Tirumalagiri

కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొండలపైనే ఎక్కువగా ఆవిర్భవించాడు. తాను ఉన్న కొండలపైకే భక్తులను రప్పించుకుంటూ ఉంటాడు. అలా స్వామి వారు వెలసిన కొండల్లో ఒకటిగా “తిరుమలగిరి”(Tirumalagiri) కనిపిస్తుంది. లోక కల్యాణం కోసం స్వామివారు వెలసిన ప్రదేశాలు కొన్నైతే .. మహర్షుల కోరిక మేరకు స్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు మరికొన్ని. ఇక మహా భక్తుల అభ్యర్థన మేరకు స్వామివారి కొలువైన క్షేత్రాలు మరికొన్ని. తిరుమలగిరిలోని వేంకటేశ్వరస్వామి మాత్రం “భరద్వాజ మహర్షి” కోరిక మేరకు వెలసినట్టుగా స్థలపురాణం చెబుతోంది.

తిరుమలగిరి అంటే పవిత్రమైన కొండ అని అర్థం. వేంకటేశ్వరస్వామి కొలువైన ఈ క్షేత్రం కృష్ణా జిల్లా .. జగ్గయ్యపేట మండలంలో వెలుగొందుతోంది. సూర్యాపేట జిల్లా కోదాడకీ .. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు మధ్యలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఈ రెండు ప్రాంతాల నుంచి కూడా బస్సుల్లో .. ఆటోల్లో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. వేంకటేశ్వస్వామి స్వామివారు ఆవిర్భవించిన అనేక కథల్లో “పుట్ట” ప్రధాణంగా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారు పుట్టలో వెలవడం .. అర్చా మూర్తిగా పుట్టలో దొరకడం స్వామి మహిమలుగా కనిపిస్తుంటాయి .. వినిపిస్తుంటాయి.

ఇక్కడ స్వామివారు కూడా గర్భాలయంలో పుట్టలోనే దర్శనమిస్తాడు. స్వామివారు ఇక్కడ కొలువులు ఉండటం వెనుక ఒక చిన్నపాటి కథనం వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడి స్వామివారి మూర్తి ఈ మధ్య కాలంలోనో .. వందల సంవత్సరాల క్రితమో వెలసిన మూర్తి కాదు. త్రేతాయుగంలో ఆవిర్భవించిన స్వామి. ఆ యుగంలో భరద్వాజ మహర్షి అనేక ప్రాంతాలలో తిరుగాడుతూ ఇప్పుడు తిరుమలగిరి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. ఈ కొండను చూడగానే దాని పవిత్రత ఆయనకి అర్థమైపోయింది. దాంతో ఇక్కడే ఆయన శ్రీమహా విష్ణువును గురించి తపస్సు చేశాడు.

భరధ్వాజ మహర్షి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన శ్రీమహా విష్ణువు, ఆయన కోరిక మీద అక్కడే వేంకటేశ్వస్వామిగా ఆవిర్భవించాడు. అప్పటి నుంచి కూడా స్వామితో పూజాభిషేకాలు అందుకుంటూనే వస్తున్నాడు. స్వామివారి ఎడమ పాదం క్రింద నుంచి అంటే పాతాళం నుంచి నీరు ఉబికి వస్తుంటుంది. భక్తులకు దీనినే తీర్థంగా ఇస్తుంటారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రానికి శ్రీభ్రమరాంబిక మల్లేశ్వరస్వామి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. పర్వదినాలలో ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. చైత్రమాసంలో స్వామివారికి 6 రోజుల పాటు కల్యాణ బ్రహ్మోత్సవాలను జరుపుతారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు చుట్టుపక్కల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు.

ధర్మ బద్ధమైన కోరికలను మనసులో సంకల్పించుకుని 11 మార్లు ప్రదక్షిణ చేస్తే త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు. ఇక సంతానం లేనివారు ఈ క్షేత్రంలో ఊయల కట్టడం కనిపిస్తూ ఉంటుంది. అలాగే వివాహం విషయంలో ఆలస్యమవుతున్నప్పుడు, ఇక్కడి స్వామివారికి కల్యాణం జరిపించడం వలన వెంటనే ఫలితం కనిపిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు. ఇక తిరుమలకు వెళ్లలేని భక్తులు ఈ స్వామి సన్నిధిలో మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక : ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2024 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2024 – Panchangam – App on Apple App Store