Ramayanam – 65 : Lord Rama coronation

అయోధ్య నగర వాసుల సమక్షంలో, వశిష్ఠుడు తదితర మహర్షులు శ్రీరాముడికి పట్టాభిషేకం జరుపుతారు. శ్రీరాముడిని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి ఆయన శిరస్సుపై కిరీటాన్ని ఉంచుతాడు వశిష్ఠ మహర్షి. అయోధ్య వాసులంతా జయజయ ధ్వానాలు చేస్తారు. రాముడు వశిష్ఠాది మహర్షులు, గురువులు, పెద్దల ఆశీస్సులు అందుకుంటాడు. విభీషణుడు, గుహుడు, వానర వీరులందరినీ తగిన కానుకలతో సత్కరిస్తాడు. రాముడి పట్టాభిషేక మహోత్సవాన్ని కనులారా తిలకించిన సంతృప్తితో విభీషణుడు లంకకు బయల్దేరతాడు. వానరులు కిష్కింధకు వెళతారు.

కాలం గడిచిపోతుంటుంది, అయోధ్య నగరం సుభిక్షంగా పరిపాలించబడుతూ ఉంటుంది. రాముడు ధర్మబద్ధంగా తన పాలన కొనసాగిస్తూ, ప్రజల మనసులను దోచుకుంటాడు. రామరాజ్యంలో సమయానికి వానలు కురుస్తూ పంటలు పండుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవిస్తూ ఉంటారు. ఎలాంటి దొంగతనాలు, దోపిడీలు, మోసాలు, అరాచకాలు లేకపోవడంతో అందరూ హాయిగా ఉంటూ ఉంటారు. తన పాలన గురించి ప్రజలు ఏమంటున్నది వేగుల ద్వారా తెలుసుకుంటూ, ప్రజలకి ఇబ్బంది కలిగించని విధంగా రాముడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు.

రాముడికి దూరమై మానసికంగా నలిగిపోయిన సీతాదేవి, ఆ విషయాలను మరిచిపోయి హాయిగా కాలాన్ని గడుపుతూ ఉంటుంది. ముగ్గురు అత్తల విషయంలోను ఒకే విధమైన గౌరవాన్ని కలిగివుండి, తోటికోడళ్లతో ఎంతో అనురాగంతో మసలుకుంటూ ఉంటుంది. రాముడికి సేవ చేస్తూ పాలనా భారంతో అలసిన ఆయన మనసుకు సాంత్వన కలిగిస్తూ ఉంటుంది. సీతాదేవి గర్భవతి అవుతుంది .. ఆ విషయం తెలియగానే అంతఃపురంలో సందడి మొదలవుతుంది.

గర్భవతి అయిన సీతాదేవిని అత్తలు, తోడికోడళ్లు ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. రాముడు కూడా మునుపటికంటే ఎక్కువ ప్రేమానురాగాలతో ఆమె మనసుకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఆమెకి సంతోషాన్ని కలిగించే పనులను క్షణాల్లో ఆచరణలో పెడుతూ ఉంటాడు. తన మనసు మరింత ప్రశాంతతను కోరుకుంటుందనీ, తపోవనాలకు వెళ్లి మహర్షుల ఆశీస్సులు అందుకోవాలని ఉందనే విషయాన్ని ఆమె రాముడితో చెబుతుంది. అలాగే వెళ్లివద్దామని రాముడు ఆమెతో అంటాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 65 : Lord Rama coronation

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: