Today rashi phahalu – 07 జనవరి 2023, శనివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


నూతన ఉద్యోగాలు లభిస్తాయి. సోదరులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలు. కాంట్రాక్టులు పొందుతారు. రాబడి సంతృప్తినిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు. విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. మహిళలకు ఆహ్వానాలు అందుతాయి. అనుకూల రంగులు…తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు..నేరేడు. గణపతి పూజలు చేయండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులతో రుణాలు చేయాల్సివస్తుంది. దూర ప్రయాణాలు ఉంటాయి. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొన్ని ఇబ్బందులు పడతారు. ఉద్యోగులకు విధి నిర్వహణ పై శ్రద్ధ చూపాలి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు సమస్యలతో గడుపుతారు. విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు… గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు..పసుపు. గణేశాష్టకం పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ, గౌరవం లభిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభదాయకంగా గడుస్తుంది. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు అంతా అనుకూలమే. విద్యార్థులకు ఒత్తిడులు తీరతాయి. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు… లేత ఆకుపచ్చ, కాఫీ. ప్రతికూల రంగు..పసుపు. శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


కొత్త రుణ యత్నాలు. మిత్రులే శత్రువులుగా మారతారు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమకు ఫలితం కనిపించదు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సామాన్య లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు. వైద్యులు, క్రీడాకారులకు చిత్రమైన సంఘటనలు. విద్యార్థులు మరింత శ్రమపడాలి. మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు. అనుకూల రంగులు…… లేత పసుపు, కాఫీ. ప్రతికూల రంగు..నీలం. దేవి స్తోత్రాలు పఠించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఇంటాబయటా అనుకూల వాతావరణం. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది, ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆదాయం ఆశించినంతగా పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీల్లో నూతనోత్సాహం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు సంతోషకరంగా గడుస్తుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. మహిళలకు మానసిక ప్రశాంతత. అనుకూల రంగులు…… పసుపు, గులాబీ. ప్రతికూల రంగు..నేరేడు. ఆదిత్య హృదయం పఠించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


నూతన విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఇంటి నిర్మాణ యత్నాలు కలసి వస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కొత్త ఉత్సాహం. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. మహిళలకు కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనుకూల రంగులు…… తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు..నీలం. ఆంజనేయ దండకం పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


చేపట్టిన కార్యక్రమాలలో ప్రతిష్ఠంభన. ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకునేందుకు యత్నిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. వివాదాలకు దూరంగా ఉండండి. కొన్ని సమావేశాల్లో పాల్గొంటారు. స్నేహితులతో అకారణ వైరం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సాధారణ లాభాలు. ఉద్యోగులకు విధులు సామాన్యంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కొంత ఊరట చెందుతారు. విద్యార్థుల అంచనాలు నిజం కాగలవు. మహిళలలో ఆస్తి లాభ సూచనలు. అనుకూల రంగులు… నీలం, తెలుపు. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాదు. వ్యయప్రయాసలతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు ఏ మాత్రం కలసిరావు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. స్నేహితులతో తగాదాలు. ఇంటాబయటా మనశ్శాంతి లోపిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త వివాదాలు. ఉద్యోగులకు విధులు ఇబ్బంది కలిగిస్తాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు. మహిళలు మానసికంగా ఆందోళన చెందుతారు. అనుకూల రంగులు… ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు..ఎరుపు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి. ఉద్యోగులకు కీలక సమాచారం రావచ్చు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు అవకాశాలు ఎట్టకేలకు దక్కుతాయి. మహిళలకు మనశ్శాంతి లభిస్తుంది. అనుకూల రంగులు….. గులాబీ, ఎరుపు. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


రాబడి పెరిగి సంతోషంగా గడుపుతారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మరింత ఉత్సాహం. ఉద్యోగులు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు,వైద్యులకు ఊహించని ఆహ్వానాలు. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలు కుటుంబంలో ప్రత్యేకత నిలుపుకుంటారు. అనుకూల రంగులు… గులాబీ, కాఫీ. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. దత్తాత్రేయుని పూజించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


రాబడి అంతగా ఉండదు. కొత్తగా రుణాల కోసం యత్నిస్తారు. కష్టించినా ఫలితం స్వల్పంగానే ఉంటుంది. బంధువులతో మాటపట్టింపులు, వివాదాలు.. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో వివాదాలు నెలకొంటాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు శ్రమాధిక్యం. విద్యార్థులు ఎటూ తేల్చుకోలేక ఇబ్బందిపడతారు. మహిళలకు గందరగోళం. అనుకూల రంగులు…… తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు..కాఫీ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


కుటుంబంలో చికాకులు. భూములు, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా. శ్రమాధిక్యమే. కార్యక్రమాలలో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. వ్యతిరేకుల నుండి సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు సాధారణ పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులు ఎంత కృషి చేసినా ఫలించదు. మహిళలకు మానసిక అశాంతి. అనుకూలం… పసుపు, లేత ఎరుపు. ప్రతికూలం..కాఫీ. అంగారక స్తోత్రాలు పఠించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: