Today rashi phahalu – 25 జనవరి 2023, బుధవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
సంఘంలో ప్రత్యేక గుర్తింపు తథ్యం. కీలక సమాచారం అంది ఊపిరిపీల్చుకుంటారు. అందరి ప్రశంసలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. మీ యత్నాలకు కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థలను మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు మరింత సానుకూలం. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. మహిళలకు ఆస్తిలాభం. అనుకూల రంగులు……..ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు…పసుపు. శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కొత్త కార్యక్రమాలతో ముందుకు దూసుకువెళతారు. ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. విశేషమైన వార్తలు వింటారు. ఆలోచనలు అమలు చేస్తారు. కొన్ని వివాదాలు కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. పెట్టుబడులకు ఢోకా ఉండదు. ఉద్యోగస్తులు మీ హోదాలను నిలుపుకుంటారు. చిత్రపరిశ్రమ వారు, శాస్త్రవేత్తలు కొత్త అవకాశాలు సాధిస్తారు. విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. మహిళలకు సోదరుల నుంచి పిలుపు. అనుకూల రంగులు…….. గులాబీ, ఎరుపు. ప్రతికూల రంగు….కాఫీ. ఆదిత్య హృదయం పఠించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఇంటాబయటా ఒత్తిడులు అధికమవుతాయి. కృషి అంతగా ఫలించదు. కుటుంబసభ్యులతో మనస్పర్ధలు. కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు. దూరప్రయాణాలు సంభవం. ఆరోగ్య పరిస్థితులు చికాకు పరుస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులు పని భారం పెరిగి ఒత్తిళ్లకు లోనవుతారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు చేజారతాయి. విద్యార్థులకు గందరగోళం. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు…….. పసుపు, నేరేడు. ప్రతికూల రంగు…కాఫీ. గణేశాష్టకం పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఇరుగుపొరుగుతో అభిప్రాయబేధాలు. వ్యతిరేకుల పై పట్టు సాధించేందుకు యత్నిస్తారు. రాబడి అంతగా ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య కార్యక్రమాలలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొద్దిపాటి నష్టాలు. ఉద్యోగాల్లో అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు సమస్యలు. విద్యార్థులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మహిళలకు ఆస్తి వివాదాలు. అనుకూల రంగులు…….. ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. విష్ణు ధ్యానం చేయండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
మీ ఆశయాలు నెరవేరతాయి. కీలకమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. అందరిచేత ప్రశంసలు అందుకుంటారు. రాబడి అనూహ్యమైన రీతిలో పెరుగుతుంది. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆలోచనలు కలసివస్తాయి. ఉద్యోగులకు కృషి ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు కొత్త అవకాశాలతో ముందుకు సాగుతారు. విద్యార్థులకు ప్రోత్సాహం. మహిళలకు ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. అనుకూల రంగులు…….. ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు…గులాబీ. హనుమాన్ఛాలీసా పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ప్రయత్నాలు ఫలించి ముందుకు సాగుతారు. సేవాభావం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. కుటుంబంలో శుభపరిణామాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు మరిన్ని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాల్లో ఏ బాధ్యత అయినా సమర్థంగా నిర్వహిస్తారు. క్రీడాకారులు, వైద్యులకు సంతోషకర సమాచారం. విద్యార్థులకు ప్రయత్నాలు ముందుకు సాగవు. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. అనుకూల రంగులు…….. పసుపు, కాఫీ. ప్రతికూల రంగు….నేరేడు. నృసింహ స్తోత్రాలు పఠించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. భూవివాదాలు, సోదరులతో విభేదాలు నెలకొంటాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో అవరోధాలు. దూర ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో సంబంధ బాంధవ్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చిక్కులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు కొంత ఊరట లభిస్తుంది. అనుకూల రంగులు…….. ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు….పసుపు. శివాష్టకం పఠించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సభ్యులతో వివాదాలు. ఆరోగ్య సమస్యలు. కార్యక్రమాలలో కొన్ని ఇబ్బందులు. బంధువులతో తగాదాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులలో నిరుత్సాహం. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు. రాజకీయవేత్తలు, వైద్యులు నిరాశ చెందుతారు. విద్యార్థులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. మహిళలకు వ్యయప్రయాసలు. అనుకూల రంగులు…….. ఎరుపు, నీలం. ప్రతికూల రంగు….ఆకుపచ్చ. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
నూతన పరిచయాలు . ఎక్కడ ఉన్నా గౌరవమర్యాదలకు లోటు రాదు. ఆప్తులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. బంధువులతో కీలక విషయాలపై చర్చలు. ఉద్యోగయత్నాలు సఫలం. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మరింత లాభాలు. ఉద్యోగులు ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు పురస్కారాలు. విద్యార్ధులకు ఒత్తిడులు తొలగుతాయి. మహిళలకు స్థిరాస్తులు దక్కవచ్చు. అనుకూల రంగులు…….. గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు….తెలుపు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
కుటుంబంలో చికాకులు. కొన్ని విషయాలలో మానసిక అశాంతి. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. సన్నిహితులతో అభిప్రాయబేధాలు. ఆకస్మిక ప్రయాణాలలో తొందరపాటు వద్దు. కార్యక్రమాలు అనుకున్న విధంగా ముందుకు సాగక ఇబ్బంది పడతారు. రాబడి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ఆటుపోట్లు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు కొత్త వివాదాలు. మహిళలకు సోదరులతో వివాదాలు. అనుకూల రంగులు…….. పసుపు, నేరేడు. ప్రతికూల రంగు…కాఫీ. ఆదిత్య హృదయం పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
కొత్త వ్యూహాలు అమలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. శ్రేయోభిలాషులు దగ్గరవుతారు. భూవివాదాలు తీరి లాభం పొందుతారు. భార్యాభర్తల మధ్య సయోధ్య ఏర్పడి సంతోషంగా గడుపుతారు. అప్రయత్న కార్యసిద్ధి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులు సేవలకు గుర్తింపు పొందుతారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు విజయాలు చేకూరతాయి. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకూల రంగులు…….. కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు….నేరేడు. అంగారక స్తోత్రాలు పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
వ్యయప్రయాసలు పడ్డా కార్యక్రమాలు ముందుకు సాగవు. రాబడి అంతంత మాత్రంగా ఉండి రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు సంభవం. బంధువర్గంతో విౖభేదాలు. మానసికంగా కొంత ఆందోళన తప్పదు. ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు పాటించండి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. ఒక సమాచారం గందరగోళం కలిగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులు విధుల్లో అవాంతరాలు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులు ఒత్తిడులతో గడుపుతారు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు స్వల్ప అస్వస్థత. అనుకూల రంగులు…….. పసుపు, నేరేడు. ప్రతికూల రంగు….ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com