Sri Matsyagiri Lakshmi Narasimha Swamy Temple

లక్ష్మీ నరసింహస్వామి ఎక్కువగా కొండలను .. గుట్టలను తన స్థిర నివాసంగా చేసుకుని తన భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఆ స్వామి ఆ కొండలపై గల గుహలలో వెలసి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. అలా ఆయన కొలువైన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో “మత్స్యగిరి”(Matsyagiri) ఒకటిగా కనిపిస్తుంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ సమీపంలో విలసిల్లుతోంది. లోక కల్యాణం కోసం శ్రీమహా విష్ణువు ధరించిన దశావతారాలలో మత్స్యావతారం మొదటిది. అలాంటి మత్స్య రూపంలో లక్ష్మీ నరసింహస్వామి కొలువైన పుణ్య క్షేత్రంగా “మత్స్యగిరి”(Matsyagiri) ప్రసిద్ధి చెందింది.

ఒకానొకప్పుడు సోమకాసురుడు వేదాలను అపహరించి దేవతా శక్తులు బలహీనపడేలా చేయాలనుకుంటాడు. బ్రహ్మదేవుడి నుంచి వేదాలను దొంగిలిస్తాడు. తన నుంచి తిరిగి వేదాలను తీసుకోవడానికి శ్రీమహావిష్ణువు రంగంలోకి దిగాడని తెలిసి, ఆయన కంటికి కనిపించకూడదనే ఉద్దేశంతో, వేదరాశితో పాటు సముద్ర గర్భంలో దాక్కుంటాడు. అది గమనించిన శ్రీ మహా విష్ణువు మత్స్యావతారాన్ని ధరించి, సుమిత్ర గర్భంలోకి ప్రవేశిస్తాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. సోమకాసురుడిని సంహరించిన శ్రీమహా విష్ణువు, తిరిగి వాటిని బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు.

అలా వేదాలను రక్షించడానికి శ్రీమహా విష్ణువు మత్స్యావతారాన్ని ధరించాడు. అయితే మిగతా అవతారాలలో మాదిరిగా స్వామి మత్స్యావతారంలో వెలసిన క్షేత్రాలు చాలా తక్కువ. అలాంటి అరుదైన క్షేత్రంగా “మత్స్యగిరి”(Matsyagiri) కనిపిస్తుంది. కొండ గుహలలో .. గుట్టలపైన ఆవిర్భవించిన విష్ణుమూర్తి రూపాలను నరసింహస్వామిగా భావించి భక్తులు సేవించి తరిస్తుంటారు. అలా ఈ కొండపై మత్స్యావతారంలోని సాలగ్రామ శిలనే భక్తులు శ్రీలక్ష్మీ నరసింహస్వామిగా భావిస్తూ కొలుస్తుంటారు. స్వామివారు ఆవిర్భవించిన తరువాత కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది. ప్రతి ఏడాది జ్యేష్ట శుద్ధ త్రయోదశి నుంచి ఐదు రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి.

ఇక్కడి కొండ మత్స్యావతారంలో ఉండటం .. ఆ కొండపై గల కోనేరులో చేపలు సహజమైన విష్ణు నామాలు కలిగి ఉండటం విశేషం. నామాలు కలిగిన చేపలను మనం ఇక్కడ మాత్రమే చూడగలుగుతాము. ఇక కొండ పైభాగంలోకి ఒక శిల అచ్చు చేప ఆకారంలో ఉంటుంది. స్వామివారు మత్స్యావతారంలో ప్రత్యక్షంగా ఇక్కడ కొలువై ఉన్నారనడానికి ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలని భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. హనుమంతుడు క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన, దుష్టశక్తుల పీడలు .. దుష్టగ్రహ బాధలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఈ క్షేత్రానికి చేరువకావడానికి బస్సు .. రైలు మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి “వలిగొండ” మీదుగా చేరుకోవవచ్చు.. భువనగిరికి 36 కిలోమీటర్లు .. నల్గొండకి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడం తేలిక. ఘాట్ రోడ్ ద్వారా కార్లలో .. ఆటోల్లో కొండపైకి చేరుకోవచ్చు. సువిశాలమైన ప్రదేశంలో .. ప్రశాంతమైన వాతావణంలో అలరారుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

*ఉగ్రం వీరం మహా విష్ణుమ్ జ్వలన్తమ్ సర్వతో ముఖం! నృసింహమ్ భీషణం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం!!

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక : ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Sri Matsyagiri Lakshmi Narasimha Swamy Temple

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2024 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2024 – Panchangam – App on Apple App Store