Today rashi phalalu – 09 మార్చి 2023, గురువారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. Check today horoscope in Telugu by renowned astrologer Vakkantham Chandramouli gaaru.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం. భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు పరిష్కారం. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు సమయానికి అవకాశాలు దక్కుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నూతనోత్సాహం. ఉద్యోగవర్గాలకు అన్ని విధాలా అనుకూల సమయం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు అవకాశాలు ఊహించని విధంగా దక్కుతాయి. విద్యార్థులకు పరిశోధనాంశాలపై ఆసక్తి. మహిళలకు సంతోషకరమైన సమాచారం. అనుకూల రంగులు……. బంగారు, కాఫీ. ప్రతికూల రంగు..నీలం. గణపతికి అర్చన చేయించుకుంటే మంచిది.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

కుటుంబంలో చికాకులతో గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. కొన్ని కార్యక్రమాలను ఎంత శ్రమపడ్డా పూర్తి చేయలేరు. దేవాలయాలు సంధర్శిస్తారు. భూవివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆదాయం అంతగా లేక కొంత ఇబ్బంది పడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు విస్తరణ కార్యక్రమాలపై కొంత నిర్లక్ష్యం వహిస్తారు. ఉద్యోగులకు విధులు ముందుకు సాగవు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు అనుకోని అవకాశాలు దక్కించుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు. మహిళలకు నిరాశాజనకం. అనుకూల రంగులు……. పసుపు, గోధుమ. ప్రతికూల రంగు..నీలం. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


వ్యయప్రయాసలు తప్పవు. కొన్ని కార్యక్రమాలను ఎట్టకేలకు పూర్తి చేస్తారు. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు కలసిరావు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆదాయం తగ్గి నిరుత్సాహపడతారు. కాంట్రాక్టర్లకు అనుకూల సమాచారం. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొంత నిదానం పాటించడం ఉత్తమం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు. విద్యార్థులు కొంత నిదానం పాటించడం మంచిది. మహిళలకు ఆరోగ్యసమస్యలు. అనుకూల రంగులు……. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. ఆంజనేయ దండకం పఠించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


కుటుంబ సభ్యులతో మనస్సులోని భావాలను పంచుకుంటారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఇంటాబయటా వివాదాలు, సమస్యలు తీరతాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలపై చర్చలు సఫలం. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలతో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులలో ఆందోళన తొలగుతుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు శుభవార్తలు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మహిళలకు ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు…ఎరుపు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


అనుకున్న కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. నిరుద్యోగుల దీర్ఘకాలిక నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సజావుగా సాగుతాయి. ఉద్యోగులు విధులు చాకచక్యంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు విశేష పేరు గడిస్తారు. విద్యార్థులు కొత్త అవకాశాలు లభిస్తాయి. మహిళలకు స్థిరాస్తి లాభం కలుగుతుంది. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, బంగారు. ప్రతికూల రంగు… కాఫీ. హనుమాన్ ఛాలీసా పఠించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


కొత్త వ్యక్తుల పరిచయంతో ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యాలకు నేతృత్వం వహిస్తారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. విలువైన సమాచారం అంది అనుగుణంగా అడుగులు వేస్తారు. ఆదాయం మీ అవసరాలకు తగినంతగా లభిస్తుంది. బంధువుల ద్వారా ఆహ్వానాలు రాగలవు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం.. కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు మరింత ఉత్సాహం. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు…. … ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు… గులాబీ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


ఆకస్మిక ప్రయాణాలు. రుణ ఒత్తిడులతో సతమతం కాగలరు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. బంధుగణం నుంచి ఒత్తిడులు. రావలసిన సొమ్ము అందడంలో జాప్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. నిర్ణయాలలో తొందరపాటు తగదు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నిరుత్సాహమే. ఉద్యోగాలలో పనిభారంతో ఇబ్బంది పడతారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు సమస్యలు మరింత మీదపడతాయి. విద్యార్థులు కొంత ఓపిక వహించాలి. మహిళలకు స్వల్ప అనారోగ్యం. అనుకూల రంగులు…. … గోధుమ,తెలుపు. ప్రతికూల రంగు… కాఫీ. సుబ్రహ్మణ్యేశ్వరునికి పూజలు జరిపించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఆర్థిక వ్యవహారాలలో కొంత పురోగతి సాధిస్తారు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు ఎదురుకావచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో అకారణంగా విభేదిస్తారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులతో కొంత అవస్థలు. భార్యాభర్తల మధ్య విభేదాలు నెలకొంటాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు అనుకున్నంత ప్రగతి లేక నిరాశ చెందుతారు. ఉద్యోగులకు మరింత పనిఒత్తిడులు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు…. … గులాబీ,లేతఎరుపు. ప్రతికూల రంగు…పసుపు. ఆదిత్య హృదయం పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


ఉద్యోగ యత్నాలు సఫలం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంటిలో వేడులక నిర్వహణలో నిమగ్నమవుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలించి రుణాలు తీరుస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. కాంట్రాక్టర్లకు కొద్దిపాటి చికాకులు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులు వివాదాల బారి నుండి బయటపడతారు. రాజకీయవేత్తలకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు అనుకూల పరిస్థితి. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. అనుకూల రంగులు…. … గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు… తెలుపు. శ్రీ రామరక్షా స్తోత్రం పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. అనుకోని ప్రయాణాలు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆస్తి విషయాలలో కొన్ని వివాదాలు. భార్యాభర్తల చిన్న విషయాలౖపై మనస్పర్థలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు శ్రమపడతారు అయితే ఫలితం కానరాదు. విద్యార్థులు మరింత శ్రమపడాలి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు…. .. గులాబీ, నీలం. ప్రతికూల రంగు…నేరేడు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు నిరాశకు లోనవుతారు. ఉద్యోగులకు విధుల్లో కొత్త సమస్యలు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు నిరాశ చెందుతారు. విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు…. … గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…గులాబీ. గణేశ్ స్తోత్రాలు పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో మీపట్ల అభిమానం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి సహాయం పొందుతారు. అదనపు ఆదాయం దక్కి అవసరాలకు ఆదుకుంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు సమసిపోతాయి. వాహనాలు, నగలు కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మీకు అనుకూలంగా మారతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. క్రీడాకారులు, చిత్రపరిశ్రమ వారు విదేశాలకు పయనమవుతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. మహిళలకు ఉద్యోగ, విద్యాయోగాలు. అనుకూల రంగులు…. … ఎరుపు. కాఫీ. ప్రతికూల రంగు… నేరేడు. సూర్యారాధన చేయండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: