Ramayanam – 87 : Lava kusha provocates Lord Rama for war

రాముడు యాగాశ్వం దగ్గరికి వెళుతూ ఉండగా, ఆయనను లవకుశులు అడ్డుకుంటారు. వాళ్లని చూడగానే రాముడు ఆనందాశ్చర్యాలకు లోనవుతాడు. గతంలో తన అంతఃపురంలో రామాయణం కథను గానం చేసిందివారేనని గుర్తిస్తాడు. తన కథా కావ్యాన్ని గురించి ఆలపించినవారే, తన యాగాశ్వాన్ని బంధించడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. వాళ్లను గురించి తెలియక లక్ష్మణుడు, శత్రుఘ్నుడు యుద్ధం చేసి ఉంటారని అంటాడు. వాళ్లతో తనకి ఎంత మాత్రం యుద్ధం చేయాలని లేదని చెబుతాడు. యాగాశ్వాన్ని వదలమని సున్నితంగా కోరతాడు.

ఎవరైనా సరే యుద్ధం చేసే యాగాశ్వాన్ని తీసుకు వెళ్లవలసిందేనని లవకుశులు తేల్చి చెబుతారు. అయినా రాముడు సహనమే వహిస్తాడు. రాముడు ఎంతటి పరాక్రమ వంతుడనేది స్వయంగా గానం చేసి, అంతటి ధీరుడితో యుద్ధానికి దిగాలనుకోవడం సరైనది కాదని రాముడు అంటాడు. తాను విల్లు ఎక్కు పెట్టడానికి తగిన వయసు వాళ్లకి లేదని చెబుతాడు. అయినా లవకుశులు వినిపించుకోరు. రాముడివంటి పరాక్రముడితో యుద్ధం చేసినప్పుడేకదా వీరత్వం తెలుస్తుందని పట్టుపడతారు.

ఒకవైపున వాళ్లు మునికుమారులు .. రామాయణం రాసిన వాల్మీకి మహర్షికి ప్రియ శిష్యులు .. రామాయణ కథా కావ్యాన్ని అద్భుతంగా గానం చేసి తన మనసును దోచిన చిన్నారులు .. ఎవరికీ ఎలాంటి అపకారాన్ని తలపెట్టని ఆశ్రమవాసులు .. అలాంటి పిల్లలపై ఎలా యుద్ధం చేసేదని రాముడు ఆలోచన చేస్తాడు. వాళ్లు అంతటి పౌరుషంగా మాట్లాడుతున్నా తనకి కోపం రావడం లేదనీ, అశ్వాన్ని వదిలి వెళ్లమని చెబుతాడు.

ఎన్ని విధాలుగా నచ్చజెప్పడానికి రాముడు ప్రయత్నించినా లవకుశులు వినిపించుకోరు. తమతో యుద్ధం చేసి గెలిచి, అశ్వాన్ని తీసుకెళ్లమని స్పష్టం చేస్తారు. దాంతో ఇక రాముడు సహనం కోల్పోతాడు. మనసుకు కష్టంగానే ఉన్నా వాళ్లపై విల్లును ఎక్కుపెట్టడానికి సిద్ధమవుతాడు. అదే సమయంలో ఇతర మునికుమారులు వెళ్లి ఆశ్రమంలో ఉన్న సీతాదేవికి ఈ విషయం చెబుతారు. దాంతో ఒక్కసారిగా ఆమె నిర్ఘాంత పోతుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 87 : Lava kusha provocates Lord Rama for war

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: