Sthalapuranam – Learn details about devotional places.
లోక కళ్యాణం కోసం భగవంతుడు వివిధ రూపాలతో .. వివిధ నామాలతో ఆవిర్భవించాడు. మహర్షుల అభ్యర్థన మేరకు కొన్ని ప్రదేశాలలో .. మహా భక్తుల కోరిక మేరకు మరి కొన్ని ప్రదేశాలలో కొలువయ్యాడు. తన అవతార కార్యాలకి తగినట్టుగా కొండలపై .. గుట్టలపై .. గుహల్లోను ఆవిర్భవించాడు. తన కైంకర్యాలకు భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో .. తాను ఎక్కడ కొలువై ఉంటే అక్కడే కోనేర్లను ఏర్పాటు చేసుకున్నాడు.
తాను వెలసిన జాడను భక్తులకు స్వప్న దర్శనం ద్వారా తెలియజేశాడు. తన ఆలయ నిర్మాణ వ్యవహారాలను స్వప్నం ద్వారానే మహా రాజులకు .. మహాభక్తులకు అప్పగించాడు. ఆదిశంకరాచార్యులు .. రామానుజా చార్యులు .. విఖనస మహాముని .. ఇలా ఎందరో మహానుభావుల ద్వారా ఆయా క్షేత్రాలలో ఆయా విధి విధానాలు జరిగేలా చూసుకున్నాడు. అలా దైవం తాను కొలువైన ప్రదేశాలకు భక్తులను రప్పించుకుంటూ .. వాళ్లపై తన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఆధ్యాత్మిక పరమైన పరిమళాలు వెదజల్లుతోంది.
భగవంతుడు ప్రతి యుగంలోను దుష్ట శిక్షణ .. శిష్ట జన రక్షణ చేస్తూ వచ్చాడు. సాధుజనుల సంరక్షణ చేస్తూ వచ్చాడు. అందుకోసమే ఆయన అనేక అవతారాలను ధరించాడు .. అనేక రూపాలలో ఆవిర్భవించి భక్తులకు దర్శనమిస్తున్నాడు. లోక కళ్యాణం కోసం భగవంతుడు చేసిన ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలపడానికీ .. తమ జీవితాలను ఉద్ధరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేయడానికి అందరూ పుణ్యక్షేత్రాలను దర్శించవలసిందే. ఆ స్వామి నామ .. రూప .. గుణ విశేషాలను కీర్తించవలసిందే.
పుణ్యక్షేత్రాలను అదృశ్య రూపంలో దేవతలు దర్శించుకుంటూ ఉంటారు. మహర్షులు కూడా సూక్ష్మ రూపంలో దైవ దర్శనం చేస్తుంటారు. అలాంటి పుణ్య క్షేత్రాలలో అడుగుపెట్టడమే అదృష్టంగా భావించాలి. పుణ్య క్షేత్రాన్ని దర్శించాలనే ఆలోచన కూడా భగవంతుడి అనుగ్రహం మేరకే కలుగుతుంది. అక్కడి నుంచి తెలియక చేసిన పాపాలు .. క్రితం జన్మ శాపాలు .. దోషాలు తొలగిపోవడానికి సమయం ఆసన్నమైందని గ్రహించాలి. జీవితం శుభాల దిశగా కొనసాగడానికి అదే ముహూర్తమని అర్థం చేసుకోవాలి.
పుణ్య క్షేత్రాలను దర్శించుకోవాలంటే ముందుగా ఆ క్షేత్రాలను గురించి తెలియాలి. ఆ క్షేత్ర మహిమలను గురించి తెలియాలి. అక్కడి విషయాలు .. విశేషాలు .. స్వామివారి లీలా విశేషాలను చదవడం ద్వారా .. వినడం ద్వారా మనసుకు పట్టించుకోవాలి. ఎలాంటి పుణ్యపురుషులు అక్కడ సంచరించారు .. ఎంతమంది భక్తులు తరించారు .. ఏయే రాజవంశీకులు ఆ క్షేత్ర నిర్మాణానికీ .. వైభవానికి కృషి చేశారనేది తెలుసుకోవాలి. అలాగే ఏ క్షేత్రానికి ఎక్కడి నుంచి వెళితే సమయం కలిసిస్తుందనే అవగాహన ఉండాలి. అలాంటి విషయాలను .. వివరాలను .. స్థల పురాణంతో(Sthalapuranam) పాటు కలిపి సంక్షిప్త సమాచారాన్ని అందించే ప్రయత్నం చేయడమే “పుణ్య క్షేత్రాలు” ముఖ్య ఉద్దేశమని గ్రహించవలసిందిగా మనవి.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక : ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Sthalapuranam – Learn details about devotional places.