Today rashi phalalu – 09 ఫిబ్రవరి 2023, గురువారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
కొత్త పనులు చేపడతారు. మీ ఆలోచనలు కలసివస్తాయి. సోదరులు, స్నేహితులతో వివాదాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు తగిన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాల్లో చిక్కులు, చికాకులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు అభివృద్ధిపథంలో పయనిస్తారు. విద్యార్థులు అంచనాలు నిజమై ఊరట చెందుతారు. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు…… తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు..నేరేడు. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కార్యక్రమాలు అనుకున్న రీతిలో ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి విమర్శలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు జరిగే వీలుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులు అనుకున్న అవకాశాలను చేజార్చుకుంటారు. మహిళలకు నిరుత్సాహం. అనుకూల రంగులు…… తెలుపు, గోధుమ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. నరసింహ స్తోత్రాలు పఠించాలి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలు వాయిదా. కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురై ఇబ్బందిపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులపై సందిగ్ధత. ఉద్యోగులకు విధి నిర్వహణ పై కొంత ఆందోళన. పారిశ్రామిక, రాజకీయవేత్తలు నిరుత్సాహానికి లోనవుతారు. విద్యార్థులు అవకాశాల ఎంపికలో నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు…… గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు..తెలుపు.. వేంకటేశ్వర స్వామిని పూజించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. విందువినోదాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ద్వారా సాయం అందుతుంది.. పారిశ్రామికవేత్తలు, వైద్యుల సేవలు గుర్తింపు పొందుతాయి. విద్యార్థులు స్వయంకృషితో పైమెట్టుకు చేరుకుంటారు. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు…… ఎరుపు, గోధుమ. ప్రతికూల రంగు…నీలం. గణపతి పూజ చేయించుకోండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
కార్యక్రమాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు తప్పవు. బంధువుల నుంచి అపవాదులు. అంచనాలు తప్పి నిరాశ కలిగిస్తాయి. కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. రాబడి తగ్గి నిరాశ కలిగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సామాన్యస్థితి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు శ్రమాధిక్యం. విద్యార్థులు మరింత సహనంతో మెలగాలి. మహిళలకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అనుకూల రంగులు…… పసుపు, కాఫీ. ప్రతికూల రంగు…ఎరుపు. హనుమాన్ పూజలు మంచిది.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటిలో సంతోషదాయకంగా గడుపుతారు. ఆప్తుల నుంచి ధనలాభ సూచనలు. గృహ, వాహన యోగాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలను విస్తృతం చేస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో గందరగోళం తొలగుతుంది. క్రీడాకారులు, చిత్ర పరిశ్రమ వారి ఆశలు ఫలిస్తాయి. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. మహిళలకు కుటుంబసభ్యుల ప్రోత్సాహం. అనుకూల రంగులు…… ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…కాఫీ. శివాలయంలో పూజాదికాలు నిర్వహించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కార్యక్రమాలు కొంత మందకొడిగా సాగుతాయి. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబంలో ఒత్తిడులు, సమస్యలు ఎదురుకావచ్చు. బంధువులు,మిత్రులతో తగాదాలు.. తీర్థ యాత్రలు చేస్తారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి. వ్యాపార, వాణిజ్యవేత్తలు క్రమపద్దతిలో ముందుకు సాగితే మేలు. ఉద్యోగాల్లో కొత్త వివాదాలు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలలో విఘాతం. విద్యార్థులకు అందిన అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు మనశ్శాంతి లోపం. అనుకూల రంగులు…… కాఫీ, బంగారు. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. ఆంజనేయ దండకం పఠించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
శుభకార్యాలు నిర్వహణ. తద్వారా ఖర్చులు. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు విధులు తేలికపడతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు హుషారుగా గడుస్తుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు…… ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు…గులాబీ. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. విలువైన సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబడి ఆశించినంతగా లభిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు హుషారుగా లావాదేవీలు నిర్వహించి లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాల్లో అనుకున్న విధంగా బాధ్యతలు చక్కదిద్దుతారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ప్రతిభ నిరూపించుకుండారు. విద్యార్థులు సాంకేతికపరమైన అవకాశాలు సాధిస్తారు. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకూల రంగులు…… ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు…పసుపు. శ్రీ విష్ణుమూర్తిని పూజించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
కార్యక్రమాలు కొన్ని ముందుకు సాగవు. సన్నిహితులతో ముఖ్య విషయాల పై చర్చలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఆలయాలు సందర్శిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు.. నిరుద్యోగులు ఎంత ప్రయత్నించినా అనుకున్నది సాధించడంలో విఫలం చెందుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు కాస్త నెమ్మదిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు చిన్నపాటి సమస్యలు రావచ్చు. విద్యార్థులు ఓపికతో వ్యవహరిస్తే విజయం సాధిస్తారు. మహిళలకు కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకూల రంగులు…… కాఫీ, గోధుమ. ప్రతికూల రంగు..ఆకుపచ్చ.. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి..
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
కుటుంబ సభ్యులతో తగాదాలు. కార్యక్రమాలను హఠాత్తుగా విరమిస్తారు. కొన్ని వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులు, ఆప్తులతో లేనిపోని వివాదాలు. పుణ్య క్షేత్రాల సందర్శనం. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఒత్తిడులతోనే గడుపుతారు. ఉద్యోగులకు పనిభారం మరింత మీదపడుతుంది. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు నిరాశాజనకంగా ఉండవచ్చు. విద్యార్థులు అందిన అవకాశాలు సంతృప్తినీయవు. మహిళలకు గందరగోళం. అనుకూల రంగులు…… కాఫీ, బంగారు. ప్రతికూల రంగు..నేరేడు.. గణపతిని పూజించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యతిరేకులు కూడా సహాయపడతారు. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. భార్యాభర్తలు మనస్పర్థలు సర్దుబాటు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలను సరైన పంథాలో సాగిస్తారు. ఉద్యోగాల్లో విధులను సజావుగా పూర్తి చేస్తారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు సమస్యల నుండి గట్టెక్కుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. అనుకూల రంగులు…… తెలుపు, పసుపు. ప్రతికూల రంగు..నీలం.. హనుమాన్ చాలీసా పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com