఘ్నుడు అడుగుపెడతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 73 : Birth of Lava Kusha

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: