Today rasi phahalu – 30 Dec 2022, శుక్రవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతికి లోనవుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలపై గందరగోళంలో పడతారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు నిరాశ చెందవచ్చు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……. గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…నీలం. సుబ్రహ్మణ్యాష్ట.కం పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో మీ సేవలు విస్తృతమవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభ వార్తలు. కొన్ని నిర్ణయాలు హఠాత్తుగా తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు పండుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవేత్తలు, వైద్యుల యత్నాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు ఎటువంటి అవకాశం దక్కినా సద్వినియోగం చేసుకుంటారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, బంగారు ప్రతికూల రంగు..కాఫీ. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. కాంట్రాక్టులు సైతం పొందుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఆశించిమేర లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు వివాదాలు తీరతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు యోగదాయకమైన కాలం. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు దక్కుతాయి. మహిళలకు కుటుంబంలో ప్రశాంతంగా గడుస్తుంది. అనుకూల రంగులు……. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. హనుమాన్ చాలీసా పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)

ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించేందుకు యత్నిస్తారు. సన్నిహితుల నుంచి విమర్శలు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సంస్థల్లో కొన్ని ప్రతిబంధకాలు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. మహిళలకు ఆరోగ్యభంగం. అనుకూల రంగులు……. కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు..ఎరుపు. ఆంజనేయస్వామిని పూజించాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

రాబడిపై ఆందోళన చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో వివాదాలు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. బంధువులను కలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు అంతగా కలిసిరావు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు మనశ్శాంతి లోపం. విద్యార్థులు కొంత శ్రద్ధ వహించాలి. మహిళలకు నిరుత్సాహం తప్పదు. అనుకూల రంగులు……. గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. గణపతిని ఆరాధించండి.

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు పొందుతారు. గృహ, వాహనాలు కొంటారు. మీ చిరకాల కోరిక సఫలమవుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి రావచ్చు. క్రీడాకారులు, చిత్ర పరిశ్రమ వారు ఉత్సాహంగా అడుగులు వేస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మహిళలకు ఊహించని విషయాలు తెలుస్తాయి. అనుకూల రంగులు……. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

వ్యతిరేకులు కూడా స్నేహితులుగా మారతారు. ఆదాయం పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగులు పనితీరులో మార్పులు చేసుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అనుకున్న అవకాశాలు చెంతకు వస్తాయి. విద్యార్థుల యత్నాలు సఫలం. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి.. అనుకూల రంగులు……. గోధుమ, తెలుపు. ప్రతికూల రంగు…పసుపు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు తప్పవు. గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. కుటుంబ బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆలోచనలు నిలకడగా ఉండవు. భూసంబంధిత వివాదాలు నెలకొంటాయి. రాబడి మందగించి గందరగోళంలో పడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు, మనోవేదన. రాజకీయవేత్తలు, వైద్యులు అవకాశాలను చేజార్చుకుంటారు. విద్యార్థులు శ్రమకోర్చి ఎట్టకేలకు ఫలితాలు సాధిస్తారు. మహిళలకు అనారోగ్యం. అనుకూల రంగులు……. గులాబీ, ఆకుపచ్చ ప్రతికూల రంగు…కాఫీ. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

కుటుంబంలో మరిన్ని చికాకులు. దూర ప్రయాణాలు ఉండవచ్చు. బంధువులు, మిత్రులతో కలహాలు. ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సామాన్యంగా కొనసాగుతుంది. ఉద్యోగులు విధుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు సమస్యలు చికాకు పరుస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు అధికమవుతాయి. మహిళలకు నిరాశ తప్పదు. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు…నేరేడు. దత్తాత్రేయుని పూజించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ ఊహలు నిజం చేసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. అందర్నీ ఆకట్టుకుని సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణ ఉత్సాహంగా సాగుతుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు అయోమయస్థితి నుండి గట్టెక్కుతారు. విద్యార్థులకు అందిన అవకాశాలు సంతృప్తి కలిగిస్తాయి. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు……. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు…పసుపు. ఆంజనేయస్వామిని పూజించండి.

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆస్తి విషయాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. స్నేహితుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. శ్రమ పడ్డా మీరు ఆశించినంత ఫలితం ఉండదు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చికాకులు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు. పారిశ్రామికవేత్తలు, వైద్యుల ఆశలు నిరాశ కాగలవు. విద్యార్థులకు సాధారణంగా కొనసాగుతుంది. మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. అనుకూల రంగులు……. గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు…ఎరుపు. నృసింహ స్తోత్రాలు పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలు సజావుగా సాగిస్తారు. ఉద్యోగులకు శుభవార్తలు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు సత్కారాలు పొందుతారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు సత్కారాలు జరుగుతాయి. అనుకూల రంగులు…….ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు..నీలం. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: