Sri Bhagavatam – An incarnation of Kalki
శుక మహర్షి .. లోక కల్యాణం కోసం శ్రీమహా విష్ణువు ధరించిన అవతారాలను గురించి, ఆ అవతారలలో స్వామివారి లీలా విశేషాలను గురించి పరీక్షిత్తు మహారాజుతో చెబుతాడు. అయితే రానున్న “కల్కి” అవతారం ఎలా ఉంటుంది? అనే విషయాన్ని గురించి తెలియజేయమని శుక మహర్షిని పరీక్షిత్ మహారాజు కోరతాడు. దాంతో ఆయనకి ఆ విషయాన్ని చెప్పడం మొదలు పెడతాడు శుక మహర్షి.
వ్యాస మహర్షి చెప్పిన ప్రకారం శ్రీమహావిష్ణువు కల్కి అవతారాన్ని ధరిస్తాడు. తెల్లని గుర్రాన్ని అధిరోహించిన కల్కి, ఖడ్గాన్ని చేతబూని ఉంటాడు. కలియుగం అంతమై .. మరలా కృతయుగం ప్రారంభం కావడానికి మధ్య కాలంలో కల్కి “శంభాలా” గ్రామంలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. కల్కి అవతారంలో స్వామివారు జన్మించే సమయానికి లోకంలో పరిస్థితులు భయానకంగా ఉంటాయి.
అప్పటికి మానవులు యజ్ఞయాగాలు చేయడం మరిచిపోతారు .. భగవంతుడిపై విశ్వాసాన్ని వదిలేస్తారు. ఏదైనా తమ తెలివి తేటలతోనే సాధించామని భావిస్తారు. అంతా తమ గొప్పతనమేనని కొంతమంది విర్రవీగుతూ ఉంటే, అసలు భగవంతుడేలేడు అని మరికొందరు చాటుతుంటారు. మరికొందరు భగవంతుడి ఉనికిని ప్రశ్నిస్తూ వాదన చేయడం మొదలు పెడతారు. ఇలాంటి వాళ్లంతా పూజలకు దేవుడిని దూరం పెడాతారు. నైవేద్యాలు మాత్రం తమ కోసం వండుకుంటారు.
ఏది ధర్మం .. ఏది అధర్మం అనే విషయమై ఎవరూ ఆలోచన చేయరు. బలవంతుడు చేసేది ధర్మం అవుతుంది .. అతను చేసే అధర్మంలో పాలుపంచుకునేవారే తప్ప, ప్రశ్నించేవారు మాత్రం ఉండరు. బలవంతులు రాజ్యమేలుతూ ఉండగా .. బలహీనులు అయిష్టంగానే వాళ్ల అధికారాన్ని .. అన్యాయాలను భరిస్తూ ఉంటారు. భగంతుడిని మాత్రమే ఆశ్రయించినవాళ్లు బ్రతకడమే కష్టమైపోతుంది. గుణహీనులు వాళ్లను అవమాన పరుస్తూ ఆనందాన్ని పొందుతుంటారు . అలాంటి పరిస్థితుల్లో కల్కి ఉద్భవిస్తాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Sri Bhagavatam – An incarnation of Kalki