Ramayanam – 66 : Spies meets Rama
రాముడి జీవితం ఆయన పాలన సాఫీగా సాగిపోతూ ఉంటాయి. ప్రజల సమస్యలను గూఢచరుల ద్వారా తెలుసుకుంటూ, వెంటనే వాటిని పరిష్కరిస్తూ ఉంటాడు. ఆయన అయోధ్యకి నలువైపులా పంపించిన గూఢచారులు ఎప్పటిలానే రాముడిని రహస్య మందిరంలో కలుసుకుంటారు. నగరంలోని పరిస్థితులు ఏమిటి? తన పాలనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏ విషయాల్లో వాళ్లు అసంతృప్తిగా ఉన్నారు? ఎవరు ఏ కారణంగా బాధపడుతున్నారు? వంటి ప్రశ్నలను రాముడు అడుగుతాడు.
రాముడి పాలనలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుందనే ప్రజలంతా అనుకుంటున్నారనీ, ఎలాంటి భయాలు లేకుండా వాళ్లంతా ఆనందంగా, హాయిగా ఉంటున్నారని చెబుతారు. అధర్మం, అవినీతి అనే మాటలు వినడానికి కూడా ప్రజలు ఇష్టపడటం లేదనీ, ధర్మాన్ని నిలబెట్టడానికి రాముడే అన్ని కష్టాలు పడినప్పుడు, తమలాంటివారము అధర్మానికి పాల్పడకూడదనే ఆలోచనలో ఉన్నారని అంటారు. ధర్మాన్ని నిలబెట్టడానికి రాముడితో పాటే తామూను అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెబుతారు.
అలా వాళ్లంతా చెబుతూ ఉంటే రాముడికి ఆనందం కలుగుతుంది. అలా వచ్చిన వాళ్లలో భద్రుడు అనువాడు, ఏదో విషయాన్ని చెప్పడానికి సంశయిస్తూ ఉండటాన్ని రాముడు గమనిస్తాడు. ఏమీ లేదంటూ ఆయన అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు. తన దగ్గర అతను ఏదో విషయాన్ని దాస్తున్నాడని గ్రహించిన రాముడు, అక్కడి నుంచి మిగతావారిని పంపించేస్తాడు. వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోగానే, ఏం జరిగిందో చెప్పమని రాముడు అడుగుతాడు. తన పాలనలో ఏదైనా లోపం ఉందా? ఎవరైనా ఏమైనా అన్నారా? అని ప్రశ్నిస్తాడు.
రాముడి పాలన గురించి ఎవరూ చెడుగా అనుకోవడం లేదనీ, ప్రజలంతా తమ ప్రభువుగా పదికాలాల పాటు రాముడే ఉండాలని కోరుకుంటున్నారని అంటాడు. అయితే ఒక చోట మాత్రం తాను వినకూడని మాటను విన్నానని చెబుతాడు. భార్యను అనుమానించిన ఒక వ్యక్తికి అక్కడున్న పెద్దలు నచ్చజెప్పడానికి ప్రయత్నించారనీ, ఎవరేది చెప్పినా నమ్మడానికి నేను రాముడిని కాను, ఆయనలా పరుల ఇంట ఉండివచ్చిన భార్యను ఏలుకోవడం నా వల్ల కాదు అంటూ అతను మాట్లాడాడని చెబుతాడు. ఆ మాటలు వినగానే రాముడి కాళ్ల క్రింద భూమి కదిలిపోతుంది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 66 : Spies meets Rama
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.