Today rashi phahalu – 21 జనవరి 2023, శనివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. తీర్థ యాత్రలు చేస్తారు. బంధువులు, శ్రేయోభిలాషులు మీపట్ల ద్వేషభావం చూపుతారు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపార, వాణిజ్యవేత్తలు ప్రతిబంధకాల మధ్య లావాదేవీలు నిర్వహిస్తారు. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఇబ్బందికర పరిస్థితి. విద్యార్థులు ఆచితూచి అడుగేయాలి. మహిళలకు కుటుంబసమస్యలు. అనుకూల రంగులు…… ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు… తెలుపు. శివ స్తోత్రాలు పఠించాలి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

తొందరపాటు ప్రయాణాలు వద్దు. ఆదాయం అంతగా కనిపించదు. కుటుంబ సభ్యులతో తగాదాలు.. శ్రమ మరింత పెరుగుతుంది. ఆలోచనలు కలసిరావు. ఇంటి నిర్మాణయత్నాలు మధ్యలో విరమిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు కష్టమే. ఉద్యోగులకు చికాకులు తప్పవు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఒత్తిడులు. విద్యార్థులు కొంత నిదానం పాటించాలి. మహిళలకు మనోనిబ్బరం తగ్గుతుంది. అనుకూల రంగులు……… పసుపు, కాఫీ. ప్రతికూల రంగు….ఆకుపచ్చ. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


కీలక వ్యవహారాల్లో విజయం. శుభవార్తలు వింటారు. దూరపు బంధువులతో కష్టసుఖాలు పంచుకుంటారు. స్నేహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు తగిన లాభాలు రాగలవు. ఉద్యోగులకు పెండింగ్బకాయిలు అందుతాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు సమస్యలు తీరతాయి. మహిళలకు చికాకులు తొలగుతాయి. అనుకూల రంగులు………… ఎరుపు. కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. హనుమాన్ ఛాలీసా పఠించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి. కుటుంబంలో అందరితోనూ ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా నడుస్తున్న వివాదాలు తీరతాయి. పాతస్నేహితులను కలుసుకుని మనస్సులోని అభిప్రాయాలు పంచుకుంటారు. సేవాభావంతో ఆపదలో ఉన్న వారికి చేయూతనిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సంస్థల అభివృద్ధిపై సాయం అందుతుంది. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. క్రీడాకారులు, చిత్ర పరిశ్రమ వారు అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులకు ఉత్సాహం పెరుగుతుంది. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకూల రంగులు………… కాఫీ. గులాబీ. ప్రతికూల రంగు…తెలుపు. విష్ణు ధ్యానం చేయండి..

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


ముఖ్య వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు తప్పనిసరి. అనుకోని ఖర్చులతో సతమతమవుతారు. ఆదాయం ఆశించినంత సమకూరదు. కుటుంబ సభ్యులతో తగాదాలు. ఆరోగ్యపరంగా చికాకులు. ముఖ్య నిర్ణయాలలో జాప్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలపై నిరాశ చెందుతారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు అవకాశాలు చేజారతాయి. మహిళలకు కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. అనుకూల రంగులు………… ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు….పసుపు. గణపతి ఆరాధన మంచిది.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


బంధువులతో అకారణంగా తగాదాలు. మీ యత్నాలలో అవాంతరాలు. ప్రయాణాలు ఖరారు చేసుకోవడంలో జాప్యం. కఠినమైన శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్యం మందగిస్తుంది. కుటుంబసభ్యుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. రాబడి ఆశించిన స్థాయిలో లేక నిరాశ చెందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడుల్లో అవాంతరాలు. ఉద్యోగాలలో విధులు మరిన్ని మీదపడవచ్చు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు సమస్యలతో సహవాసం చేస్తారు. విద్యార్థులు కొంత నిరాశకు లోనవుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……….. పసుపు, గోధుమ, ప్రతికూల రంగు….తెలుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


కార్యక్రమాలలో విజయం సా«ధిస్తారు. సంఘంలో మీపై విశేష గౌరవం చూపుతారు. ఒక కీలక సమాచారంతో ఊరట చెందుతారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. పట్టుదలతో మీ ఆశయాలు సాధిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం దక్కించుకుంటారు. ఉద్యోగాల్లో విధులు ప్రశాంతంగా సాగిపోతాయి. చిత్ర పరిశ్రమవారు, క్రీడాకారులకు పట్టింది బంగారమే. విద్యార్థులు విజయాల బాటలో పయనిస్తారు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. అనుకూల రంగులు………… గులాబీ, తెలుపు. ప్రతికూల రంగు….ఆకుపచ్చ. ఆంజనేయ స్వామిని పూజించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ప్రయాణాల్లో స్వల్ప మార్పులు. కుటుంబ సభ్యులతో వైరం. ఆలయాలు సందర్శిస్తారు. అంచనాలలో కొన్ని పొరపాట్లు దొర్లుతాయి. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ముందు అనుకున్న మేర లాభాలు కష్టమే. ఉద్యోగులు వి«ధుల పట్ల శ్రద్ధ వహించాలి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు ఒత్తిడులు. విద్యార్థులు మరింత శ్రమకోర్చాల్సిన అవసరం. మహిళలకు అనారోగ్యం. అనుకూల రంగులు……….. కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు….నేరేడు. గాయత్రీ ధ్యానం చేయండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల ద్వారా మీకు ఉపయుక్తమైన సమాచారం రాగలదు. వ్యతిరేకులు మీకు అనుకూలంగా మారతారు. కుటుంబంలో కొన్ని వేడుకల నిర్వహణపై ఏర్పాట్లు చేస్తారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులు నిరీక్షణ ఒక కొలిక్కి వస్తుంది. ఆదాయానికి ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్యార్థులు స్వంత ఆలోచనలతో ముందడుగు వేస్తారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకూల రంగులు……….. ఎరుపు. కాఫీ. ప్రతికూల రంగు….పసుపు. నృసింహస్వామిని పూజించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


కొన్ని కార్యక్రమాలను పట్టుదల, ఓర్పుతో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు ఉంటాయి. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా సమస్యలు ఎదురుకావచ్చు. ఆరోగ్యం పై నిర్లక్ష్యం వద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆకస్మిక పర్యటనలు. విద్యార్థులు ఎంచుకున్న అవకాశాలపై ఆశలు వదులుకోవాలి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……….. లేత పసుపు, నీలం. ప్రతికూల రంగు….ఎరుపు. ఆదిత్య హృదయం పఠించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


కొన్ని రావలసిన బాకీలు వసూలవుతాయి. కుటుంబంలో ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యలపై దృష్టి సారిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఒత్తిడుల నుండి విముక్తి. ఉద్యోగాలలో అవరోధాలు తొలగుతాయి. పారిశ్రామిక,రాజకీయవేత్తలకు శ్రమ కొంత ఫలిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మహిళలకు విజయవంతంగా గడుస్తుంది. అనుకూల రంగులు…….. ఆకుపచ్చ, గోధుమ, ప్రతికూల రంగు….నేరేడు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇళ్లు, వాహనాలు సమకూర్చుకుంటారు. ఎంతటి సమస్యనైనా తేలిగ్గా పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అందుతాయి. ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అంచనాలు ఫలిస్తాయి. మహిళలకు స్థిరాస్తిలాభం. అనుకూల రంగులు……..గోధుమ, గులాబీ. ప్రతికూల రంగు…తెలుపు. విష్ణు సహ్రనామ పారాయణం మంచిది.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: