Ramayanam – 60 : Ravana death

ఇంద్రజిత్తు మరణించాడనే విషయం తెలియగానే రావణుడు తన ఆసనంపై తూలిపడతాడు. మహా వీరుడు తన కుడిభుజం వంటి కుమారుడు మరణించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతాడు. తన ప్రియ పుత్రుడిని వధించిన రామలక్ష్మణులను వదిలిపెట్టనని చెప్పి ధనుస్సును, గదను చేతబట్టుకుని రథంపై యుద్ధభూమికి చేరుకుంటాడు. మూర్తీభవించిన రాముడి రూపాన్ని చూసి రావణుడికి ముచ్చటగా అనిపిస్తుంది. అలాగే రావణుడి తేజస్సు చూసి రాముడు కూడా ఆశ్చర్యపోతాడు. ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది.

రాముడి బాణాల ధాటికి రావణుడు తట్టుకోలేకపోతుంటాడు. రావణుడి రథంపై జెండాను, ఆయన ధనస్సును రథాన్ని క్షణాల్లో రాముడు ముక్కలుగా చేసేస్తాడు. ఆయన మెరుపు వేగానికి రావణుడు బిత్తరపోతాడు. చేతిలో ఆయుధం లేనివారిని తాను సంహరించననీ, చేసింది తప్పా ఒప్పా అనేది ఒకసారి ఆలోచించుకుని మరుసటి రోజు యుద్ధానికి రమ్మని చెబుతాడు రాముడు. ఆయన అలా క్షమించి తనని వదిలివేసినందుకే రావణుడు చాలా బాధపడతాడు. ఒక నరుడు తనకి క్షమా భిక్ష పెట్టడమా అనే అవమానంతో ఆలోచనతోనే ఆయన తన భవనానికి చేరుకుంటాడు.

మరుసటి రోజు ఎప్పటిలానే శివపూజ చేసిన రావణుడు, యుద్ధానికి బయల్దేరతాడు. రాముడితో యుద్ధం వద్దని మండోదరి మరోసారి చెబుతుంది. తనమాటను మన్నించమని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయినా ఆమె మాటలను రావణుడు పట్టించుకోడు. తన వాళ్లంతా తన కోసం ప్రాణాలను అర్పిస్తే, తాను మాత్రం తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం అస్త్ర సన్యాసం చేయడం ధర్మం కాదని యుద్ధభూమికి వెళతాడు. పది శిరస్సులతో రాముడి ముందు నిలిచి, యుద్ధం చేయమని అంటాడు. రాముడు వదిలిన బాణాలకు రావణుడి తలలు తెగుతుంటాయి తిరిగి అతుకుతుంటాయి. దాంతో రావణుడు వికటాట్టహాసం చేస్తూ ఉంటాడు.

అస్త్రాలు వృథా అవుతుంటాయేగానీ, రావణుడు మాత్రం అలా నిలబడే ఉంటాడు .. గర్వంతో నవ్వుతూనే ఉంటాడు. దాంతో రాముడు అయోమయానికి లోనవుతాడు. అది గమనించిన విభీషణుడు రాముడి దగ్గరికి వస్తాడు. రావణుడు అలా చావడనీ, అతను ప్రాణాలు అతని నాభి ప్రదేశంలోని అమృతభాండంలో ఉన్నాయని చెబుతాడు. అక్కడ బాణంతో కొట్టడం వల్లనే రావణుడు మరణిస్తాడని అంటాడు. రాముడి బాణ ప్రయోగంతో రావణుడు నేల కూలతాడు. చివరి క్షణాల్లో రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా గోచరించడంతో, ఆయనకి నమస్కరిస్తూ రావణుడు ప్రాణాలు వదులుతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 60 : Ravana death

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: