Today rashi phahalu – 06 ఫిబ్రవరి 2023, సోమవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
కీలక వ్యవహారాల్లో అవాంతరాలు. రాబడికి మించి ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు. వివాదాలకు మరింత దూరంగా ఉండండి. ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. పట్టుదల, నేర్పుతో క్లిష్ట సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడుల్లో నిరాశ. ఉద్యోగాల్లో ఒత్తిడులు ఎదురై ఇబ్బందిపడతారు. విద్యార్థులకు కొత్త ఇబ్బందులు. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు……. తెలుపు, ఎరుపు. గణపతిని పూజించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కొత్త కార్యక్రమాలను చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.. ప్రముఖులతో కొన్ని సమావేశాల్లో పాల్గొంటారు. ఆదాయం మీ ఊహలకు తగినంతగా ఉంటుంది. ఎదుటవారి నుండి రావలసిన సొమ్ము కూడా అందుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు మరింతగా లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు అవార్డులు దక్కే ఛాన్స్. విద్యార్థులు మరిన్ని విజయాలు పొందుతారు. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు……. గులాబీ, తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
కుటుంబంలో చికాకులు. ఆదాయం నామమాత్రంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అకారణంగా విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలతో సతమతమవుతారు. ఆరోగ్యం సహకరించక కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల నిర్వహణలో నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు పనిఒత్తిడులు, బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కొంత నిరాశగా గడుపుతారు. విద్యార్థులకు శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. మహిళలు నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, ఎరుపు. ప్రతికూల రంగు…నేరేడు. సుబ్రహ్మణ్యేశ్వరుని స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో ఇబ్బందులు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సంస్థల నిర్వహణ తేలికపడుతుంది. ఉద్యోగులు ఉత్సాహంగా బాధ్యతలు నిర్వహిస్తారు. చిత్రపరిశ్రమవారు, క్రీడాకారులకు గందరగోళం తొలగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు. మహిళలకు కుటుంబంలో గౌరవం. అనుకూల రంగులు……. గులాబీ, పసుపు. ప్రతికూల రంగు…తెలుపు. వేంకటేశ్వరస్వామిని పూజించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
రుణ దాతలు మరింత ఒత్తిడులు పెంచుతారు. భార్యాభర్తల మధ్య అపార్ధాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కార్యక్రమాలలో అవాంతరాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొన్ని ఇబ్బందులు. ఉద్యోగాల్లో మార్పులు రావచ్చు. క్రీడాకారులు, చిత్రపరిశ్రమ వారు కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……. పసుపు, గులాబీ. ప్రతికూల రంగు…నేరేడు. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఆలోచనలు ఎట్టకేలకు అమలు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి ఆశలు నెరవేరతాయి. విద్యార్థులకు సంతోషంగా గడుస్తుంది. మహిళలకు శుభ వర్తమానాలు. అనుకూల రంగులు……. పసుపు, గులాబీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
సమాజ సేవలో భాగస్వాములవుతారు. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కార్యక్రమాలు మీ అంచనాల మేరకు పూర్తి చేస్తారు. వ్యతిరేకులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలను పెంచుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ ఆశాజనకంగా ఉంటుంది. క్రీడాకారులు, పారిశ్రామివేత్తలకు గందరగోళం నుండి విముక్తి. విద్యార్థులు ప్రతిభను నిరూపించుకుంటారు. మహిళలకు ఆస్తిలాభాలు. అనుకూల రంగులు……. నలుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…పసుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆదాయం తగినంత లేక అప్పులు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త సమస్యలు. ఉద్యోగులకు విధులు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. సాంకేతిక నిపుణులు, చిత్రపరిశ్రమ వారికి వివాదాలు ఏర్పడవచ్చు. విద్యార్థులు అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. అనుకూల రంగులు……. ఎరుపు, గోధుమ. ప్రతికూల రంగు…పసుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. పరిస్థితులు అనుకూలించక అయోమయంలో పడతారు. కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. రాబడి సామాన్యంగా ఉంటుంది. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించవచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఒత్తిడులు. ఉద్యోగులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థుల యత్నాలు నత్తనడకన సాగుతాయి. మహిళలకు చికాకులు తప్పవు. అనుకూల రంగులు……. గులాబీ, తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
కొత్త కార్యక్రమాలను సమయానికి పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. రాబడి మరింత పెరిగి అవసరాలు తీరతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టుబడుల్లో ముందుంటారు. ఉద్యోగాల్లో పైస్థాయి వారి ప్రోత్సాహంతో ముందుకు సాగుతారు. విద్యార్థులు అంచనాలు నిజం చేసుకుంటారు. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, కాఫీ. ప్రతికూల రంగు…ఎరుపు. గణేశాష్టకం పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలను మీకు అనుకూలంగా మలచుకుంటారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగుల యత్నాలు సఫలం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కార్యసిద్ధి. విద్యార్థులు ప్రతిభను మరింత చాటుకుంటారు. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు……. గులాబీ, లేత ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
కార్యక్రమాలు కొంత నిదానిస్తాయి. భార్యాభర్తల మధ్య అపార్ధాలు దూరప్రయాణాలు సంభవం. ధార్మిక కేంద్రాలు సందర్శిస్తారు. మీ పట్టుదల చూసి బంధువులు ఆశ్చరపడతారు. సేవాభావంతో పలు కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొద్దిపాటి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పనిఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. మహిళలు మరింత నిదానంగా వ్యవహరించాలి. అనుకూల రంగులు……. ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com