Shuchindram
తమిళనాట ప్రాచీనమైన .. ప్రసిద్ధమైన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఒక వైపున ఆధ్యాత్మిక వైభవం .. మరో వైపున చారిత్రక ఘనత కలిగిన ఈ క్షేత్రాలు అడుగడుగునా ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి .. భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. అలాంటి క్షేత్రాలలో “శుచీన్ద్రం”(Shuchindram) ఒకటిగా కనిపిస్తుంది. చోళ .. చేర .. పాండ్య .. నాయక రాజుల కాలంలో ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతూ వచ్చిందనడానికి నిదర్శనంగా ఇక్కడ శాసనాలు కనిపిస్తాయి. కన్యాకుమారికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలోనే అనసూయ మాత పాతివ్రత్య నిరూపణ జరిగిందని స్థలపురాణం చెబుతోంది.
పూర్వం ఈ ప్రదేశంలో అత్రి మహర్షి – అనసూయ మాత ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉండేవారట. ఆమె పాతివ్రత్య మహిమను గురించి నారద మహర్షి ద్వారా తెలుసుకున్న త్రిమాతలు, అనసూయ మాత పాతివ్రత్యాన్ని పరీక్షించమని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడు లను పంపిస్తారు. సాధువుల రూపంలో వెళ్లిన వారిని అతిథులుగా ఆమె ఆహ్వానిస్తుంది. ఆమె వస్త్రాలు లేకుండా తమకి భోజనం వడ్డించవలసి ఉంటుందనీ .. అది తమ నియమమని ముగ్గురు సాధువులు కోరతారు. వాళ్ల కోరిక వినగానే వచ్చినవారు సామాన్యులు కారనే విషయాన్ని అనసూయ మాత గ్రహిస్తుంది. తన పాతివ్రత్య మహిమతో ఆ ముగ్గురునీ పసి పిల్లలలుగా మార్చేసి ఆకలి తీరుస్తుంది. ఆ తరువాత వాళ్లను ఊయలలో వేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న త్రిమాతలైన సరస్వతి, లక్ష్మీ, పార్వతి దేవీలు వచ్చి .. తమ భర్తలకు పూర్వ రూపాన్ని ఇవ్వమని అనసూయ మాతను వేడుకుంటారు. అప్పుడు ఆమె వాళ్లకి పూర్వ రూపాన్ని ఇస్తుంది. అనసూయ మాత పాతివ్రత్య మహిమ లోకంలో ఎప్పటికీ చెప్పుకునే విధంగా త్రిమూర్తులు ఇక్కడ మూడు శివలింగాలుగా మారిపోతారు. అలా ఈ క్షేత్రం ఒక అద్భుతమైన సంఘటనకు నిదర్శనంగా వెలుగొందుతోంది.
పూర్వం .. గౌతమ మహర్షి ఆశ్రమం మీదుగా వెళుతూ ఆయన భార్య అహల్య అందచందాలకు దేవేంద్రుడు ముగ్ధుడవుతాడు. ఎలాగైనా ఆమెను పొందాలనే ఉద్దేశంతో ఒక పథకం వేస్తాడు. ఆ పథకం ప్రకారం ఒక రాత్రివేళ తాను కోడిలా మారిపోయి ఆశ్రమం వాకిట కోడిలా అరుస్తాడు. తెల్లవారిందని భావించిన గౌతమ మహర్షి నదీ స్నానానికి వెళతాడు. అప్పుడు ఆయన రూపంలో ఆశ్రమంలోకి వచ్చిన ఇంద్రుడు, అహల్యతో కలుస్తాడు. తెల్లవారలేదని గ్రహించిన గౌతమ మహర్షి మధ్యలోనే ఆశ్రమానికి తిరిగొస్తాడు. తన కళ్ల ముందున్న దృశ్యం చూసి ఉగ్రుడవుతాడు.
రాయిలా మారిపొమ్మని అహల్యను శపించిన గౌతముడు, దేహమంతటా స్త్రీ జననాంగాలతో సంచరించమని ఇంద్రుడిని శపిస్తాడు. శాప విమోచనం చెప్పమని ఇంద్రుడు ప్రాధేయపడటంతో, అనసూయ మాత ఆశ్రమ ప్రదేశంలో ఆవిర్భవించిన శివలింగాలను పూజాభిషేకాలు చేసి సేవించమని చెబుతాడు. దాంతో ఆ ప్రదేశానికి చేరుకున్న ఇంద్రుడు అలాగే సేవిస్తూ శాపవిమోచనం పొందుతాడు. ఇంద్రుడు “శుచి” అయిన ప్రదేశం కనుక, ఈ క్షేత్రానికి శుచీన్ద్రం అనే పేరు వచ్చింది. పొడవైన ప్రాకారాలు .. ఎత్తైన గోపురాలు .. శిల్పకళతో ఉట్టిపడే మంటపాలతో విలసిల్లుతోన్న ఈ క్షేత్రం, అనేక విశేషాలకు ఆనవాలుగా కనిపిస్తుంది. అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక : ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.