Ramayanam – 14 : Kaikeyi commands as Dasharatha

కైకేయి కబురు చేయడంతో వెంటనే రాముడు ఆమె మందిరానికి వెళతాడు. అక్కడ దశరథుడు దుఃఖితుడై ఉండటం చూసి ఆందోళన చెందుతాడు. ఏం జరిగిందని కంగారుగా అడుగుతాడు. దశరథుడిని తాను అడిగిన వరాలను గురించి కైకేయి చెబుతుంది. ఆ వరాలను తీర్చలేక ఆ మాటను వెనక్కి తీసుకోలేక దశరథుడు సతమతమైపోతున్నాడని అంటుంది. భరతుడికి పట్టాభిషేకం జరగాలనీ, రాముడు అడవులకు వెళ్లాలనే తన అభిమతాన్ని వ్యక్తం చేస్తుంది. ఆమె మాటలను వినలేక, వింటూ రాముడిని చూడలేక దశరథుడు మరింత కుమిలిపోతుంటాడు.

ఈ విషయంలో తన తండ్రిని బాధపెట్టొద్దనీ, ఆమెకి ఆయన ఇచ్చిన మాట నిలబడుతుందని రాముడు అంటాడు. అలాగే తాను అడవులకు వెళ్లి తన తండ్రి మాటను నిలబెడతానని చెబుతాడు. తన తండ్రి నిర్ణయం ప్రకారమే పట్టాభిషేకానికి అంగీకరించాననీ, అలాగే అడవులకు వెళ్లాలనే ఆయన మాటకి కూడా కట్టుబడి ఉంటానని అంటాడు. అందువలన తన తండ్రి మనసును ఊరడించవలసిన బాధ్యత ఆమెదేనని చెబుతాడు. వాళ్ల నిర్ణయం ప్రకారమే తాను అడవులకు బయలుదేరుతానని చెప్పి, తండ్రి పాదాలకు నమస్కరించి వెనుదిరుగుతాడు.

రాముడు తనకి దూరమైపోతున్నాడు. తన మనసుకి, తన రాజ్యానికి ఆనందాన్ని కలిగించిన రాముడు వెళ్లిపోతున్నాడు. అంతఃపుర భవనాల్లో తిరిగే రాముడు ఎలా కారడవులలో తిరగగలడు? చలి, ఎండ, వాన వంటి కాలాలను అతను ఎలా తట్టుకోగలడు? రాముడు కాసేపు కనిపించకపోతే ఆత్రుతగా వెతికే ఈ కళ్లకు ఎవరు ఆనందాన్ని ఇవ్వగలరు? రాముడిలా తన మనసుకు ఎవరు ఆత్మీయానుబంధాలను పంచగలరు? రాముడు వెళుతున్నాడు, 14 సంవత్సరాల వరకూ మరి కనిపించడు కాలం ఎంత కర్కశమైనది అనుకుంటూ దశరథుడు తల్లడిల్లిపోతాడు.

ఈ విషయాలేవీ తెలియని అయోధ్య వాసులు సంబరాల్లో మునిగితేలుతుంటారు. ప్రతి ఇంట్లో ఒక పండుగ, ప్రతి వీధిలో ఒక జాతర జరుగుతున్నట్టుగా ఉంటుంది. రాజభవనాల్లోను అలంకారాలు సన్నాహాలు సందడిగా జరుగుతుంటాయి. మహర్షులు, వేద పండితులు అప్పటికే అయోధ్యకు చేరుకుంటారు. తమకి కేటాయించిన వసతి మందిరాల్లో ఉంటూ కావలసిన ఏర్పాట్లను చూసుకుంటూ ఉంటారు. రాముడి పట్టాభిషేక వైభవాన్ని తలచుకుని కౌసల్య ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. అదే సమయంలో రాముడు ఆ మందిరంలోకి అడుగుపెడతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 14 : Kaikeyi commands as Dasharatha

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: