Today rashi phahalu – 22 జనవరి 2023, ఆదివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ముఖ్యమైన పనుల్లో పురోగతి. ఇంటిలోశుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులు పూర్తిగా సహకరిస్తారు. అందరిలోనూగుర్తింపు. వాహనాలు,ఆభరణాలు కొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కుటుంబంలో మీదే పైచైయిగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కొత్త అవకాశాలు సాధిస్తారు. విద్యార్థులకు ఊహలు నిజమవుతాయి. మహిళలు శుభవార్తలు వింటారు. అనుకూల రంగులు…….. పసుపు,కాఫీ. ప్రతికూల రంగు…. నేరేడు. వినాయకునికి అర్చనలు చేయండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఆర్థిక ఇబ్బందులుతో సతమతమవుతారు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనుకోని ఖర్చులు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాల్లో కొద్దిపాటి సమస్యలు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు శ్రమ మిగులుతుంది. విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. మహిళలు కొంత సహనం పాటించడం ఉత్తమం. అనుకూల రంగులు…….. గోధుమ,పసుపు. ప్రతికూల రంగు….తెలుపు. ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
కొత్త రుణాల కోసం యత్నాలు సాగిస్తారు. మిత్రులు,బంధువులతో తగాదాలు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఎంత కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. రావలసిన బాకీలు సకాలంలో అందక ఇబ్బందిపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చిక్కులు ఎదురవుతాయి. ఉద్యోగాల్లో అనుకోని మార్పులు. రాజకీయవేత్తలు, వైద్యులకు ఒత్తిడులు. విద్యార్థులకు అవకాశాలు నిరాశ పరుస్తాయి. మహిళలు ఆశ్చర్యకర ఫలితాలు పొందుతారు. అనుకూల రంగులు…….. తెలుపు,ఎరుపు. ప్రతికూల రంగు….పసుపు. శ్రీ రామస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. వివాదాలు పరిష్కారమై ఊపిరిపీల్చుకుంటారు. సన్నిహితుల సాయం పొందుతారు. రాబడి ఊహించిన విధంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్నతస్థితి. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఉత్సాహవంతంగా గడుపుతారు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. మహిళలకు ఆస్తి లాభం కలిగే సూచనలు. అనుకూల రంగులు…….. ఆకుపచ్చ,తెలుపు. ప్రతికూల రంగు….నీలం. అంగారక స్తోత్రాలు పఠించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలలోపాల్గొంటారు. పాత బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మీ ఆశయాలు నెరవేరే సమయం. వ్యతిరేకులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు అధిక మొత్తంలో లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులు పడిన శ్రమ ఫలితాన్నిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు విజయాలు చేకూరతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు ధనలబ్ధి. అనుకూల రంగులు…….. గోధుమ,పసుపు. ప్రతికూల రంగు….ఆకుపచ్చ. శివాష్టకం పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
అనుకోని సంఘటనలు. ఆస్తి విషయంలో కొన్ని చికాకులు. మానసికఅశాంతి. ఇంటిలో ఒత్తిడులు పెరుగుతాయి. ఒక ప్రకటన కొంత నిరాశ కలిగిస్తుంది. గృహ నిర్మాణాలలో విరామం ఇస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఇబ్బందికర పరిస్థితి. ఉద్యోగాలలో ఊహించని విధంగా మార్పులు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు చికాకులతో గడుపుతారు. విద్యార్థులు కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారు. మహిళలు మానసిక అశాంతికి లోనవుతారు. అనుకూల రంగులు…….. ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు….ఎరుపు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. ఆస్తి విషయాల్లో సోదరులతో తగాదాలు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం పై శ్రద్ధ చూపండి. ఆలయాలు సందర్శిస్తారు. నిలిచిపోయిన వ్యవహారాలు పూర్తికి యత్నిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సమస్యలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఇబ్బందులు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు నిరుత్సాహం. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు దూరమవుతాయి. మహిళలు ఆశ్చర్యకర ఫలితాలు పొందుతారు. అనుకూల రంగులు…….. కాఫీ,తెలుపు. ప్రతికూలరంగు….నేరేడు. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా సాగిస్తారు. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు సంతోషం కలిగిస్తాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు సమస్యల నుండి విముక్తి. విద్యార్థులు ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. మహిళలకు విశేష గౌరవం. అనుకూల రంగులు…. గోధుమ,ఎరుపు. ప్రతికూల రంగు….తెలుపు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆర్థిక ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణాలు ఉండవచ్చు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంటారు. ఒక సంఘటన కొంత ప్రభావం చూపుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు గందరగోళం. ఉద్యోగులకు మరింత పనిభారం. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు నిరాశ తప్పదు. విద్యార్థులు కొంత నిరుత్సాహపడతారు. మహిళలు పట్టుదలతో వివాదాలు పరిష్కరించుకుంటారు. అనుకూల రంగులు…. తెలుపు, ఎరుపు. ప్రతికూలం…. గోధుమ. శివపంచాక్షరి పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
వ్యవహారాల్లో విజయం. శుభకార్యాల్లోపాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు నెమరువేసుకుంటారు. ఆర్థికంగా కొంత అనుకూలస్థితి. ఒక దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఇంటిలో మీపై గౌరవం మరింత పెరుగుతుంది. కుటుంబవిషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య సయోధ్య ఏర్పడుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తల విస్తరణ కార్యక్రమాలు పూర్తి కాగలవు. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు. విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మహిళలు కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. అనుకూల రంగులు…. నీలం,ఆకుపచ్చ. ప్రతికూలం….నేరేడు. హనుమాన్ఛాలీసా పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందిపడతారు. సంఘంలో గౌరవమర్యాదలు. ఆప్తులతో స్వల్ప విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలకు దూరంగా మెలగండి. హామీలు నిలుపుకునేందుకు శ్రమిస్తారు. గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. విద్యార్థులు మరింత శ్రమపడాల్సిన సమయం. మహిళలకు శుభవార్తలు. అనుకూల రంగులు…….. గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు….కాఫీ. ఆంజనేయ స్వామిని పూజించాలి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలుతీసుకుంటారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు . ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సంస్థల నిర్వహణ అభివృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఉన్నత స్థాయి. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు శుభవార్తలు. విద్యార్థులకు ఉత్సాహంగా గడుస్తుంది. మహిళల ఆశలు నెరవేరతాయి. అనుకూల రంగులు…….నీలం, నలుపు. ప్రతికూలరంగు… గులాబీ. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com