Today rashi phahalu – 08 జనవరి 2023, ఆదివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. కాంట్రాక్టర్లకు ఆటుపోట్లు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో చికాకులు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు సమస్యలు వేధిస్తాయి. విద్యార్థులు కొంత సంయమనం పాటించాలి. మహిళలకు కొంత ఆందోళన తప్పదు. అనుకూల రంగులు……నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు.. పసుపు. నరసింహస్వామిని పూజించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వాహనాలు,స్థలాలు కొంటారు. అనుకున్న రాబడి దక్కుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఉత్సాహవంతంగా సాగుతుంది. ఉద్యోగులకు విధుల్లో అనుకూలత. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలు సఫలం. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకూల రంగులు… ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు..నేరేడు. శివ స్తోత్రాలు పఠించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ముఖ్య వ్యవహారాల్లో ఆటంకాలు. రాబడి తగ్గినా అవసరాలకు ఇబ్బంది ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. భార్యాభర్తల మధ్య మాటపట్టింపులు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నిరాశాజనంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు చికాకులు. మహిళలకు నిరుత్సాహమే. అనుకూల రంగులు… గులాబీ, లేత ఆకుపచ్చ. ప్రతికూల రంగు..కాఫీ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
రుణ బాధల నుంచి విముక్తి. బంధువులతో సత్సబంధాలు మెరుగుపడతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. రాజకీయవేత్తలు, వైద్యుల సేవలకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు మరిన్ని అవకాశాలు సా«ధిస్తారు. మహిళలకు శుభవార్తలు. అనుకూల రంగులు… పసుపు, గులాబీ, ప్రతికూల రంగు..నీలం. గణపతి స్తోత్రాలు పఠించండి
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఆకస్మిక ప్రయాణాలు. అనుకున్న రాబడి తగ్గుతుంది. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. భార్యాభర్తల మధ్య కలహాలు. వ్యాపార, వాణిజ్యవేత్తల యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు లేనిపోని సమస్యలు. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు ఒత్తిడులు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు తొందరపాటు నిర్ణయాలు వద్దు. అనుకూల రంగులు… తెలుపు, బంగారు. ప్రతికూల రంగు..ఎరుపు. వేంకటేశ్వరస్వామికి అర్చనలు చేయండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటి నిర్మాణాలు చేపట్టగల అవకాశం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ప్రగతిదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు అనుకూల సమాచారం. విద్యార్థులు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు… గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. హనుమాన్ ఛాలీసా పఠించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల విస్తృతికి చర్యలు చేపడతారు. ఉద్యోగులకు ఉత్సాహంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కార్యసాధకులవుతారు. విద్యార్థులు నైపుణ్యతను చాటుకుంటారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకూల రంగులు….. గులాబీ, బంగారు. ప్రతికూల రంగు..తెలుపు. ఆంజనేయ దండకం పఠించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు. రాబడి తగ్గి అవసరాలకు లోటు ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు. కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నిరుత్సాహం. ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు. విద్యార్థులు కొంత గందరగోళంగా ఉంటుంది. మహిళలకు కుటుంబసమస్యలు వేధిస్తాయి. అనుకూల రంగులు… ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు..గులాబీ. అంగారక స్తోత్రం పఠించాలి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆప్తులతో తగాదాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఆస్తి వివాదాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు. ఉద్యోగాల్లో పని ఒత్తిడులు తప్పవు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు సమస్యలు పెరుగుతాయి. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు….. నీలం, పసుపు. ప్రతికూల రంగు..తెలుపు. సత్యనారాయణస్వామిని పూజించాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆప్తులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. చిరకాల మిత్రులు కొంత సాయం అందిస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. భూములు, ఖరీదైన నగలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో సేవలు విస్తృతమవుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. మహిళలకు చికాకులు తొలగుతాయి. అనుకూల రంగులు….. గులాబీ. కాఫీ. ప్రతికూల రంగు..నీలం. గణపతికి అర్చన చేయించుకుంటే మంచిది
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. భూవివాదాల నుంచి బయటపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థలను విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు యత్నకార్యసిద్ధి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. మహిళలకు శుభ వార్తలు. అనుకూల రంగులు….. తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు..ఎరుపు. సూర్య భగవానున్ని పూజించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకోని ప్రయాణాలు. ముఖ్యమైన కార్యక్రమాలలో స్వల్ప అవరోధాలు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య విభేదాలు, వివాదాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు రెట్టింపు కాగలవు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు నిర్ణయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. విద్యార్థులకు కొంత నిరాశ. మహిళలకు కుటుంబసభ్యుల నుంచి సమస్యలు. అనుకూల రంగులు….. ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు.నేరేడు. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com