Ramayanam – 58 : Lakshmana unconscious
లంకానగరానికి చెందిన అనేక మంది వీరులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతూ ఉండటంతో, రావణుడు ఆలోచనలో పడతాడు. ఆయనకి ధైర్యం చెప్పి మేఘనాథుడు అను పేరు గల ఇంద్రజిత్తు రంగంలోకి దిగుతాడు. మేఘాల చాటున ఉంటూ, భూమిపై ఉన్న వానర వీరులపై ఇంద్రజిత్తు బాణాల వర్షం కురిపిస్తూ ఉంటాడు. ఎటువైపు నుంచి ఎవరు బాణాలు వేస్తున్నదీ తెలియక, వానరులు అయోమయానికి లోనవుతుంటారు. అలా అదృశ్య రూపంలో యుద్ధం చేస్తున్నది రావణుడి కుమారుడు మేఘనాథుడు అని విభీషణుడు చెబుతాడు.
శత్రువు కనిపించకపోవడంతో రామలక్ష్మణులకు కూడా ఆయనను ఎలా ఎదుర్కొవాలనేది పాలుపోదు. ఇంద్రజిత్తు బాణాలకు వానరులు పిట్టల్లా రాలిపోతుంటారు. రామలక్ష్మణులను మరింత బలహీన పరచడం కోసం, సీత తలను నరికినట్టుగా మాయా శిరస్సును చూపిస్తాడు ఇంద్రజిత్తు. అది నిజమేనని భావించిన రాముడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. వానర వీరులు ఆయనకి సపర్యలు చేస్తూ ఉండగా, లక్ష్మణుడు ఒంటరిగా ఇంద్రజిత్తును ఎదుర్కొంటాడు. ఇంద్రజిత్తు వదిలిన బ్రహ్మాస్త్రానికి లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు.
విభీషణుడి మాటలతో రాముడు తెలివి తెచ్చుకుంటాడు. ఇందరజిత్తు చేతిలో అతను చూసింది మాయా సీత శిరస్సు అని విభీషణుడు చెప్పగా ఆయన మనసు కుదుట పడుతుంది. లక్ష్మణుడు కూడా స్పృహ కోల్పోయినట్టు వానరులు చెప్పడంతో రాముడు ఆందోళన చెందుతాడు. ఎంతసేపటికీ లక్ష్మణుడిలో కదలిక లేకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. కంగారుపడవలసిన పనిలేదని చెప్పిన సుషేణుడు, సూర్యోదయం కాకముందే సంజీవిని మొక్క తీసుకు రాగలిగితే ఫలితం ఉంటుందని రాముడితో చెబుతాడు. ఆ మొక్క ఎక్కడ దొరుకుతుందనేది హనుమంతుడికి వివరిస్తాడు. అంతే, మరుక్షణమే హనుమంతుడు ఆ దిశగా ఆకాశ మార్గాన బయల్దేరతాడు.
సుషేణుడు చెప్పిన ప్రదేశానికి చేరుకున్న హనుమంతుడు సంజీవిని మొక్క కోసం వెదకడం మొదలుపెడతాడు. అయితే ఆ పర్వతంపై ఎన్నో రకాల మొక్కలు ఉండటం వలన, వాటిలో సంజీవిని మొక్కను వెదకడం కష్టమవుతుంది. సుషేణుడికి ఆ మొక్క లక్షణాలు క్షుణ్ణంగా తెలుసు గనుక, సమయాన్ని వృథా చేయకుండా ఆ పర్వతాన్ని అక్కడికి తీసుకెళ్లడమే మంచిదని భావించి పర్వతాన్ని పెకిలించుకుని వెళతాడు. అలా సూర్యోదయం కాకుండానే వెళ్లి లక్ష్మణుడి ప్రాణాలు నిలబెడతాడు. రాముడి అభినందనలు అందుకుంటాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 58 : Lakshmana unconscious
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.