Today rashi phahalu – 04 ఫిబ్రవరి 2023, శనివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనుకోని ఖర్చులతో సతమతమవుతారు. కార్యక్రమాలలో ఆటంకాలు మరింత చికాకు పరుస్తాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరుగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలతో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడుల్లో సమస్యలు. ఉద్యోగులకు వివాదాలు తప్పవు. చిత్రపరిశ్రమవారు, క్రీడాకారులకు నిరుత్సాహం. విద్యార్థులకు చికాకులు. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు. అనుకూల రంగులు…….ఎరుపు, గోధుమ. ప్రతికూల రంగు.. ఆకుపచ్చ. హనుమాన్ ఛాలీసా పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. అప్రయత్నంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. దేవాలయ దర్శనాలు. కుటుంబంలో మీ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నిరాశ తొలగుతుంది. ఉద్యోగాల్లో విధులు సక్రమంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు అనుకూలత. విద్యార్థులు సామాన్య అవకాశాలు సాధిస్తారు. మహిళలకు ఆస్తి వివాదాలు తొలగుతాయి. అనుకూల రంగులు… కాఫీ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. గణపతిని పూజించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


కార్యక్రమాలలో కొద్దిపాటి ఆటంకాలు. బంధుమిత్రులతో కొన్ని వివాదాలు. మీ ఆలోచనలు మిత్రులకు నచ్చకపోవచ్చు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులకు విధి నిర్వహణ సవాలుగా మారవచ్చు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు ఒత్తిడులు. విద్యార్థులు ఆచితూచి వ్యవహరించడం మంచిది. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు……. బంగారు, గులాబీ. ప్రతికూల రంగు…పసుపు. నరసింహ స్తోత్రాలు పఠించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. అందరిలోనూ పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. ఆదాయం సంతృప్తినిస్తుంది, దీర్ఘకాలిక రుణ బాధలు తీరతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు ఒక సంతోషకర సమాచారం అందుకుంటారు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు……. ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు…గులాబీ. కనకదుర్గాదేవిని పూజించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


కార్యక్రమాలలో అవాంతరాలు ఇబ్బంది కలిగిస్తాయి. తీర్థ యాత్రలు చేస్తారు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. దూరపు బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలు విస్తృతం చేస్తారు. ఉద్యోగస్తులకు పని భారం కొంత తగ్గవచ్చు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులు మరింత ఏకాగ్రతతో ముందుకు సాగాలి. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు. అనుకూల రంగులు……. కాఫీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు…నేరేడు. గణపతిని పూజించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కీలకమైన సమాచారం అందుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగుతాయి. కాంట్రాక్టులు ఊహించని విధంగా దక్కవచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు ఏ బాధ్యతనైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు శుభవర్తమానాలు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. మహిళలకు ఆస్తి లాభాలు ఉండవచ్చు. అనుకూల రంగులు……. బంగారు, గులాబీ. ప్రతికూల రంగు…నేరేడు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం. కుటుంబంలో శుభకార్యాల పై ఒక నిర్ణయానికి వస్తారు. ఆర్థిక పరిస్థితిని అనుకూలంగా మలచుకుంటారు. నూతన మిత్రులు పరిచయమవుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయలు నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మునుపటి కంటే అనుకూలిస్తాయి. ఉద్యోగులు విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలు, కృషి ఫలిస్తుంది. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. అనుకూల రంగులు……. ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

కుటుంబ సమస్యలతో కుస్తీపడతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురై సవాలుగా నిలుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు రావచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు స్వల్పంగా అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఒత్తిడులు. విద్యార్థులు నిదానం పాటించాలి. మహిళలకు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. అనుకూల రంగులు……. నీలం, నలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. అన్నపూర్ణాష్టకం పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


కార్యక్రమాలు కొంత నిదానంగా పూర్తి కాగలవు. సోదరులు, స్నేహితులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలతో సతమతమవుతారు. ఆదాయం అంతగా కనిపించదు. కాంట్రాక్టర్లకు కొన్ని చికాకులు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం మీదపడవచ్చు. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు ఆరోగ్య సమస్యలు. అనుకూల రంగులు……. తెలుపు, లేత నీలం. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. భార్యాభర్తల మనస్పర్థలు తీరతాయి. ఎంతటి వారినైనా అత్యంత చాకచక్యంగా ఆకట్టుకుంటారు. అనుకున్న రాబడి చేకూరుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులు విధి నిర్వహణలో సమస్యలు అధిగమిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు తగినంత లాభాలు ఆర్జిస్తారు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. విద్యార్థులు ఒక కీలక పరీక్షలో విజయం సాధిస్తారు. మహిళలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అనుకూల రంగులు……. గులాబీ, ఆకుపచ్చ. ప్రతికూలం రంగు… పసుపు. హనుమాన్ఛాలీసా పఠించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుకుంటాయి. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు సమకూరతాయి. కార్యజయం. రావలసిన బాకీలు కొంత మేర అందుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలతో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులు విదేశీ విద్యల్లో ప్రవేశాలు పొందుతారు. మహిళలకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది. అనుకూల రంగులు……. గులాబీ, కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయాలలో బంధువులతో వివాదాలు. భార్యాభర్తల మధ్య అకారణంగా తగాదాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తల లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు. విద్యార్థులకు తొందరపాటు నిర్ణయాలు వద్దు. మహిళలకు ఆరోగ్య సమస్యలు. అనుకూల రంగులు……. గులాబీ, నీలం. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. కాలభైరావాష్టకం పఠించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: