Today rashi phahalu – 30 జనవరి 2023, సోమవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


కార్యక్రమాలలో అవరోధాలు చికాకు పరుస్తాయి. ఆదాయం కంటే ఖర్చులు తప్పవు. సన్నిహితులు కూడా మీ మాటను పట్టించుకోరు. ఆలోచనలు అంతగా కలసిరావు. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కాంట్రాక్టులు దక్కించుకునేందుకు తాపత్రయపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తల లావాదేవీలలో లాభాలు కష్టసాధ్యమే. ఉద్యోగులకు విధులలో గందరగోళం. వైద్యులు, సాంకేతిక నిపుణులు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులు అవకాశాల ఎంపికలో నిదానం పాటించాలి. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు……. గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. కనకధారా స్తోత్రం పఠించాలి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

కార్యక్రమాలు కొన్ని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అనుకోని ఆహ్వానాలు రాగలవు. నూతన కాంట్రాక్టులు పొందుతారు. సమాజంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ధార్మిక చింతనతో గడుపుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు రావచ్చు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. అనుకూల రంగులు……. ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు…గులాబీ. దత్తాత్రేయుని పూజించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మనస్పర్థలు ఏర్పడతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఆశించిన రాబడి దక్కక నిరాశ చెందుతారు. ఉద్యోగులకు మరింత పనిభారం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొన్ని చిక్కులు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు వివాదాలు. విద్యార్థుల శ్రమ కొంత ఫలించవచ్చు. మహిళలకు మనస్సు ప్రశాంతంగా ఉండకపోవచ్చు. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు …గులాబీ. హనుమాన్ ఛాలీసా పఠించండి

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలు ఉపకరిస్తాయి. కార్యక్రమాలలో విజయం. రాబడి ఆశించిన స్థాయిలో ఉంటుంది. సన్నిహితులు అన్నింటా సహాయపడతారు. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలు శుభవర్తమానాలు అందుకుంటాయి. విద్యార్థులు ఆశించిన అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు కొద్దిపాటి ఆస్తి లాభం. అనుకూల రంగులు……. తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు…నేరేడు. హనుమాన్ ఛాలీసా పఠించండి

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


కుటుంబ వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. ప్రముఖుల సూచనలు అమలు చేస్తారు. కొన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆలోచనల పై ఒక అంచనాకు వస్తారు. చిన్ననాటి స్నేహితులతో మీ అభిప్రాయాలు పంచుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులకు పనిఒత్తిడులు తీరతాయి. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు ఉత్సాహవంతమైన కాలం. విద్యార్థులలో నూతనోత్సాహం. మహిళలకు కుటుంబ సమస్యలు తీరతాయి. అనుకూల రంగులు……. కాఫీ, పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


కుటుంబ సభ్యులతో మనస్పర్థలు, వివాదాలు. ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటారు. పరిస్థితులు అంతగా అనుకూలించవు. అనుకోని సంఘటనలు కొంత కలవరపరుస్తాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి. వ్యాపార, వాణిజ్యవేత్తలు వ్యవహారాల పై నిరాశ చెందుతారు. ఉద్యోగులకు విధి నిర్వహణ సామాన్యంగా ఉంటుంది. వైద్యులు, సాంకేతిక నిపుణులు తొందరపాటు నిర్ణయాలతో సమస్యల్లో చిక్కుకుంటారు. విద్యార్థులు పెట్టుకున్న ఆశలు ఫలించవు. మహిళలకు నిరాశ తప్పదు. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు…పసుపు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


కార్యక్రమాలలో కొంత ఇబ్బంది. ఆదాయానికి మించి ఖర్చులు. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబసమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. కాంట్రాక్టులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.. ఇంటి నిర్మాణాల పై ఒక అంచనాకు వస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తల యత్నాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణ గందరగోళంగా ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు అంచనాలలో పొరపడతారు. విద్యార్థులకు చికాకులు పెరుగుతాయి. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు……. గులాబీ, ఎరుపు. ప్రతికూల రంగు…తెలుపు. హయగ్రీవ సోత్రాలు పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

బంధువులతో సత్సంబంధాలు. ఎంతో కాలంగా వేధిస్తున్న వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలను కొలిక్కి తెచ్చుకుంటారు. గత సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటారు. రాబడి అంచనాల మేరకు పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. క్రీడాకారులు, వైద్యులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు రావచ్చు. మహిళలకు ఆస్తి వివాదాల పరిష్కారం. అనుకూల రంగులు……. ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు….గులాబీ. గణపతిని పూజించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


నూతన కార్యక్రమాలను చేపట్టి విజయవంతం చేస్తారు. ఆలోచనలు కొలిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఎటువంటి పరిస్థితులనైనా చక్కదిద్దుకుంటారు. ప్రముఖులు మీకు చేదోడుగా నిలుస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలలో ప్రోత్సాహం. ఉద్యోగులకు విధుల్లో శ్రద్ధ పెరుగుతుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు గతం నుండి కలుగుతున్న ఇబ్బందులు తీరతాయి. విద్యార్థుల ఆశలు నెరవేరతాయి. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు……. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు ..తెలుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


కొత్త రుణ యత్నాలు. బంధువులతో ప్రతి విషయానికి విభేదాలు. అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. కొన్ని అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు.. కొన్ని బాధ్యతలు సతమతం చేయవచ్చు. స్వల్ప అనారోగ్య సూచనలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు అడుగువేయాలంటే ఆలోచన ముఖ్యం. ఉద్యోగులకు స్థానమార్పులు తప్పవు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు చిక్కులు ఎదురవుతాయి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, కాఫీ. ప్రతికూల రంగు…పసుపు. గణపతి ఆరాధన మంచిది.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


ఆదాయం నిరుత్సాహపరుస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కార్యక్రమాలను శ్రమతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపండి. కీలక నిర్ణయాలలో నిదానం పాటించాలి. ఉద్యోగులకు ఒత్తిడులు అధికం. వ్యాపార, వాణిజ్యవేత్తల ప్రయత్నాలు ముందుకు సాగవు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి శ్రమకు తగిన ఫలితం కనిపించదు. విద్యార్థులు మరింత ఆలోచించి అడుగేయాలి. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. అనుకూల రంగులు……. నీలం, నలుపు. ప్రతికూల రంగు…ఎరుపు. దుర్గాదేవిని పూజించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఒక శుభవార్త అందుకుంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాల నుండి విముక్తి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులు మరిన్ని అవకాశాలు సాధిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు ఆస్తి లాభాలు. అనుకూల రంగులు……. గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు.. నీలం. హనుమాన్ ఛాలీసా పఠించండి

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: