Ramayanam – 34 : Hanuman enters Lanka visits Sita
లంకిణిని దాటుకుని సూక్ష్మ రూపంలో లంకానగరంలోకి హనుమంతుడు ప్రవేశిస్తాడు. సీతాదేవి కోసం అనేక భవనాలను వనాలను వెదుకుతూ, చివరిగా అశోకవనంలోకి చేరుకుంటాడు. ఒక చెట్టుక్రింద శోక మూర్తియైన ఒక స్త్రీ కూర్చుని ఉండటం చూస్తాడు. ఆమెనే సీతాదేవి అయ్యుంటుందని భావిస్తాడు. అదే సమయంలో రావణుడు అక్కడికి వస్తాడు. ఆమెకి ఇచ్చిన ఏడాది గడువులో రెండు మాసములు మాత్రమే మిగిలి ఉన్నాయనే విషయాన్ని గుర్తుచేస్తూ, మనసు మార్చుకోమని సీతాదేవిని హెచ్చరిస్తాడు. తన భర్త అయిన రాముడి చేతిలో అతనికి మరణం తప్పదని సీత అనడం వింటాడు. ఆమెనే సీతాదేవి అనే విషయం ఆయనకి స్పష్టమవుతుంది.
రావణుడు అక్కడి నుంచి వెళ్లగానే కాపలా ఉన్న రాక్షస స్త్రీలు కూడా వేరే పనులపై అక్కడి నుంచి వెళతారు. అదే సరైన అవకాశంగా భావించిన హనుమంతుడు, సీతాదేవి ముందుకు వస్తాడు. ఆమె చూస్తూ ఉండగానే తన నిజ రూపాన్ని ధరిస్తాడు. తాను రాముడి దూతననీ, రాముడు పంపించగా వచ్చానని చెబుతాడు. అయితే రావణుడి అనేక మాయలను చూసి ఉన్న కారణంగా సీతాదేవి అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది. దాంతో రాముడు తనకి ఇచ్చిన ఉంగరాన్ని సీతాదేవికి అందజేస్తాడు. ఆ ఉంగరం చూడగానే ఒక్కసారిగా సీతాదేవి ముఖం సంతోషంతో విప్పారుతుంది.
రాముడు క్షేమ సమాచారాన్ని గురించి సీతాదేవికి హనుమంతుడు చెబుతాడు. సీతాదేవి కోసం రాముడు ఎంతగా తపిస్తున్నది వివరిస్తాడు. తన భుజాలపై కూర్చుంటే రాముడి దగ్గరికి చేరుస్తానని చెబుతాడు. అలా చేయడం రాముడి శౌర్య పరాక్రమాలను తక్కువ చేసినట్టు అవుతుందనీ, రాముడే వచ్చి రావణుడి అంతుచూసి తనని తీసుకు వెళ్లడమే సరైనదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే అది తప్పకుండా జరుగుతుందనీ, రాముడికి వానర సైన్యం అండదండలు ఉన్నాయని హనుమంతుడు అంటాడు.
సీతాదేవి ధైర్యంగా ఉండటం కోసం ఆమెలో ఏ మూలన ఎలాంటి సందేహాలు ఉన్నా అవి పటాపంచలు కావడం కోసం హనుమంతుడు తన శరీరాన్ని పెంచుతాడు. ఒక పర్వతంలా ఎదిగిన హనుమంతుడిని చూసిన సీతకు మనసు తేలిక పడుతుంది. రాముడికి సహకరించే వానర సేనలో తనకంటే బలశాలురు చాలామందే ఉన్నారని చెప్పిన హనుమంతుడు ఆమెకి మరింత ఆనందాన్ని కలిగిస్తాడు. సీతమ్మతల్లిని తాను చూసినట్టుగా చెప్పడానికి గాను ఏదైనా గుర్తుగా ఇవ్వమని హనుమంతుడు అడగడంతో, తన చూడామణిని ఆమె అందజేస్తుంది. అది తీసుకున్న హనుమ భక్తి పూర్వకంగా కళ్లకు అద్దుకుని దానిని పదిలపరచుకుంటాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 34 : Hanuman enters Lanka visits Sita
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.