Today rashi phahalu – 09 జనవరి 2023, సోమవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాల్లో విజయం. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులలో సమతూకం ఏర్పడుతుంది. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. సాంకేతిక నిపుణులు, చిత్ర పరిశ్రమ వారు గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు……తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు…పసుపు. సూర్యాష్టకం పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

రాబడి కంటే ఖర్చులు అధికం. ముఖ్యమైన కార్యక్రమాలలో నిదానంగా వ్యవహరించండి. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. స్నేహితులతో విభేదాలు. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరవద్దు.. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు స్థానమార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు చిక్కులు. మహిళలకు కొంతమేరకు అనుకూలం. అనుకూల రంగులు…… ఎరుపు, లేత ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. శ్రీ కృష్ణాష్టకం పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. సన్నిహితులు శత్రువులుగా మారే సూచనలు. ఆరోగ్యం అంతగా సహకరించదు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఎంత కష్టించినా ఫలితం దక్కదు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సాధారణస్థితి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు వివాదాలు. విద్యార్థులు కొన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు. అనుకూల రంగులు…… నీలం, పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. శ్రీ మహాలక్ష్మీ అష్టకం పఠించండి..

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


 ఆధ్యాత్మిక , సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటిలో ఉత్సాహవంతంగా గడుపుతారు. సమాజంలో మీరంటే అమితమైన ప్రేమాభిమానాలు చూపుతారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు. నిరుద్యోగులకు అనూహ్యమైన అవకాశాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభిస్తాయి. ఉద్యోగులు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులు తెలివితేటలతో కొన్ని విజయాలు సాధిస్తారు. మహిళలకు సమస్యలు తీరతాయి. అనుకూల రంగులు…… తెలుపు,కాఫీ. ప్రతికూల రంగు…ఎరుపు. ఆదిత్య హృదయం పఠించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు కొంత మందగిస్తాయి.. ఆస్తి వివాదాలు పెరుగుతాయి. బంధువులు, స్నేహితులతో మనస్పర్థలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు. రాబడి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తల వ్యవహారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులు కొంత సంయమనంతో సాగాలి. మహిళలకు అనారోగ్య సూచనలు. అనుకూల రంగులు…… ఆకుపచ్చ,గులాబీ. ప్రతికూల రంగు..కాఫీ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో సమస్యలు తీరతాయి. కుటుంబసభ్యుల నుంచి మాటసహాయం పొందుతారు. కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు అతి ముఖ్య సమాచారం రాగలదు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు విదేశీ పర్యటనలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు భూలాభం. అనుకూల రంగులు…… కాఫీ, ఎరుపు. ప్రతికూల రంగు…పసుపు. శివాష్టకం పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. దూర ప్రయాణాలతో సతమతమవుతారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు. నిరుద్యోగులకు నిరాశ. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కార్యక్రమాలలో అవాంతరాలు. కాంట్రాక్టర్లకు కొత్త చిక్కులు.. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు తప్పవు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు ఒత్తిడులు మరింత తప్పవు. విద్యార్థులు కొంత ఆలోచన తో నిర్ణయం తీసుకోవాలి. మహిళలకు లేనిపోని చికాకులు. అనుకూల రంగులు…… గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు..నేరేడు. శ్రీ లింగాష్టకం పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

బంధువులతో మరింత ఆనందంగా గడుపుతారు వ్యతిరేకులు మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. పాత సంఘటనలు, విషయాలు గుర్తుకు వస్తాయి. రాబడి అనూహ్యంగా పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు ఊహించని అవకాశాలు రావచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలు రావచ్చు. ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. క్రీడాకారులు, వైద్యులు సంతోషకర విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. మహిళలకు శుభవార్తలు. అనుకూల రంగులు…… ఎరుపు, కాఫీ, ప్రతికూల రంగు..ఆకుపచ్చ. శ్రీ రాజరాజేశ్వరి అష్టకమ్ పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


ఆదాయం ఊహించని రీతిలో పెరుగుతుంది. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. భార్యాభర్తల మధ్య తగాదాలు పరిష్కారం. కొన్ని కార్యక్రమాలు సమయానుసారం పూర్తి కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సరికొత్త ఆలోచనలు కలసివస్తాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గే సూచనలు.. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు తొందరపాటు చర్యలకు సిద్ధపడరాదు. విద్యార్థులు ప్రతిభకు తగిన అవకాశాలు సాధిస్తారు. మహిళలు శుభవార్తలు వింటారు. అనుకూల రంగులు…… గోధుమ,తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. శ్రీ గణేశాష్టకం పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


చేపట్టిన కార్యక్రమాలను అవాంతరాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగ యత్నాలలో కొంత మేర కదలికలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు తథ్యం. ఉద్యోగులకు అనుకున్న మార్పులు ఉండవచ్చు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు ఒక ముఖ్య సందేశం అందుతుంది. విద్యార్థులు కొంత నిదానం పాటించాలి. మహిళలకు ఆస్తి వివాదాలు తీరతాయి. అనుకూల రంగులు…… పసుపు, గోధుమ. ప్రతికూల రంగు…గులాబీ. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


వ్యయప్రయాసలు ఎదురవుతాయి. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి. రాబడి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యవహారాలలో అవాంతరాలు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సాదాసీదాగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు సంభవం.. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు కొన్ని వివాదాలు సర్దుకుంటాయి. విద్యార్థులు కొంత ఓపిక వహించాలి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు…… ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు…ఎరుపు. విష్ణు సహస్రనామ చేయండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ఆదాయం కొంత తగ్గి నిరుత్సాహపరుస్తుంది. వివాదాల పై కలత చెందుతారు. కాంట్రాక్టులు చేజారవచ్చు. శ్రమ తప్ప ఆశించిన ఫలితం కనిపించదు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు అధికం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఇబ్బందికర పరిస్థితి. ఉద్యోగస్తులు విధులలో భారం పెరిగి సతమతమవుతారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు గందరగోళంలో పడతారు. విద్యార్థులు నిర్ణయాలపై మరో ఆలోచన చేయాలి. మహిళలకు కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకూల రంగులు…… నీలం, నలుపు. ప్రతికూల రంగు…పసుపు. హనుమాన్ ఛాలీసా పఠించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: