Today rashi phahalu – 05 ఫిబ్రవరి 2023, ఆదివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ప్రస్తుత పరిస్థితులు కొంత అనుకూలించి ముందుకు సాగుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు నెలకొంటాయి. కొన్ని విషయాలలో చర్చలు విఫలమవుతాయి. కాంట్రాక్టులు చేజారతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు అనుకోని మార్పులు. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు…… కాఫీ, పసుపు. ప్రతికూలం… నీలం నరసింహ స్తోత్రాలు పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

కొత్త పరిచయాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. అనుకూల రంగులు…… బంగారు, తెలుపు. ప్రతికూల రంగు… గోధుమ, గణేశ్కు అర్చనలు చేయండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటారు. బంధువులతో అకారణంగా తగాదాలు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. తీర్థ యాత్రలు చేస్తారు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు. విద్యార్థులకు నిరాశానిస్పృహలు తప్పవు. మహిళలకు ఆరోగ్య భంగం. అనుకూల రంగులు…… ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు… కాఫీ కాలభైరవాష్టకం పఠించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బేరీజు వేసుకుని ముందుకు సాగుతారు. వ్యవహారాలలో అనూహ్యమైన విజయం. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటుంది. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో విభేదాలు తొలగుతాయి. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి. వ్యాపార లావాదేవీలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విజయాలు వరిస్తాయి. మహిళలకు పట్టిందిబంగారమే. అనుకూల రంగులు…… గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు… తెలుపు, శ్రీ రాజరాజేశ్వరీ స్తోత్రాలు పఠించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. బంధువుల నుంచి విమర్శలు. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తారు. ప్రస్తుత పరిస్థితులకు భయపడి కొన్ని వ్యవహారాలలో వెనుకడుగు వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. దూర ప్రయాణాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. రాజకీయ, కళారంగాల వారి యత్నాలు కొంత సానుకూలం. మహిళలకు కుటుంబ సమస్యలు తప్పవు. అనుకూల రంగులు…… ఆకుపచ్చ,తెలుపు. ప్రతికూల రంగు… గోధుమ, హనుమాన్ పూజలు మంచిది.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


ఒక సమస్య పరిష్కారమై ఊరట చెందుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. పరిస్థితులు కొంత ఇబ్బందిగా ఉన్నా రావలసిన బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కాంట్రాక్టర్లకు ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రాజకీయ,పారిశ్రామికరంగాల వారికి నూతనోత్సాహం. మహిళలు శుభకార్యాలలో పాల్గొంటారు. అనుకూల రంగులు…… గోధుమ, గులాబీ. ప్రతికూల రంగు… బంగారు, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


నూతన ఉద్యోగ యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. పారిశ్రామికవేత్తలకు చిక్కులు తొలగుతాయి. విద్యార్థులు ఉన్నత సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు సంతోషకరమైన సమాచారం. అనుకూల రంగులు…… తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు… కాఫీ హనుమాన్ఛాలీసా పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఆదాయానికి మించి ఖర్చులు. శ్రమాధిక్యం తప్పదు. పనుల్లో తొందరపాటు. ఉద్యోగయత్నాలు ముందుకుసాగవు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. శారీరక రుగ్మతలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయ,వైద్యరంగాల వారికి ఒడిదుడుకులు. మహిళలకు మానసిక ఒత్తిడులు. అనుకూల రంగులు…… ఆకుపచ్చ,బంగారు. ప్రతికూల రంగు… తెలుపు, దత్త స్తోత్రాలు పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


ప్రస్తుత పరిస్థితులు కాస్త చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం తగ్గి నిరాశ కలిగిస్తుంది. బంధువులతో తగాదాలు. ఎంతకష్టించినా ఫలితం కనిపించదు. ఇంటి నిర్మాణాలు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు కొంత నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగులకు ఊహించని బదిలీలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఒడుదొడుకులు తప్పవు. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు…… కాఫీ, పసుపు. ప్రతికూల రంగు… నీలం. ఆదిత్య హృదయం పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. భార్యాభర్తల మనస్పర్థలు తీరతాయి. ఎంతటి వారినైనా అత్యంత చాకచక్యంగా ఆకట్టుకుంటారు. అనుకున్న రాబడి చేకూరుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులు విధి నిర్వహణలో సమస్యలు అధిగమిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు తగినంత లాభాలు ఆర్జిస్తారు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. విద్యార్థులు ఒక కీలక పరీక్షలో విజయం సాధిస్తారు. మహిళలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అనుకూల రంగులు……. గులాబీ, ఆకుపచ్చ. ప్రతికూలం రంగు… పసుపు. హనుమాన్ఛాలీసా పఠించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుకుంటాయి. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు సమకూరతాయి. కార్యజయం. రావలసిన బాకీలు కొంత మేర అందుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలతో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులు విదేశీ విద్యల్లో ప్రవేశాలు పొందుతారు. మహిళలకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది. అనుకూల రంగులు……. గులాబీ, కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయాలలో బంధువులతో వివాదాలు. భార్యాభర్తల మధ్య అకారణంగా తగాదాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తల లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు. విద్యార్థులకు తొందరపాటు నిర్ణయాలు వద్దు. మహిళలకు ఆరోగ్య సమస్యలు. అనుకూల రంగులు……. గులాబీ, నీలం. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. కాలభైరావాష్టకం పఠించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: