Ramayanam – 54 : Kumbhakarna story .. trying to wake him up
రావణుడి సోదరుడే కుంభకర్ణుడు, ఆయన మహా భారీకాయుడు. ఆరు నెలలపాటు నిద్రపోతూనే ఉంటాడు. ఆ తరువాత లేచి అప్పటికే భారీస్థాయిలో ఏర్పాటు చేసి ఉంచబడిన ఆహారాన్ని ఆరగించి, తిరిగి మరో ఆరునెలల పాటు నిద్రపోతాడు. కుంభకర్ణుడు అలా నిద్రపోవడానికి గల కారణంగా ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. తన సోదరుడైన రావణుడు తపస్సు చేసి, బ్రహ్మ నుంచి అనేక వరాలను పొందాడు. అందువలన తాను కూడా అలాగే వరాలను పొందాలని భావించి కఠోర తపస్సు చేస్తాడు.
కుంభకర్ణుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ఆయన కోరిన వరాలను ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయం తెలిసిన ఇంద్రాది దేవతలు బ్రహ్మను కలుసుకుంటారు. కుంభకర్ణుడు మహా బలవంతుడనీ, ఆయనకి వరాలను ఇవ్వడం సరికాదని చెబుతారు. ఆ వరాల కారణంగా కుంభకర్ణుడి ఆగడాలను తట్టుకోవడం అసాధ్యమవుతుందని అంటారు. దాంతో తన కోసం తపస్సు చేసినవాడికి వరాలను ఇవ్వకుండా ఉండటం ఎలా? అనే ఆలోచనలో బ్రహ్మదేవుడు పడతాడు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించవలసిన బాధ్యత సరస్వతీదేవిదేనని అంతా ఆమెను అభ్యర్థిస్తారు.
కుంభకర్ణుడి ఎదుట బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. ఆయన తన మనసులోని కోరికను బయటికి చెప్పాలను అనుకుంటూ ఉండగా, సరస్వతీదేవి ఆయన వాక్కును మార్చేస్తుంది. దాంతో తనకి ఎప్పటికీ నిద్రకావాలని కుంభకర్ణుడు కోరతాడు. ఏడాదిలో ఆరు నెలలపాటు నిద్రించి, ఆ తరువాత భోజనం చేసి మళ్లీ ఆరు నెలలపాటు నిద్రించమని బ్రహ్మదేవుడు వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ ఆరునెలల నిద్రాకాలంలో మధ్యలో మెలకువ పొందిన రోజున ఆయన ఆయుష్షు తీరుతుందని చెబుతాడు.
అలా బ్రహ్మదేవుడి వరం కారణంగా కుంభకర్ణుడు నిద్రిస్తూ ఉంటాడు. ఆరునెలలు పూర్తికాగానే ఆయనకి కావలసిన ఆహారాన్ని సమకూర్చేవారు. దానిని ఆరగించేసి మళ్లీ పడుకునేవాడు. అలా కొన్నేళ్లుగా నిద్రిస్తున్న కుంభకర్ణుడిని ఇప్పుడు రాముడిపై యుద్ధం చేయడానికి లేపమని రావణుడు ఆదేశిస్తాడు. ఆయన పరివారమంతా కూడా అదేపనిలో ఉంటారు. కుంభకర్ణుడిని నిద్రలేపడానికి తమకి తోచిన ప్రయత్నాలు చేస్తుంటారు. ఆయన కాస్త అటూ ఇటూ కదిలినప్పుడు కొంతమంది సైనికులు ఆయన క్రిందపడి నలిగిపోతుంటారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 54 : Kumbhakarna story .. trying to wake him up
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.