Ramayanam – 15 : Kausalya gets tears

కైకేయి మందిరం నుంచి వచ్చిన రాముడు, తన తండ్రి అభిప్రాయాన్ని కౌసల్యకు చెబుతాడు. భరతుడికి పట్టాభిషేకం, రాముడికి వనవాసం అనే రెండు మాటలను వినగానే ఆమె నివ్వెరపోతుంది. ఎవరూ ఎలాంటి కోరిక కోరకుండానే రాముడికి పట్టాభిషేకం అంటూ పూనుకున్న ఆయన, ఇంతలోనే ఇంతటి కఠోరమైన నిర్ణయాన్ని ఎలా తీసుకున్నాడనే విషయం తెలియక ఆమె నిర్ఘాంతపోతుంది. రాముడికి రాజ్యభారాన్ని అప్పగించి తాము వానప్రస్థానికి వెళ్లిపోదామని అనుకుంటే, రాముడినే వనాలకు పంపించే పరిస్థితి వచ్చినందుకు ఆమె కన్నీళ్ల పర్యంతమవుతుంది.

రాముడు తన తల్లిని ఓదార్చుతాడు. తండ్రి మాటను నిలబెట్టే శక్తిసామర్థ్యాలను తనకి ప్రసాదించమని కోరతాడు. తన రాముడు ధర్మపరుడనీ, అతను నమ్మిన ధర్మమే అతణ్ణి అడుగడుగునా కాపాడుతూ ఉంటుందని కౌసల్య అంటుంది. కన్న కొడుకు దూరం కావడం కన్నా తల్లిదండ్రులకు పెద్ద శిక్ష ఏముంటుందంటూ ఆవేదన చెందుతుంది. అతని తండ్రి మనసు తనకి తెలుసుననీ, ఆ మాట చెప్పడానికి ఆయన తనకంటే ఎక్కువగా బాధపడి ఉంటాడని అంటుంది. విధి ఎలా నడిపిస్తే అలా నడవడమే తప్ప తమ చేతుల్లో ఏమీ ఉండదనే విషయం మరోసారి నిరూపితమవుతోందని చెబుతుంది.

భరతుడికి అయోధ్య రాజుగా పట్టాభిషేకం, రాముడి వనవాసం గురించిన విషయం లక్ష్మణుడికి తెలుస్తుంది. దాంతో ఆయన తీవ్రమైన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. ముందుగా తన తండ్రి తీసుకున్న నిర్ణయం ఎందుకు మారింది? అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? జరిగిన మార్పులకు కారకులు ఎవరు? అలాంటివారిని తాను వదిలేది లేదు అంటూ లక్ష్మణుడు ఆవేశంగా బయల్దేరతాడు. ఈ విషయం తెలిసి రాముడు అతణ్ణి వారిస్తాడు. తండ్రి మాటను నిలబెట్టుకోవడంలో తనకి సహకరించమని అంటాడు. ఆ మాటలకు లక్ష్మణుడు చల్లబడతాడు.

దశరథుడు తీసుకున్న నిర్ణయాన్ని గురించి రాముడు సీతకు చెబుతాడు. ఈ విషయంలో సీత ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయదు. రాముడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానిని తాను పాటిస్తాననీ, ఆయనను అనుసరిస్తానని చెబుతుంది. భర్త ఎక్కడ ఉన్నా అతనికి తోడుగా నీడగా ఉంటూ సేవించుకోవడమే భార్య ధర్మమని అంటుంది. అంతలో లక్ష్మణుడు అక్కడికి వస్తాడు. రాముడిలేని రాజ్యంలో తాను ఉండలేననీ, తాను కూడా వాళ్లతోనే వస్తానని చెబుతాడు. ఈ విషయంలో తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేయవద్దని కోరతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 15 : Kausalya gets tears

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: