Today rashi phahalu – 10 జనవరి 2023, మంగళవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
కార్యక్రమాలలో ప్రతిబంధకాలు చికాకు పరుస్తాయి. వ్యయప్రయాసలతోనే గడుపుతారు. కష్టించినా ఫలితం కనిపించదు. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సన్నిహితులతో విరోధాలు.. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు కనిపించవు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు గందరగోళం. విద్యార్థులకు చిక్కులు. మహిళలకు నిరుత్సాహం. అనుకూల రంగులు….. కాఫీ.,తెలుపు. ప్రతికూల రంగు…పసుపు. హనుమాన్ ఛాలీసా పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కార్యక్రమాలు ఆటంకాలు ఎదురై విరమిస్తారు. సన్నిహితులతో అకారణ వైరం.. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆరోగ్యం విషయంలో సమస్యలు. బంధువుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగులకు అనుకోని మార్పులు. రాజకీయవేత్తలు, వ్యవసాయదారులు సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థుల కృషి ఫలించదు. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు….. గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…నేరేడు. శివ పంచాక్షరి పఠించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
కొత్త వ్యక్తుల పరిచయం. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ఆదనపు రాబడి సమకూరి అవసరాలు తీరతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు తీరి ఒడ్డున పడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు విస్తరణలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులు తమ సత్తా చాటుకుంటారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు సంతోషకర సమాచారం. విద్యార్థులు ఇంత కాలం పడిన కష్టం ఫలిస్తుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. అనుకూల రంగులు.. తెలుపు, నలుపు. ప్రతికూల రంగు…నీలం. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
కార్యక్రమాలలో మరిన్ని చిక్కులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కష్టించినా ఫలితం అంతంత మాత్రం. ఆరోగ్యపరంగా చికాకులు. కాంట్రాక్టర్లకు కొంత పరీక్షగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త సమస్యలు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు కొంత ఓపికతో వ్యవహరించాలి. విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు తప్పవు. అనుకూల రంగులు.. ఆకుపచ్చ, ఎరుపు. ప్రతికూల రంగు…తెలుపు. గణపతిని పూజించాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, ఖరీదైన నగలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు సత్తా చాటుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలు, కళాకారుల యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు సంతోషకర సమాచారం అందుకుంటారు. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు….. ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు…కాఫీ. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఆదాయం నిరాశ కలిగిస్తుంది. కార్యక్రమాలలో కొద్దిపాటి ఆటంకాలు. ఇంటాబయటా వివాదాలు చికాకు పరుస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సామాన్యస్థితి. ఉద్యోగులు విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఎంత కష్టించినా ఫలితం ఉండదు. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మహిళలకు కొంత ఆందోళన కలిగిస్తాయి. అనుకూల రంగులు….. గులాబీ, లేత ఆకుపచ్చ. ప్రతికూల రంగు…ఎరుపు. నరసింహ స్తోత్రాలు పఠించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సమయానికి పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను సుదీర్ఘకాలం తరువాత కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. అదనపు ఆదాయంతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు మరింత పెరుగుతాయి. ఉద్యోగులకు పనితీరులో మార్పులు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు అవకాశాలు దక్కించుకుంటారు. విద్యార్థుల ప్రయత్నాలు సఫలం. మహిళలకు గౌరవానికి లోటు ఉండదు. అనుకూల రంగులు….. బంగారు, కాఫీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. ఆదిత్య హృదయం పఠించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు.. కాంట్రాక్టర్లకు నూతనోత్సాహం. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలు విస్తృతపరుస్తారు. ఉద్యోగులకు కీలక మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కొత్త ఆశలు. విద్యార్థులు కొన్ని అవకాశాలు సాధిస్తారు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. అనుకూల రంగులు….. గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు…తెలుపు. దుర్గా స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు ఉంటాయి. బంధువులు మీ పై కొన్ని విమర్శలు చేయవచ్చు. కాంట్రాక్టర్ల యత్నాలలో అవాంతరాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. ఉద్యోగులకు చిక్కులు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు అంచనాలలో పొరపాట్లు. విద్యార్థులకు గందరగోళం. మహిళలకు ఆస్తి వివాదాలు తప్పవు. అనుకూల రంగులు….. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు…గులాబీ. విష్ణు సహస్ర నామ పారాయణ చేయాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
కార్యక్రమాలు ఆటంకాలతో నడుస్తాయి. రాబడి అనుకున్నంతగా కనిపించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటాబయటా సమస్యలు పెరుగుతాయి. సేవా, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సమస్యలు తీరతాయి. ఉద్యోగులకు విధులలో చిక్కులు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులు మరింత శ్రమపడితేనే ఫలితం ఉంటుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు….. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆదాయం అనుకున్న రీతిలో పెరిగి అవసరాలు తీరతాయి. సన్నిహితుల నుంచి మాట సాయం అందుతుంది. కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొంత అనుకూలత సాధిస్తారు. ఉద్యోగస్తులకు కీలక సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు సంతోషకర సమాచారం. విద్యార్థులు ఊహించని అవకాశాలు సాధిస్తారు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. అనుకూల రంగులు.. ఆకుపచ్చ, పసుపు. ప్రతికూల రంగు…తెలుపు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వాహనాలు, నగలు కొంటారు. భార్యాభర్తల మధ్య వివాదాలు తీరతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగులు విధులను ప్రశాంతంగా పూర్తి చేస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒక కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. మహిళలకు బంధువుల నుండి శుభవార్తలు. అనుకూల రంగులు….. గోధుమ, ఎరుపు. ప్రతికూల రంగు…నీలం. గణపతిని ఆరాధించండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com