Today rashi phahalu – 01 ఫిబ్రవరి 2023, బుధవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు.. ప్రయాణాలు వాయిదా. పనులలో అవరోధాలు. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు నిరుత్సాహం చెందుతారు. విద్యార్థులు శ్రమకోర్చవలసిన సమయం. మహిళలకు కుటుంబ సమస్యలు. అదృష్ట రంగులు…….నీలం, లేత గులాబీ. ప్రతికూల రంగు..తెలుపు.. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఆలోచనలు అమలు చేస్తారు. మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బాకీలు సైతం వసూలవుతాయి. భూములు, స్థలాలు కొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు వివాదాలు తీరతాయి. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. మహిళలు సంతోషకరమైన వార్తలు వింటారు. అదృష్ట రంగులు…….తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు…కాఫీ. ఆదిత్య హృదయం పఠించాలి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


కుటుంబ సభ్యులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆస్తి వివాదాలు నెలకొనవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. భార్యాభర్తల మధ్య అకారణంగా తగాదాలు.. రాబడి తగ్గుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు. మహిళలకు కుటుంబంలో చికాకులు. అదృష్ట రంగులు…….పసుపు, ఎరుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


అనుకోని విధంగా ధనలబ్ధి. ఉద్యోగయత్నాలలో పురోగతి. చిరకాల ప్రత్యర్థుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాల్లో నూతనోత్సాహం. ముఖ్యమైన పనులుసాఫీగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సంతృప్తికరమైన కాలం. ఉద్యోగులకు ఉన్నత స్థాయి నుంచి సహాయం. చిత్రపరిశ్రమవారు, క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులు కార్యసాధకులై ముందుకు సాగుతారు. మహిళలకు శుభ వర్తమానాలు. అదృష్ట రంగులు…….కాఫీ, బంగారు. ప్రతికూల రంగు…ఎరుపు. ఆంజనేయస్వామికి అర్చన చేయండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు.. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం మరింత పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఊహించని పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు శుభవార్తలు. విద్యార్థులకు విద్యావకాశాలు. మహిళలకు శుభవర్తమానాలు. అదృష్ట రంగులు…….ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు…పసుపు. దత్తాత్రేయుని పూజించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


శ్రమానంతరం పనులు పూర్తి చేస్తారు. మానసిక అశాంతికి లోనవుతారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో తగాదాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తప్పవు. వైద్యులు, సాంకేతిక నిపుణులకు వివాదాలు. విద్యార్థులకు గందరగోళం. మహిళలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. అదృష్ట రంగులు…….గోధుమ, పసుపు. ప్రతికూల రంగు….నీలం. గణపతిని పూజించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


దూర ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త సమస్యలు. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు మానసిక అశాంతి. అదృష్ట రంగులు……నీలం, నలుపు. ప్రతికూలరంగు..గులాబీ.. ఆంజనేయ దండకం పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సయోధ్య ఏర్పడవచ్చు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యతిరేకులు సైతం మిత్రులుగా మారతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. సాంకేతిక నిపుణులు, వైద్యులకు చిక్కులు వీడతాయి. విద్యార్థుల అంచనాలు నెరవేరతాయి. మహిళలకు ఆస్తిలాభం. అదృష్ట రంగులు…….గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…తెలుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


బంధువుల నుంచి ముఖ్య సమాచారం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు.. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. విద్యార్థులు ఉత్తమ విద్యావకాశాలు సాధిస్తారు. మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది. అదృష్ట రంగులు…….కాఫీ, పసుపు. ప్రతికూల రంగు..నేరేడు.. కనకధారా స్తోత్రం పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. సోదరులు, జీవిత భాగస్వామితో విభేదాలు.. కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో మార్పులు.. సాంకేతిక నిపుణులు, చిత్రపరిశ్రమ వారు నిరాశకు గురవుతారు. విద్యార్థులకు కొంత ఒత్తిడులు. మహిళలకు కుటుంబంలో సమస్యలు. అదృష్ట రంగులు…….ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు…కాఫీ. గణపతికి అర్చన చేయించుకోండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


వ్యవహారాలలో ఆటంకాలు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. బంధువుల నుంచి మాటపడాల్సివస్తుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు నెలకొంటాయి.. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులకు విధుల్లోకొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు సాధారణస్థితి. మహిళలు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. అదృష్ట రంగులు……నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు..ఎరుపు.. ఆదిత్య హృదయం పఠించాలి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


అందరిలోనూ గుర్తింపు రాగలదు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.. స్థలాలు, వాహనాలు కొంటారు. చిరకాల కోరిక నెరవేరుతుంది. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. వ్యాపార, వాణిజ్యవేత్తలు విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు సమస్యల నుండి విముక్తి.. విద్యార్థులు పట్టుదలతో ముందడుగు వేస్తారు. మహిళలకు కుటుంబంలో గౌరవం. అదృష్ట రంగులు…….ఆకుపచ్చ, ఎరుపు. ప్రతికూల రంగు…నీలం. శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: