ఈ రోజు రాశి ఫలాలు – Today Rasi Phalalu based on moon sign

Check Today Horoscope in Telugu based on moon sign by famous astrologer Vakkantham Chandramouli gaaru. ఈ రోజు రాశి ఫలాలు జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం తెలుసుకోండి.

07 జూలై 2025 - సోమవారం
జన్మ నక్షత్రం ప్రకారం

మేషం
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విరోధాలు. వ్యవహారాల్లో ఆటంకాలు. రాబడి అంతగా ఉండదు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు స్థాన చలనం. సాంకేతిక రంగం, పారిశ్రామికవర్గాలకు వ్యయప్రయాసలు. విద్యార్థులు పరిశోధనల్లో చికాకులు. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు...గులాబీ, తెలుపు. ప్రతికూల రంగు...గోధుమ. ఆంజనేయ స్వామిని స్మరించండి.

వృషభం
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు) కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రయత్నాలు సఫలమవుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. మీ అంచనాలు నిజమవుతాయి. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అధిక లాభాలు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి ఊహించని అభివృద్ధి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు....గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు...పసుపు. హనుమాన్ చాలీసా పఠించండి.

మిథునం
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కాంట్రాక్టర్లకు అనుకూలకాలం. మీ నేతృత్వంలో శుభకార్యాల నిర్వహణ. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కీలక పోస్టులు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు. విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకుంటారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకూల రంగులు...గోధుమ, బంగారు. ప్రతికూల రంగు...తెలుపు. ఆంజనేయస్వామిని పూజించండి.

కర్కాటకం
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణాలు సంభవం. విలువైన వస్తువులు చేజార్చుకుంటారు. బంధువులతో తగాదాలు ఏర్పడవచ్చు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వివాదాలకు కాస్త దూరంగా ఉండడం మంచిది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి మానసిక ఆందోళన. విద్యార్థులు ఫలితాల పై నిరుత్సాహంచెందుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు. అనుకూల రంగులు........గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు...ఆకుపచ్చ. శివ స్తోత్రాలు పఠించండి.

సింహం
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) సన్నిహితులతో తగాదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. ఏ వివాదం జోలికి వెళ్లవద్దు. ఆస్తుల విషయంలో చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమాధిక్యం తప్ప ఫలితం ఉండదు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు నిరాశ తప్పదు. విద్యార్థులకు అవకాశాలు చేజారతాయి. మహిళలకు మానసిక అశాంతి. అనుకూలం.....ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూలం...కాఫీ. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

కన్య
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) వ్యవహారాల్లో విజయం. ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చ. ఆలోచనలు అమలు చేస్తారు. రాబడి పెరుగుతుంది. ఉద్యోగాల్లో పదోన్నతులు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పురోగతి కనిపిస్తుంది. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు పరిశోధనలకు గుర్తింపు లభిస్తుంది. మహిళలకు భూ, గహయోగాలు. అనుకూల రంగులు.......ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు... కాఫీ. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

తుల
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు) పనుల్లో తొందరపాటు. బంధువులు, మిత్రులతో కలహాలు. అనారోగ్యం,ఔషధసేవనం. విలువైన వస్తువుల చేజారతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు విధులు కొంత నిరుత్సాహపరుస్తాయి. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు కొత్త వివాదాలు. విద్యార్థులు కొంత ఓపిక వహించాలి. మహిళలు కుటుం బసమస్యలతో సతమతమవుతారు. అనుకూల రంగులు.......గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు...కాఫీ. గణపతిని పూజించాలి.

వృశ్చికం
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది. అన్నింటా మిత్రులు సహకరిస్తారు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు. ఆర్థిక వ్యవహారాలు సంతప్తికరంగా ఉంటాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు మరింత ముందంజ వేస్తారు. ఉద్యోగులకు శ్రమ తగ్గుతుంది. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. విద్యార్థులు అనుకున్న ఫలితాలతో ఆనందంగా గడుపుతారు. మహిళలకు సంతోషకరమైన సమాచారం. అనుకూల రంగులు.......గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు...గోధుమ. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

ధనుస్సు
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) వ్యయప్రయాసలు తప్పవు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. బంధువుల నుంచి విమర్శలు తప్పవు. దూరప్రయాణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు తలచిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఉద్యోగాలలో చికాకులు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు∙ఆందోళన తప్పదు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు లేక కొంత నైరాశ్యం చెందుతారు. మహిళలకు ఆస్తి వివాదాలు. అనుకూల రంగులు....ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు...లేత ఎరుపు. నరసింహస్వామిని పూజించండి.

మకరం
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు) ఆర్థిక వ్యవహారాలు సంతప్తికరంగా ఉంటాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. బంధువుల నుంచి ఆస్తి లాభ సూచనలు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ముందడుగు. ఉద్యోగులకు విశేష గుర్తింపు పారిశ్రామిక, వైద్యరంగాల వారికి చిక్కులు తొలగుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు కుటుంబంలో విశేష ఆదరణ లభిస్తుంది. అనుకూల రంగులు.....గోధుమ, లేత ఎరుపు. ప్రతికూల రంగు...పసుపు. సత్యనారాయణస్వామిని అర్చించండి.

కుంభం
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు) వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఆయుధాలు ముందుకు సాగండి. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కాంట్రాక్టులు కొంత నిరాశపరుస్తాయి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొన్ని లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు తప్పవు. చిత్రపరిశ్రమ వారు, సాంకేతిక రంగాల వారికి నిరాశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు కొన్ని అవకాశాలు తప్పిపోయి నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు.......పసుపు, ఎరుపు. ప్రతికూల రంగు...గోధుమ. గణపతిని పూజించండి.

మీనం
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆదాయం అనుకున్నంతగా లభిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి. ఆత్మవిశ్వాసంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిరకాల ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి విశేష యోగవంతంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలకు భూ సంబంధిత లాభాలు. అనుకూల రంగులు......గోధుమ, పసుపు. ప్రతికూల రంగు...కాఫీ.. దుర్గాదేవిని పూజించండి.

ఈ రోజు రాశి ఫలాలు జన్మ తేది/సూర్య రాశి ప్రకారం – Today rasi phalalu in Telugu

ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu

ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu

ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

Today Horoscope in Telugu by Vakkantham Chandramouli’s Janmakundali.com

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope (today horoscope in telugu), festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2024 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2024 – Panchangam – App on Apple App Store