Ramayanam – 85 : :Lava Kusha war with Lakshmana
లక్ష్మణుడు తనకి గల ఆగ్రహావేశాలను తమాయించుకుంటాడు. బాలకులపై కోప్పడటం సరికాదని భావించి సహనం వహిస్తాడు. ఆ మునికుమారుల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తాము వాల్మీకి మహర్షి శిష్యులమని లవకుశులు చెబుతారు. రామాయణం రాసిన వాల్మీకి మహర్షి శిష్యులు, ఆ రాముడికి సంబంధించిన అశ్వాన్ని బంధిస్తారా? ఆ రామచంద్రుడి సోదరులతో యుద్ధానికి దిగుతారా? అని లక్ష్మణుడు అడుగుతాడు.
రాముడు మహా పరాక్రమవంతుడు, ఎందరో రాక్షస వీరులను ఆయన నేలకూల్చాడు. ఆయన ధాటిని తట్టుకోవడం మహా మహావీరుల వలన కూడా కాదు. మహర్షులు సైతం ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తారు. అలాంటి ధర్మపరుడైన రాముడికి ఆగ్రహాన్ని కలిగించవద్దు. అందువలన బుద్ధిగా ఆ అశ్వాన్ని విడిచిపెట్టండి, లేదంటే ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తాడు.
రాముడి గురించి, ఆయన వీరత్వం గురించి తమకి ముందుగానే తెలుసని లవకుశులు అంటారు. రాముడి గురించి తరువాత మాట్లాడుకోవచ్చు, ముందుగా తమతో యుద్ధం చేసి యాగాశ్వాన్ని విడిపించుకోమని చెబుతారు. ఆ మాటలకు లక్ష్మణుడిలో సహనం నశిస్తుంది. దాంతో ఆయన ఇక వాళ్లకి మాటలతో చెప్పడం వలన అర్థం కాదని భావిస్తాడు. విల్లంబులు చేతబట్టి వాళ్లతో యుద్ధానికి సిద్ధమవుతాడు.
లవకుశులు కూడా అంతే ఆవేశంతో రంగంలోకి దిగుతారు. ఒకరిపై ఒకరు బాణప్రయోగాలు చేయడం మొదలుపెడతారు. లక్ష్మణుడి బాణాలను ఎదుర్కొంటూనే లవకుశులు తమ శక్తి సామర్థ్యాలను చూపుతుంటారు. మునికుమారులు అసాధ్యులు అనే విషయం లక్ష్మణుడికి అర్థమైపోతుంది. తన బాణాలు వ్యర్థం కావడం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లవకుశుల ధాటికి తట్టుకోలేకపోయిన లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. దాంతో ముని బాలకులంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 85 : :Lava Kusha war with Lakshmana
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.