Today rashi phahalu – 01 జనవరి 2023, ఆదివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
![aries-mesha-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/aries-mesha-rasi.png)
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
శ్రమకు తగ్గ ఫలితం లభించి ఉత్సాహంగా అడుగేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. సేవా కార్యక్రమాలపై ఆసక్తి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలకు ఎటువంటి లోటు ఉండదు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు పట్టుదలతో కార్యాలను చక్కదిద్దుతారు. విద్యార్థులు మేథస్సుకు పదునుపెడతారు. మహిళలకు శుభవార్తలు. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, పసుపు. ప్రతికూల రంగు…తెలుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
![taurus-vrushabha-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/taurus-vrushabha-rasi.png)
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
వ్యవహార విజయంతో మీలో కొత్త ఉత్సాహం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితిని మీ అంచనాల మేరకు సరిచేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం మీకు సంతోషాన్నిస్తుంది. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. దీర్ఘకాలికంగా నెలకొన్న వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మరింత అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాల్లో ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి పురస్కారాలు. విద్యార్థులు లక్ష్యసాధనలో ముందడుగు వేస్తారు. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. అనుకూల రంగులు…….గోధుమ,పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. దత్తాత్రేయుని పూజలు మంచిది.
![gemini-mithuna-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/gemini-mithuna-rasi.png)
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఉత్సాహంతో ముఖ్య కార్యాలు చక్కదిద్దుతారు. శాంతి, సహనంతో వ్యతిరేకులను కూడా మెప్పిస్తారు. అందరిలోనూ ఊహించని గౌరవం పొందుతారు. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఆప్తులతో వివాదాలు తీరి సఖ్యత ఏర్పడుతుంది. విలువైన వస్తువులు, వాహనాలు కొంటారు. బంధువుల రాకతో కుటుంబంలో సందడి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు లావాదేవీలపై ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో క్రమపద్ధతిలో విధులు నిర్వర్తిస్తారు. పారిశ్రామిక, రాజకీయవర్గాల మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలకు భూలాభాలు. అనుకూల రంగులు……. బంగారు, ఎరుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యేశ్వరునిపూజించండి.
![cancer-karkataka-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/cancer-karkataka-rasi.png)
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. సమాజసేవలో మీరూ భాగస్వాములవుతారు. కీలక నిర్ణయాలపై బంధువులతో చర్చిస్తారు. ఆప్తులతో విభేదాలను పరిష్కరించుకుంటారు. దూరపు బంధువుల నుంచి ధనలబ్ధి. ఇంటి నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో మంచి గుర్తింపు లభించవచ్చు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఉత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులు లక్ష్యాలపై దృష్టి పెడతారు. మహిళలు ఆస్తులు కొనుగోలు చేస్తారు. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు….ఎరుపు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.
![leo-simha-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/leo-simha-rasi.png)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆలోచనలను అమలు చేసి ముందడుగు వేస్తారు. ముఖ్యులతో సమావేశమవుతారు. కుటుంబ సభ్యుల నిర్ణయాలపై అంగీకారం తెలియజేస్తారు. ఆలయాల సందర్శనం. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించాలన్న నిర్ణయానికి వస్తారు.. అదనపు ఆదాయం సమకూరే సమయం. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అంచనాలు ఫలించి లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవేత్తలు, వైద్యులకు సమస్యలు తీరతాయి. విద్యార్థులు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలకు సంతోషదాయకంగా ఉంటుంది. అనుకూల రంగులు……. ఎరుపు, గులాబీ. ప్రతికూల రంగు…నేరేడు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
![virgo-kanya-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/virgo-kanya-rasi.png)
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఉద్యోగ యత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలు మీకు సహాయపడతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సంస్థల అభివృద్ధికి తగు చేయూత లభిస్తుంది. ఉద్యోగులు అప్పగించిన బాధ్యతలను సజావుగా పూర్తి చేస్తారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి ఆశలు నెరవేరతాయి. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. మహిళలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనుకూల రంగులు…… ఎరుపు,కాఫీ. ప్రతికూల రంగు…పసుపు. గణపతికి అర్చన చేయించుకోండి.
![libra-tula-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/libra-tula-rasi.png)
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కుటుంబంలో కొత్త్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఏ పని చేపట్టినా పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ఆదుకుంటుంది. అదనపు రాబడి చేకూరుతుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు లావాదేవీలను చక్కదిద్దుకుంటారు. ఉద్యోగులకు సంతోషకర సమాచారం. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనల్లో మార్పులు. విద్యార్థులు అంచనాలు నిజమవుతాయి. మహిళలకు సోదరులతో విభేదాలు తొలగుతాయి. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, నీలం. ప్రతికూల రంగు…నేరేడు. శివ స్తోత్రాలు పఠించండి.
![scorpio-vruschika-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/scorpio-vruschika-rasi.png)
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
కాంట్రాక్టర్లకు అనుకూలత ఉంటుంది. వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన రీతిలో నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రగతి కనిపిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. గృహ , వాహనయోగాలు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కీలక సందేశం అందే సూచనలు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు. విద్యార్థులలో మరింత ఉత్సాహం. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు……. నీలం, నలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. గణపతిని ఆరాధించండి.
![saggitarius-dhanu-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/saggitarius-dhanu-rasi.png)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆరోగ్య, కుటుంబ సమస్యలతో కొంత ఇబ్బంది పడతారు. దూరప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. కొన్ని పనులలో జాప్యం. తీర్థ యాత్రలు చేస్తారు. రాబడి కొంత తగ్గి అవసరాలకు ఇబ్బంది పడతారు. ఉద్యోగాల్లో వివాదాలు నెలకొంటాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు స్వల్పంగా రాగలవు. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులకు సామాన్యస్థితి. విద్యార్థులకు మానసిక ఆందోళన. మహిళలకు నిరుత్సాహపూరితంగా ఉంటుంది. అనుకూల రంగులు……. నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. వేంకటేశ్వరస్వామిని పూజించండి.
![capricorn-makara-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/capricorn-makara-rasi.png)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. శ్రమ మరింత పెరుగుతుంది. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపాలి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు వివాదాలు. ఉద్యోగాలలో మరింత పనిభారం. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి పర్యటనల్లో మార్పులు. విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. మహిళలకు కుటుంబసమస్యలు ఎదురుకావచ్చు. అనుకూల రంగులు…… గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు..నీలం. శ్రీ రామ స్తోత్రాలు పఠించాలి.
![aquarius-kumbha-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/aquarius-kumbha-rasi.png)
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. బంధువులతో మంచీచెడ్డా చర్చిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆదాయం కొంత అనుకూలించి అప్పులు తీరతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ముందగుడు వేసి తగినంత లాభాలు పొందుతారు. ఉద్యోగులకు విధులు తేలికపడతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు……. ఎరుపు, గోధుమ ప్రతికూల రంగు…నేరేడు. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.
![pisces-meena-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/pisces-meena-rasi.png)
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంటిలో శుభకార్యాల నిర్వహణ పై ఒక అంచనాకు వస్తారు. ఆర్థిక లావాదేవీలు మీరు అనుకున్నట్లుగానే ఉంటాయి. ఒక సమస్యను సహనం, నేర్పుతో పరిష్కరించుకుంటారు. వ్యతిరేక వర్గాల వారు కూడా మీపట్ల సానుభూతి తెలుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమైన లబ్ధి పొందుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు సంతోషాన్నిస్తాయి. ఉద్యోగాల్లో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు అనుకూల సమాచారం. మహిళలకు ఉద్యోగ, విద్యాయోగాలు. అనుకూల రంగులు……. కాఫీ, బంగారు ప్రతికూల రంగు…ఎరుపు. సూర్యభగవానుని ధ్యానించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com