Today rashi phalalu – 08 మార్చి 2023, బుధవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. Check today horoscope in Telugu by renowned astrologer Vakkantham Chandramouli gaaru.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వాహనాలు,స్థలాలు కొంటారు. అనుకున్న రాబడి దక్కుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు గందరగోళం తొలగుతుంది. ఉద్యోగులకు విధులు సకాలంలో చక్కదిద్దుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఇబ్బందులు ఎదురవుతాయి. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకూల రంగులు…… ఎరుపు, పసుపు ప్రతికూల రంగు…నీలం. శివ స్తోత్రాలు పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ముఖ్య వ్యవహారాల్లో ఆటంకాలు. రాబడి కొంత ఉపశమనం కూడా లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. భార్యాభర్తల మధ్య విభేదాలు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలు కష్టసాధ్యమే. ఉద్యోగులకు విధులు ఇబ్బందికరంగా ఉండవచ్చు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఒత్తిడుల మధ్య గడుపుతారు. విద్యార్థులు శ్రమపడాలి. మహిళలకు నిరుత్సాహమే. అనుకూల రంగులు…… గులాబీ, లేత ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నీలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


ఆకస్మిక ప్రయాణాలు. అనుకున్న రాబడి తగ్గుతుంది. ఉద్యోగ యత్నాలు ముందుకు సాగవు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. భార్యాభర్తల మధ్య సయోధ్య కొరవడుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తల శ్రమ వృథా కాగలదు. ఉద్యోగులు సహచరుల సలహాలు స్వీకరిస్తారు. పారిశ్రామికవేత్తలు, వైద్యుల సేవలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు. మహిళలు సమస్యలను ఎదుర్కొంటారు. అనుకూల రంగులు….. తెలుపు, బంగారు. ప్రతికూల రంగు…నేరేడు. వేంకటేశ్వరస్వామికి అర్చనలు చేయండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


రుణ బాధలు కొంత తగ్గుతాయి. బంధువులతో విభేదాలు పరిష్కారం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనాలు, నగలు కొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులకు ఒత్తిడులు తొలగుతాయి. మహిళలకు శుభవార్తలు. అనుకూల రంగులు…… పసుపు, గులాబీ, ప్రతికూల రంగు…నేరేడు. శివ పంచాక్షరి పఠించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


ఆర్థిక ఇబ్బందులతో సతమతం కాగలరు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. కాంట్రాక్టర్లకు కొత్త వివాదాలు, సమస్యలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో విధులు నిరాశ పరుస్తాయి. చిత్రపరిశ్రమవారు, క్రీడాకారులకు సమస్యలు కొంత వేధిస్తాయి. విద్యార్థులకు అవకాశాలు దూరం కాగవలవు. మహిళలకు కొంత ఆందోళన తప్పదు. అనుకూల రంగులు…… నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…తెలుపు. ఆంజనేయ దండకం పఠించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


నూతన కార్యక్రమాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. శుభవార్తలు అంది ఉత్సాహంగా గడుపుతారు. రాబడి ఆశించినంతగా దక్కి అవసరాలు తీరతాయి. గృహ నిర్మాణాలు చేపట్టగల అవకాశం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తల జాగ్రత్తలతో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు అందుతాయి. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు విశేష గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఆశ్చర్యకరమైన ఫలితాలు రావచ్చు. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు…… గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. అంగారక స్తోత్రాలు పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


కొన్ని దీర్ఘకాలిక వివాదాలలో సతమతమవుతారు. ఇతరుల సాయం లేకుండా ముఖ్య కార్యాలు ముందుకు సాగవు. దూర ప్రయాణాలు. రాబడి అంతగా లేక అవసరాలకు ఇబ్బందిపడతారు. భార్యాభర్తల మధ్య అకారణంగా విభేదాలు. నిర్ణయాలను వాయిదా వేసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు భాగస్వాములతో విభేదిస్తారు. ఉద్యోగాల్లో ఇష్టంలేకున్నా మార్పులు ఉండవచ్చు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు మరింత గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. అనుకూల రంగులు…… ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు…గోధుమ. అంగారక స్తోత్రం పఠించాలి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మీ అంచనాలకు తగినట్లుగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు విధులు మరింత సాఫీగా సాగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు సొంత ఆలోచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. అనుకూల రంగులు…… గులాబీ, బంగారు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. శివాష్టకం పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


ముఖ్యమైన వ్యవహారాలను ప్రతిబంధకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆప్తులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. చిరకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకుంటారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాల్లో మీసేవలు మరింత విస్తృతమవుతాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు సాధారణంగా ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడులు తప్పవు. మహిళలకు చికాకులు తొలగుతాయి. అనుకూల రంగులు…… గులాబీ. కాఫీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


ఆప్తులతో తగాదాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆరోగ్య విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలలో ఆటుపోట్లు. ఉద్యోగాల్లో పనిభారంతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు కొంత అయోమయం. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. మహిళలకు కొంత గందరగోళంగా ఉంటుంది. అనుకూల రంగులు…… నీలం, పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. సత్యనారాయణస్వామిని పూజించాలి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


అనుకోని ప్రయాణాలు. ముఖ్యమైన కార్యక్రమాలు ఎంత కష్టించినా పూర్తి కావు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య విభేదాలు పెరుగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడుల్లో ఆటంకాలు. ఉద్యోగాల్లో బాధ్యతలు రెట్టింపు కాగలవు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. విద్యార్థులలో పట్టుదల ఉన్నా అంతగా రాణింపు ఉండదు. మహిళలకు కుటుంబసభ్యుల నుంచి సమస్యలు. అనుకూల రంగులు…… ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు…బంగారు. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. భూవివాదాల నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఎటువంటి నిర్ణయమైనా తేలిగ్గా తీసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తల ప్రయత్నాలలో విఘాతాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో విధులు ప్రోత్సాహంతో పాటు, ఉత్సాహాన్నిస్తాయి. పారిశ్రామికవేత్తలు,సాంకేతిక నిపుణులకు యత్నకార్యసిద్ధి. విద్యార్థులు అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటారు. మహిళలకు శుభవార్తలు. అనుకూల రంగులు…… తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు…నీలం. సూర్యభగవానున్ని పూజించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: