Today rashi phahalu – 24 జనవరి 2023, మంగళవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


దూరపు బంధువులను కలుసుకుంటారు. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. మీ అంచనాలు నిజమవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు సన్మానాలు. విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు ఉత్సాహవంతమైన రోజు. అనుకూల రంగులు……. ఎరుపు, లేత నీలం. ప్రతికూల రంగు…నేరేడు. ఆదిత్య హృదయం పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలోపాల్గొంటారు. పాతబాకీలు వసూవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అదనపు రాబడి ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సమస్యలు తీరతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు శుభవార్తలు వింటారు. విద్యార్థులు నిర్దేశిత అవకాశాలు సాధిస్తారు. మహిళలకు భూ, గృహయోగాలు. అనుకూల రంగులు…….. పసుపు, తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. గణపతి స్తోత్రాలు పఠించాలి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


ఆర్థిక వ్యవహారాలలో కొంత గందరగోళం. ఆలోచనలు కార్యరూపం దాల్చవు. ఆరోగ్యం పట్ల మెలకువ పాటించండి. ఆలయాలు సందర్శిస్తారు. కార్యక్రమాలలో స్వల్ప అవాంతరాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు వ్యవహారాలలో ఇబ్బందులు. ఉద్యోగులకు విధుల్లో పొరపాట్లు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు………. గోధుమ, తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. కార్యక్రమాలలో జాప్యం. బంధువులు, స్నేహితులతో అకారణంగా విభేదాలు. ఉద్యోగ ప్రయత్నాలకు కొంత విఘాతం. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సంస్థల వికేంద్రీకరణలో అవరోధాలు. ఉద్యోగులకు ఊహించని బదిలీలు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఒత్తిడులు ఎదుర్కొంటారు. విద్యార్థులు శ్రమతో ఫలితం సాధిస్తారు. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు…….. కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. హనుమాన్ ఛాలీసా పఠించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


కొత్త అంచనాలు, వ్యూహాలతో ముందడుగు వేస్తారు. ఆదాయం మీ అంచనాలకు అనుగుణంగా పెరుగుతుంది. దూరపు బంధువుల ప్రోద్బలంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చాకచక్యంగా కొన్ని వివాదాలు, సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పై కొంత శ్రద్ధ వహించండి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. క్రీడాకారులు, పరిశోధకులకు విదేశీ పర్యటనలు. విద్యార్థులకు అవకాశాలు మరింత దక్కుతాయి. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. అనుకూల రంగులు……. పసుపు, కాఫీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. నవగ్రహ స్తోత్రాల పఠించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


చిరకాల కోరిక నెరవేరుతుంది. ఎటువంటి కార్యక్రమమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో విశేష గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. నిరుద్యోగులు సత్తా చాటుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు విధులు ఆశాజనకంగా సాగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొన్ని నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు అన్వేషణలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఊహించని పిలుపు రావచ్చు. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. అనుకూల రంగులు….. పసుపు, ఎరుపు. ప్రతికూల రంగు…తెలుపు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


కొన్ని కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టుబడుల్లో తడబడతారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పారిశ్రామిక,రాజకీయవేత్తలకు ఒత్తిడులు అధికమవుతాయి. విద్యార్థులలో అసహనం, మానసిక ఆందోళన. మహిళలకు చికాకులు తప్పవు. అనుకూల రంగులు….. కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. సత్యనారాయణస్వామిని పూజించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

రుణ దాతలు మీపై ఒత్తిడులు పెంచుతారు. ఎటూ తోచని స్థితిలో పడతారు. దూరప్రయాణాలు ఉంటాయి. సోదరులు, మిత్రులతో కలహాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని కార్యక్రమాలను తప్పనిసరిగా వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు చేజారతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త సమస్యలు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. పారిశ్రామిక,రాజకీయవేత్తలు ఆందోళనతో గడుపుతారు. విద్యార్థులు అవకాశాలు దూరం చేసుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత. అనుకూల రంగులు……. పసుపు, ఎరుపు. ప్రతికూల రంగు…నీలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో మీ పై గౌరవం పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా ముగిస్తారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారవచ్చు. ధార్మిక కార్యక్రమాలలో మీ పాత్ర పోషిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థలను క్రమపద్ధతిలో నిర్వహిస్తారు. ఉద్యోగులకు అనుకోని కొన్ని మార్పులు ఉండవచ్చు. క్రీడాకారులు, వైద్యులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు సత్తా చాటుకునే సమయం. మహిళలకు అన్ని విధాలా సానుకూల పరిస్థితులు. అనుకూల రంగులు….. గోధుమ, బంగారు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


ప్రయాణాలలో అవరోధాలు. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఇంటాబయటా వ్యతిరేకత ఎదురవుతుంది. బంధువులతో లేనిపోని విభేదాలు నెలకొంటాయి. కష్టానికి తగ్గ ఫలితం కష్టమే. ఒక సమాచారం ఇబ్బందికరంగా మారవచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలు గందరగోళం మధ్య గడుపుతారు. ఉద్యోగులకు శ్రమ మరింత పెరుగుతుంది. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు కొద్దిపాటి చికాకులు. విద్యార్థుల కృషి కొంత ఫలిస్తుంది. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు…… కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు…గులాబీ. కుజ స్తోత్రం పఠించాలి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. కుటుంబంలో గౌరవం పొందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంటాబయటా మీకు ఎదురులేదనిపిస్తుంది. మీ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చిక్కులు. ఉద్యోగాలలో అదనపు పనితో ఒత్తిడులు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు సమస్యలు తప్పవు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. అనుకూల రంగులు……… కాఫీ, గులాబీ. ప్రతికూల రంగు…పసుపు. సుబ్రహ్మణ్యేశ్వర పూజలు మంచిది.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. భూ వివాదాలు నెలకొంటాయి. స్నేహితులతో విభేదాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో కొత్త చిక్కులు. చిత్రపరిశ్రమ వారు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలలో మార్పులు. విద్యార్థులు స్వంత నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. మహిళలకు అనారోగ్యం. అనుకూల రంగులు……. తెలుపు. పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: