Today rashi phahalu – 18 జనవరి 2023, బుధవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి. దూరపు బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆప్తులతో తగాదాలు ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త సమస్యలు మీద పడవచ్చు. ఉద్యోగులకు విధుల పట్ల అప్రమత్త పాటించాలి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఆచితూచి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు. మహిళలకు కుటుంబ సభ్యులతో మనస్పర్థలు. అనుకూల రంగులు………… బంగారు, ఎరుపు. ప్రతికూల రంగు…కాఫీ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
నూతనోత్సాహంతో కొన్ని కార్యాలు చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉండి అవసరాలు తీరతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. శుభకార్యాలు, కొన్ని వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. వ్యతిరేక వర్గీయులు మీకు కొంత మాటసాయం అందిస్తారు. ఉద్యోగులు ఉత్సాహంగా విధులు చక్కబెడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు. విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలు సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభాలు. అనుకూల రంగులు……….. గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు….ఎరుపు. వేంకటేశ్వరస్వామిని పూజించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ప్రముఖులతో ఊహించని పరిచయాలు. దీర్ఘకాలిక సమస్యలను ఓర్పుగా పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలలో ముందడుగు వేస్తారు. భూములు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు తమ లాభాలను పెంచుకుంటారు. ఉద్యోగాల్లో వివాదాలను తేలిగ్గా పరిష్కరించుకుంటారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు వ్యవహారాలను సాఫీగా సాగిస్తారు. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకు శుభ వర్తమానాలు. అనుకూల రంగులు………. బంగారు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు… నేరేడు. దుర్గాదేవిని పూజించాలి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ప్రయాణాలు కొంత కుదిస్తారు. కార్యక్రమాలను శ్రమానంతరం పూర్తి చేస్తారు. అంచనాలలో కొన్ని పొరపాట్లు దొర్లుతాయి. రాబడి ఆశించినంత లేక అప్పులు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు. ఉద్యోగాల్లో మరిన్ని బాధ్యతలు మీదపడతాయి. క్రీడాకారులు, వైద్యులు వివాదాలలో చిక్కుకుంటారు. విద్యార్థుల ఆశలు అంతగా ఫలించవు. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు………. గోధుమ, నీలం. ప్రతికూల రంగు….పసుపు. గణపతిని పూజించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
కుటుంబ సమస్యలు వేధిస్తాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు. మీ కష్టం వేరొకరికి ఉపయోగపడుతుంది. ఆలోచనలు కలిసిరావు. వ్యతిరేకుల ద్వారా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఓర్పు వహించడం ఉత్తమం. ఆరోగ్యసమస్యలు సతమతం చేస్తాయి. ఆదాయం నిరుత్సాహపరుస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చిక్కులు ఎదురవుతాయి. ఉద్యోగులకు విధులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు నిరుత్సాహం చెందుతారు. విద్యార్థులకు కొంత అసంతృప్తి తప్పదు. మహిళలకు కుటుంబపరంగా చికాకులు. అనుకూల రంగులు…………కాఫీ, బంగారు. ప్రతికూల రంగు…నేరేడు. నరసింహ స్తోత్రాలు పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ముఖ్యమైన కార్యక్రమాలలో అడుగు ముందుకేస్తారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సేవా, ధార్మిక కార్యక్రమాలలో మీపాత్ర పోషిస్తారు. భార్యాభర్తల మధ్య మరింత సయోధ్య ఏర్పడి సంతోషంగా గడుపుతారు. బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు సమయానికి సమకూరతాయి. ఉద్యోగాల్లో కొత్త విధులు నిర్వర్తిస్తారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కీలక సమాచారాన్ని అందుకుంటారు. విద్యార్థులకు సంతోషకరమైన ఫలితాలు. మహిళలకు కుటుంబంలో గౌరవం. అనుకూల రంగులు………..పసుపు, కాఫీ. ప్రతికూల రంగు….నేరేడు. హనుమాన్ ఛాలీసా పఠించడం మంచిది.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కుటుంబ సభ్యులతో విభేదాలు. కొత్తగా రుణాలు చేసి అవసరాలకు ఉపయోగిస్తారు. ఇంటాబయటా సమస్యలు ఎదురై ఇబ్బంది పడతారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశంలేదు. స్నేహితుల నుంచి ధన, మాట సహాయం కోరతారు. దూర ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఎంత శ్రమించినా లాభాలు అంతగా కనిపించవు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. మహిళలకు నిరాశాజనకమే. అనుకూల రంగులు………. నీలం, పసుపు. ప్రతికూల రంగు…తెలుపు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అతి ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. కాంట్రాక్టులను అందరినీ ఆకట్టుకుని సాధిస్తారు. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు మరింత సమకూరతాయి. ఉద్యోగాలలో ఎటువంటి ఇబ్బందినైనా అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మహిళలకు శుభ వర్తమానాలు. అనుకూల రంగులు………… గులాబీ, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. హనుమాన్ ఛాలీసా పఠించడం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
వ్యవహారాలలో కొన్ని ప్రతిబంధకాలు. అనుకోని ఖర్చులు రావచ్చు, అయితే ఆదాయం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. ఆలోచనలపై ఎటూ తేల్చుకోలేరు. వివాదాలు, కోపతాపాలు వీడి సంయమనం పాటించాలి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు కొంత సవాలుగా మారవచ్చు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థులు మరింత శ్రమ పడాలి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……….. గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు….తెలుపు. విష్ణు ధ్యానం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. కుటుంబంలో రానున్న శుభకార్యాల పై ప్రణాళిక తయారు చేస్తారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రయాణాలు ఎటువంటి అవాంతరాలు లేకుండా సాగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితుల సాయం అందుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు స్వయంకృషితో అభివృద్ధి చెందుతారు. ఉద్యోగాల్లో ఒత్తిడుల నుంచి విముక్తి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు అవకాశాలు మరింత రావచ్చు. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు. మహిళలకు ఆస్తిలాభం. అనుకూల రంగులు………… గులాబీ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు….ఎరుపు. ఆంజనేయ దండకం పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ముఖ్యమైన కార్యక్రమాలలో అనుకూలత. రాబడిపై ఉన్న ఆందోళన తొలగుతుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగప్రయత్నాలను వేగవంతంగా చేస్తారు. ఉద్యోగాల్లో ఉన్నతస్థితి అందుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు తథ్యం. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు విదేశీ పర్యటనకు సిద్ధపడతారు. విద్యార్థులకు ప్రయత్నాలలో విజయం. మహిళలకు భూలాభాలు. అనుకూల రంగులు……… ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు….ఆకుపచ్చ. నృసింహ స్తోత్రాలు పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్తగా రుణ యత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. స్నేహితుల నుంచి కొన్ని సమస్యలు లేదా వివాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. సోదరులను కలుసుకుని ముఖ్యవిషయాలపై సంప్రదిస్తారు. ఆరోగ్యంపై ఎటువంటి నిర్లక్ష్యం వద్దు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు కొత్త నిర్ణయాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు ఒక ప్రకటన ఆశ్చర్యం కలిగించవచ్చు. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……….. ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు….నేరేడు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com