Ramayanam – 56 : Kumbhakarna advises Ravana
మహావీరుడు సమస్త సైన్యమును నడిపిన సమర్థుడు ప్రహస్తుడు యుద్ధభూమిలో మరణించాడని తెలియగానే రావణుడు నిర్ఘాంతపోతాడు. ప్రహస్తుడి భుజబలంపై తాను పెట్టుకున్న నమ్మకం ఆవిరైపోవడంతో ఆయన నిరాశచెందుతాడు. ముఖ్యంగా యుద్ధానికి సంబంధించిన అనేక వ్యూహాలను గురించి తనకి చెప్పే ప్రహస్తుడు లేని లోటు ఎవరూ పూడ్చలేనిదంటూ ఆవేదన చెందుతాడు. అంతలో కుంభకర్ణుడు నిద్రనుంచి లేచినట్టుగా ఆయనకి తెలుస్తుంది. వానరసైన్యాన్ని సముద్రం ఆవలి వరకూ తన సోదరుడు తరిమికొట్టగలడనే ఆశ ఆయనకి కలుగుతుంది.
రావణుడి నుంచి కబురు రాగానే కుంభకర్ణుడు ఆయన దగ్గరికి వెళతాడు. తనని నిద్రనుంచి లేపిన కారణమేమిటని అడుగుతాడు. తాను సీతను అపహరించడం, ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలను గురించి రావణుడు ఆయనకి వివరంగా చెబుతాడు. రామలక్ష్మణులు తనని హెచ్చరించిన తీరు, ఆ తరువాత యుద్ధానికి దిగిన విధానాన్ని గురించి చెబుతాడు. యుద్ధంలో తమ వీరులు నేలకొరుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. వానరసేనపై ఒక్కసారిగా విరుచుకుపడి, విజయాన్ని వెంటతీసుకుని రమ్మని అంటాడు.
రావణుడు చెప్పినది విన్న తరువాత కుంభకర్ణుడి నిద్ర పూర్తిగా ఎగిరిపోతుంది. సీతను అపహరించడం రావణుడు చేసిన తప్పేనని అంటాడు. ఎవరికీ ఎలాంటి అపకారం చేయకుండా వనాల్లో ఉన్నవారితో గొడవ పెట్టుకుని దానిని యుద్ధం వరకూ తెచ్చుకోవడం సరైనపని కాదని చెబుతాడు. సీతను అపహరించడం తప్పు అని ఒప్పుకుని, తిరిగి ఆమెను రాముడికి అప్పగించడమే ఈ సమస్యకి పరిష్కారమని అంటాడు. అలా తప్పును అంగీకరించడం వలన రాజ్యం, అధికారం, వారసత్వం నిలుస్తాయని చెబుతాడు.
కుంభకర్ణుడి మాటలు వినగానే రావణుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. ఆయనను నిద్రనుంచి లేపింది తనకి నీతి సూత్రాలు చెప్పడానికి కాదని అంటాడు. అడుగడుగునా తనకి అండగా నిలిచిన మహావీరులు యుద్ధంలో మరణించిన తరువాత తాను తప్పు ఒప్పుకోవడం సరికాదని చెబుతాడు. అది ప్రాణాలు నిలుపుకోవడం కోసం చేసే స్వార్థపూరితమైన పని అవుతుందని అంటాడు. ఇక కాలయాపన చేయకుండా, వెంటనే యుద్ధరంగంలోకి దిగమని చెబుతాడు. ఆరు నెలలు పూర్తి కాకుండానే నిద్ర మధ్యలో లేచిన కుంభకర్ణుడు, తాను చనిపోతానని తెలిసే యుద్ధభూమిలో అడుగుపెడతాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 56 : Kumbhakarna advises Ravana
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.