Ramayanam – 16 : Lord Rama Sita going to vanavas

సీతారాములు పెద్దలకు నమస్కరించుకుని వనవాసానికి బయల్దేరతారు. లక్ష్మణుడు మౌనంగా వాళ్లను అనుసరిస్తాడు. ఈ విషయం తెలియగానే అయోధ్య ప్రజలంతా రాజభవనం దగ్గరికి చేరుకుంటారు. రాముడే తమకి రాజుగా ఉండాలనీ, ఆయన అడవులకు వెళ్లడం తమకి ఇష్టం లేదని చెబుతారు. రాముడు లేని అయోధ్యలో తాముకూడా ఉండజాలమని చెప్పి, దారికి అడ్డుగా కూర్చుంటారు. తనపట్ల వాళ్లకి గల ప్రేమానురాగాలు రాముడిని కదిలించివేస్తాయి. భరతుడిని రాజుగా అంగీకరించమనీ, తండ్రిమాటను నిలబెట్టుకునే అవకాశాన్ని తనకి ఇవ్వమని కోరతాడు.

భరతుడినే రాజ్యాన్ని ఏలుకోమనీ, తాము మాత్రం సీతారాముల వెంట అడవులకు వస్తామని అందరూ ముక్త కంఠంతో చెబుతారు. రాముడు ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా, ఆయనను అనుసరిస్తారు. పొలిమేరలు దాటిన తరువాత ఆ రాత్రికి ఒకచోట సీతారాములు విశ్రమిస్తారు. అయోధ్య ప్రజలు కూడా ఆ ప్రదేశంలో కునుకు తీస్తారు. అక్కడి నుంచి వాళ్లు వెనుదిరిగి వెళ్లాలనే ఉద్దేశాన్ని తెలియజేస్తూ, సీత లక్ష్మణ సమేతుడై రాముడు ముందుకు కదులుతాడు. మర్నాడు ఉదయాన్నే నిద్రలేచిన అయోధ్య వాసులు, రాముడి మనసును అర్థం చేసుకుని కన్నీళ్లతో వెనుదిరుగుతారు.

సీతారాములు ముందుకు సాగుతుంటారు. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుతూ వెళుతుంటారు. మార్గమధ్యంలో వాళ్లు గంగానదిని దాటవలసి వస్తుంది. ఆ నదిపై నావను నడిపే “గుహుడు” సీతారాములను గుర్తించి వారి పాదాలకు నమస్కరిస్తాడు. తన గూడెం ప్రజలను అక్కడికి పిలిపించి సీతారాముల దర్శనం చేయిస్తాడు. వారికి అవసరమైన తినుబండారాలను ఏర్పాటు చేయిస్తాడు. సీతారామ లక్ష్మణుల విశ్రాంతికి అవసరమైన ఏర్పాట్లు చేయిస్తాడు. ఆ తరువాత వాళ్లను ఎంతో జాగ్రత్తగా ఆవలి ఒడ్డుకు చేరుస్తాడు.

గుహుడు ఇచ్చిన ఆతిథ్యం, ఆయన చూపిన ఆత్మీయత పట్ల రాముడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. గుహుడిని ఆలింగనం చేసుకుని తన అభిమానాన్ని చాటుతాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తనని ఆలింగనం చేసుకోవడంతో, గుహుడు సంతోషంతో మురిసిపోతాడు. తన జన్మ ధన్యమైందని చెబుతూ గుహుడు సీతారాముల నుంచి సెలవు తీసుకుంటాడు. కనుమరుగు అయ్యేవరకూ తనవైపే చూస్తూ వెళుతున్న గుహుడి వైపే చూస్తూ నిలుచున్న రాముడు, భారమైన మనసుతో వెనుదిరుగుతాడు. అలా గంగాతీరంలో సీతారామ లక్ష్మణులు ముందుకు సాగుతుంటారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 16 : Lord Rama Sita going to vanavas

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: