Today rashi phalalu – 10 ఫిబ్రవరి 2023, శుక్రవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు పోటీపరీక్షల్లో విజయం. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. నూతన వస్తు, వస్త్రలాభాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టుబడుల పై కొంత సందిగ్ధంలో పడతారు. ఉద్యోగాల్లో సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు వ్యవహారాలలో విజయం పొందుతారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు…… ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు…తెలుపు. గణపతి పూజలు మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
రుణ యత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు ఉండవచ్చు. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త వద్దు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చిక్కులు. ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలు నిరాశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు. మహిళలు ఒత్తిడులు ఎదుర్కొంటారు. అనుకూల రంగులు…… తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు…నేరేడు. గణపతిని పూజించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
స్నేహితులతో కొన్ని వివాదాలు రావచ్చు. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయడం మంచిది. రాబడి తగ్గి నిరాశ కలిగించవచ్చు. ఒక సమాచారం కొంత ఆందోళన కలిగిస్తుంది. దూరప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగప్రయత్నాలు ముందుకు సాగవు. కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులు కొంత శ్రమ పడాలి. మహిళలు పట్టుదల వీడకుండా ముందడుగు వేయాలి. అనుకూల రంగులు…… ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు…నీలం. దత్తాత్రేయుని పూజించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ప్రముఖులతో పరిచయాలు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు, ధనలాభాలు. స్థలాలు, వాహనాలు సమకూరే సమయం. శత్రువులు కూడా మీపట్ల విధేయత ప్రకటిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు స్వీయానుభవాలతో సంస్థలను నడిపిస్తారు. ఉద్యోగాల్లో చికాకులు తొలగి ఉత్సాహంగా సాగుతారు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు మరింత ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు. మహిళలకు ఆస్తులు కొన్ని లభించే సూచనలు. అనుకూల రంగులు…… నీలం, పసుపు. ప్రతికూల రంగు… తెలుపు. హనుమాన్చాలీసా పఠించాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
కార్యక్రమాలలో అవాంతరాలు. రాబడిపై ఆందోళన చెందుతారు. ప్రయాణాలలో స్వల్ప ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. కొన్ని కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడుల్లో గందరగోళం. ఉద్యోగులకు అదనపు బా«ధ్యతలు. క్రీడాకారులు, చిత్రపరిశ్రమ వారు మరింత నిదానంతో నిర్ణయాలు తీసుకుంటే మేలు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కొన్ని పర్యటనలు వాయిదా పడవచ్చు. విద్యార్థులు అవకాశాలు దూరం కావచ్చు. మహిళలకు అనారోగ్య సూచనలు. అనుకూల రంగులు…… ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు.. పసుపు. శివ స్తోత్రాలు పఠించాలి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
నూతన కార్యక్రమాలను ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు. ఇంత కాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు శుభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు కీలక బాధ్యతలు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులు స్వయంకృషినే నమ్ముకుని విజయం సాధిస్తారు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. అనుకూల రంగులు…… ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు…గులాబీ. నరసింహస్వామిని పూజించాలి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. బంధువులు కొన్ని వ్యవహారాలలో ఒత్తిడులు పెంచవచ్చు. ఆరోగ్యం పై తగినంత శ్రద్ధ వహించండి. ఇంటాబయటా వివాదాలు ఎదురవుతాయి. రాబడి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సంస్థల్లో నిరాశ. ఉద్యోగులు పనిఒత్తిడులతో సతమతం కాగలరు. క్రీడాకారులు, వైద్యులకు కొన్ని అంచనాలలో పొరపాట్లు. విద్యార్థులు కొత్త అవకాశాలు అంతగా కనిపించవు. మహిళలకు కుటుంబసభ్యుల నుండి మాటపడతారు. అనుకూల రంగులు…… నీలం, పసుపు. ప్రతికూల రంగు…గులాబీ. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు రాగలవు. అనుకోని సంఘటనలు. తీర్థయాత్రలు చేస్తారు. అంచనాలు నిజమయ్యే సమయం. పరిస్థితులను మీకు అనుగుణంగా మలచుకుంటారు. అదనపు ఆదాయం దక్కి అవసరాలు తీరతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థలను మరింత ముందుకు నడిపిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహం పెరుగుతుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు సమస్యలు తీరతాయి. విద్యార్థుల దీర్ఘకాలిక స్వప్నం నెరవేరుతుంది. మహిళలకు కుటుంబంలో మరింత గౌరవం. అనుకూల రంగులు…… ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు..నీలం.. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా ముగిస్తారు. అతి ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. రావలసిన బాకీలు వసూలై ఒడ్డునపడతారు. ఉద్యోగ, వివాహయత్నాలలో మరింత పురోగతి. కొన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సంతోషకర సమాచారం. ఉద్యోగస్తులకు విధులు ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు క్లిష్ట సమస్యలు అధిగమిస్తారు. విద్యార్థులు లక్ష్యాల సాధనలో ముందంజ వేస్తారు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. అనుకూల రంగులు…… ఎరుపు, గులాబీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. ఆంజనేయ దండకం పఠించాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. కార్యక్రమాలలో ఆటంకాలు. పుణ్య క్షేత్రాల సందర్శనం. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల నిర్వహణలో కొంత వెనుకడుగు వేస్తారు. ఉద్యోగాల్లో కొత్త చిక్కులు. రాజకీయవేత్తలు, వైద్యులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకున్న అవకాశాలలో ప్రతిబంధకాలు. మహిళలకు నిరుత్సాహం తప్పదు. అనుకూల రంగులు…… గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…నేరేడు. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యంపై శ్రద్ధతో ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. బంధువర్గంతో విరోధాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆశించిన లాభాలు కష్ట సాధ్యమే. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు కష్టానికి ఫలితం అందుకోలేరు. విద్యార్థుల ప్రయత్నాలు నిదానిస్తాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం. అనుకూల రంగులు…… కాఫీ, ఎరుపు. ప్రతికూల రంగు…నీలం. హనుమాన్ చాలీసా పఠించాలి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
దూర ప్రాంతాల నుంచి శుభ వర్తమానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకున్నది సా«ధించాలన్న తపనతో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. సేవాకార్యక్రమాల పై దృష్టి సారిస్తారు. వివాహ యత్నాలలో ముందడుగు వేస్తారు. ఇంటి స్థలాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట లభిస్తుంది. రాజకీయవేత్తలు, వైద్యులకు తగినంత గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల యత్నాలు కొలిక్కి వస్తాయి. మహిళలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు. అనుకూల రంగులు……గోధుమ. పసుపు. ప్రతికూల రంగు…తెలుపు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com