Today rashi phalalu – 10 మార్చి 2023, శుక్రవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. Check today horoscope in Telugu by renowned astrologer Vakkantham Chandramouli gaaru.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఉద్యోగ యత్నాలు కొంత అనుకూలిస్తాయి. చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆభరణాలు, వాహనాలు కొంటారు. వివాహ,ఉద్యోగ యత్నాలు సఫలం. కాంట్రాక్టర్లకు చికాకులు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అన్ని విధాలా లాభదాయకం. ఉద్యోగులకు అధికారుల ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఊహించని ఆహ్వానాలు. విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు…. … గులాబీ, బంగారు. ప్రతికూల రంగు…నీలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

రాబడి తగ్గి నిరాశ చెందుతారు. మిత్రులతో విరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. భూవివాదాలు ఏర్పడవచ్చు. శ్రమ పడ్డా ఆశించిన ఫలితం ఉండదు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు గందరగోళం. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు తప్పవు. విద్యార్థులు అందిన అవకాశాలు చేజారతాయి. మహిళలకు కొన్ని చికాకులు. అనుకూల రంగులు…. … ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు…నేరేడు. గణపతిని పూజించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


కార్యక్రమాలలో కొన్ని ఆటంకాలు. ఇంటాబయటా సమస్యలతో ఇబ్బందిపడతారు. సన్నిహితులతో అకారణంగా విభేదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు భాగస్వాములతోనే వివాదాలు. ఉద్యోగులకు విధులు ఇబ్బందికరంగా మారవచ్చు. క్రీడాకారులు వైద్యులు ఆచితూచి అడుగులు వేయాలి. విద్యార్థులు ఎంత కృషి చేసినా ఫలితం శూన్యం. మహిళలు కొంత నిరాశ చెందుతారు. అనుకూల రంగులు…. … గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు…తెలుపు. నరసింహస్వామిని పూజించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


కొత్త కార్యక్రమాలను సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహణ ఏర్పాట్లలో బిజీగా గడుపుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అనుకున్న పెట్టుబడులు, లాభాలు రాగలవు. ఉద్యోగులకు ఉత్సాహవంతమైన కాలం. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి.. విద్యార్థులకు చికాకులు తొలగుతాయి. మహిళలు ఆస్తి లాభాలు పొందుతారు. అనుకూల రంగులు…. … పసుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు… గోధుమ. శివాలయ దర్శనం మంచిది.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


ఆదాయం అంతగా కనిపించదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. కార్యక్రమాలలో ఆటంకాలు కొంత అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్వల్ప అస్వస్థతతో ఇబ్బంది పడతారు. మిత్రులు, కుటుంబ సభ్యులతో మాటపొసగదు. నిర్ణయాలలో ఏ మాత్రం తొందరపడ్డా చిక్కులు ఎదురుకాగలవు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలపై కొంత నిర్లిప్తతతో ఉంటారు. ఉద్యోగాల్లో హడావిడి, ఆందోళన తప్ప ఫలితం కనిపించదు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు చికాకులతో గడుపుతారు. విద్యార్థులు కొన్ని అవకాశాలు చేరి నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు…. … తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు…ఎరుపు. దుర్గా మాతను పూజించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అందరిలోనూ ప్రత్యేకతను నిలుపుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. కార్యక్రమాలను కష్టసాధ్యమైనా చకచకా పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లకు శ్రమానంతరం కొంత ఫలితం ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధులు ప్రశాంతంగా సాగిపోతాయి. వైద్యులు, చిత్రపరిశ్రమ వారు తమ నైపుణ్యాన్ని చాటుకుంటారు. విద్యార్థులకు మరింత అనుకూల పరిస్థితులు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. అనుకూల రంగులు……. ఆకుపచ్చ,గోధుమ. ప్రతికూల రంగు…నలుపు. శివ స్తోత్రాలు పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


బంధుమిత్రులతో విరోధాలు. శ్రమ పడినా ఫలితం కనిపించదు. శారీరక రుగ్మతలు వేధిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు మరింత నిదానంతో వ్యవహరించాలి. ఉద్యోగులకు విధులు కొంత భారంగా మారవచ్చు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు చిక్కులు. విద్యార్థులు ఫలితాల పై నిరాశ చెందుతారు. మహిళలు కుటుంబ సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. అనుకూల రంగులు…. … ఎరుపు, కాఫీ. ప్రతికూలం…తెలుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. బ«ంధువులతో సఖ్యత నెలకొంటుంది. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. ఒక ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఆశలు పుట్టిస్తుంది. కుటుంబ సభ్యుల సలహాల మేరకు ముందడుగు వేస్తారు. ఆస్తి వివాదాలను బంధువులతో రాజీ ద్వారా పరిష్కతరించుకుంటారు. వాహనాలు, స్థలాలు సమకూర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మరింత సంతోషదాయకంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ఒత్తిడులను అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. విద్యార్థులు విదేశీ అవకాశాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో గౌరవం. అనుకూల రంగులు…. … లేత ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. హనుమాన్ ఛాలీసా పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. భూముల క్రయవిక్రయాలలో అవాంతరాలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహ యత్నాలు సానుకూలమై ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలబాటలో నడుస్తారు. ఉద్యోగులకు విధులలో హుషారుగా గడుస్తుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు అనుకూల సమాచారం అందుతుంది. విద్యార్థులు అవకాశాలు దక్కి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. మహిళలకు కుటుంబసభ్యుల సాయం అందుతుంది. అనుకూల రంగులు….. గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…గులాబీ. శివాష్టకం పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


పనులలో కొన్ని అవాంతరాలు. రాబడి తగ్గి నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్ప ఫలితం ఉండదు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పరిస్థితులు అనుకూలించవు. ఉద్యోగులకు విధులు భారంగా మారవచ్చు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. విద్యార్థులకు నిరాశ తప్పదు. మహిళలు మానసిక అశాంతికిలోనవుతారు. అనుకూల రంగులు…. … గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. దుర్గాదేవిని పూజించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. బంధువులతో విభేదాలు తప్పవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలపై కొంత నిరుత్సాహపడతారు. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులకు ఫలితాల పై నిరుత్సాహం. మహిళలు ఆస్తి వివాదాలతో సతమతమవుతారు. అనుకూల రంగులు……. కాఫీ, గులాబీ. ప్రతికూల రంగు…ఎరుపు. గణపతిని పూజించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల ప్రగతికి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు ఒక సంతోషకర సమాచారం అందుతుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మహిళలకు కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది. అనుకూల రంగులు…. … పసుపు, ఎరుపు ప్రతికూల రంగు….నలుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: