Ramayanam – 78 : Lava Kusha reciting Ramayana
అశ్వమేథయాగానికి సన్నాహాలు జరుగుతూ ఉంటాయి, స్వర్ణ సీత విగ్రహం తయారీ జరుగుతూ ఉంటుంది. అయోధ్య ప్రజలంతా అశ్వమేథ యాగానికి సంబంధించిన హడావిడిలో ఉండగా, ఊరూరా రామచరితను గానం చేస్తూ లవకుశులు ఆ ఊరుకు చేరుకుంటారు. అమృత ధార వంటి రామకథను అక్కడ గానం చేస్తారు. అది వింటూ ప్రజలంతా కన్నీళ్లు పెట్టుకుంటారు. సీతమ్మ తల్లిని దూరం చేసుకోవడం వల్లనే, తామంతా కరవు కాటకాలతో బాధలు పడవలసి వచ్చిందని చెప్పుకుంటారు. తమని మన్నించమని మనసులోనే సీతమ్మతల్లిని కోరుకుంటారు.
అయోధ్యలో ఎవరో ఇద్దరు పిల్లలు రామకథను గానం చేస్తున్నారనే విషయం కౌసల్యకు తెలుస్తుంది. దాంతో వాళ్లను అంతఃపురానికి తీసుకురమ్మని చెబుతుంది. వాళ్లతో రామకథను పాడించుకోవడం వలన మనసు కాస్త తేలికపడుతుందని భావిస్తుంది. ఈ విషయం తెలిసి రాముడు కూడా అక్కడికి వస్తాడు. వాళ్ల సమక్షంలో లవకుశులు రామకథను గానం చేస్తారు. ఆయన వాళ్లు ఆలపిస్తున్న రామకథను విని ఆవేదనకు లోనవుతాడు. కౌసల్యాదేవి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది.
రామకథను అంత అందంగా, అద్భుతంగా రాసినదెవరని రాముడు ఆ పిల్లలను అడుగుతాడు. వాల్మీకి మహర్షి “రామాయణం” రాశారనీ, ఆయన ద్వారా విని తెలుసుకునే తాము పాడుతున్నామని చెబుతారు. జరిగిన సంఘటనలన్నీ మళ్లీ ఒకసారి కళ్లకు కట్టిన వాల్మీకి మహర్షికి తమ కృతజ్ఞతలు తెలుపమని రాముడు అంటాడు. లవకుశులకు తగిన బహుమతులు, కానుకలు ఇచ్చి పంపించమని చెబుతాడు. ఆశ్రమవాసులమైన తమకు కానుకలతో అవసరం లేదని చెప్పి ఆ పిల్లలు అక్కడి నుంచి వెనుదిరుగుతారు.
లవకుశులను చూసిన దగ్గర నుంచి కౌసల్యదేవి ఏదో తెలియని ఉద్వేగానికి లోనవుతుంది. ఆ పిల్లలను మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తూ ఉంటుంది. పదే పదే వాళ్ల నోటి ద్వారా రామాయణ కథా కావ్యాన్ని వినాలని ఆరాటపడుతూ ఉంటుంది. రాముడి పరిస్థితి కూడా అంతే ఉంటుంది. ఆశ్రమవాసులైన ఆ పిల్లలు వచ్చి వెళ్లిన దగ్గర నుంచి మనసు ఏదో తెలియని వేదనకి లోనవుతూ ఉంటుంది. ఆ పిల్లల ఆలాపనే ఆయన చెవుల్లో మారుమ్రోగుతూ ఉంటుంది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 78 : Lava Kusha reciting Ramayana
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.