Today rashi phalalu – 11 ఫిబ్రవరి 2023, శనివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


కొత్త కార్యక్రమాలు ప్రారంభం పై ఒక నిర్ణయానికి వస్తారు. ఆదాయానికి ఇంతవరకు ఎదురైన ఇబ్బందులు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. సన్నిహితుల నుంచి మాట సహాయం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం కలుగుతుంది. కుటుంబ విషయాలపై మరింత శ్రద్ధ వహిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తల విస్తరణ యత్నాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు పట్టుదలతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. మహిళలకు ధన లాభ సూచనలు. అనుకూల రంగులు…… గులాబీ, నలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. దత్తాత్రేయ పూజలు మంచిది.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పై ఆసక్తి. కొత్త పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. రాబడి మరింత పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగులకు ఊహించని విధంగా మార్పులు సంభవం. క్రీడాకారులు, వైద్యులకు ముఖ్య సమాచారం రాగలదు. విద్యార్థులు మేథస్సును నిరూపించుకుంటారు. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. అనుకూల రంగులు…… పసుపు, కాఫీ. ప్రతికూల రంగు… నలుపు. ఆదిత్య హృదయం పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


దీర్ఘకాలిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆదాయం కంటే ఖర్చులతో సతమతమవుతారు. కొన్ని కార్యక్రమాలలో అవాంతరాలు. ఆరోగ్యం సహకరించక ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శనం. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఓపికతో వ్యవహరించడం ఉత్తమం. ఉద్యోగులకు వివాదాలు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు సమస్యలు ఎదురుకావచ్చు. విద్యార్థులు అవకాశాలపై అంతగా ఆసక్తి చూపరు. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు…… గులాబీ, కాఫీ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


అనుకోని ప్రయాణాలతో ఇబ్బందిపడతారు. ఖర్చులు భారీగా పెరుగుతాయి. మరోవైపు అప్పుల కోసం యత్నాలు. కొన్ని కార్యక్రమాలు శ్రమ పడ్డా పూర్తి కాని పరిస్థితి.. ఆరోగ్య సమస్యలు, మానసిక అశాంతి. బంధుమిత్రుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల వీడవద్దు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలపై నిరుత్సాహం. ఉద్యోగులు మరిన్ని బాధ్యతలు చేపడతారు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులు తొందరపాటు నిర్ణయాలతో నష్టపోతారు. విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు. మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. అనుకూల రంగులు…… ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు…నీలం. నరసింహ స్తోత్రాలు పఠించాలి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


బంధువుల ద్వారా శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకునే యత్నాలు సఫలం. ఆత్మీయులతో మీ అభిప్రాయాలను పంచుకుంటారు. యుక్తిగా వ్యవహరించి వ్యతిరేకుల అంచనాలు గ్రహించండి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు ముందుకు సాగుతారు. ఉద్యోగులకు వివాదాలు తీరే సమయం. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు తమ కలలను నిజం చేసుకుంటారు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. మహిళలకు సంతోషకరమైన సమాచారం. అనుకూల రంగులు…… బంగారు, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. ఆంజనేయ దండకం పఠించాలి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటిలో వివాదాలు పెరుగుతాయి. మంచిగా మాట్లాడినా ఇతరులకు అది నచ్చక మీ పై విమర్శలు చేస్తారు. ఆదాయం అంతగా ఉండదు. కోపతాపాలకు దూరంగా మెలగండి. కొన్ని వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు. ఆరోగ్య నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు. ఉద్యోగులు బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి. రాజకీయవేత్తలు, క్రీడాకారులు కొన్ని నిర్ణయాలపై తొందరపడరాదు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావచ్చు. అనుకూల రంగులు…… లేత నీలం, పసుపు. ప్రతికూల రంగు..ఎరుపు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


కార్యక్రమాలను విజయవంతంగా సాగిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు ఎటువంటి ఆటంకాలు లేకుండా అమలు చేస్తారు. ఆదాయం పై ఆందోళన తొలగుతుంది. ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు నూతనోత్సాహం. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాబడతారు. మహిళలకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. అనుకూల రంగులు…… ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

కొన్ని వ్యవహారాలు మరింత నిదానిస్తాయి. వ్యూహప్రతివ్యూహాలలో నిమగ్నమవుతారు. ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో స్వల్ప విభేదాలు. ఆదాయం కొంత తగ్గి నిరాశ కలిగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చిక్కులు తప్పకపోవచ్చు. ఉద్యోగులు కొంత నిరాశాజనకంగా గడుపుతారు. రాజకీయవేత్తలు, వైద్యులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు కొన్ని అవకాశాలు అసంతృప్తి కలిగిస్తాయి. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు…… గులాబీ, ఎరుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. దత్తాత్రేయున్ని పూజించాలి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. రాబడి పై అంచనాలు నిజం కాగలవు. బంధువుల నుండి ఆశించిన సాయం అందుతుంది. నైపుణ్యతను చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు తథ్యం. ఉద్యోగులు విధులను సజావుగా పూర్తి చేస్తారు. రాజకీయవేత్తలు, వైద్యుల సేవలు విస్తృతం కాగలవు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. అనుకూల రంగులు…… గులాబీ, పసుపు. ప్రతికూల రంగు…నేరేడు. గణపతిని ఆరాధించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. సన్నిహితులతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. శుభవార్తలు వింటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరాలకు సొమ్ము అంది ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాల్లో చిక్కులు తొలగి ముందడుగు వేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తల లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు నూతన అవకాశాలు. విద్యార్థులు అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. అనుకూలం… ఎరుపు, గోధుమ.ప్రతికూలం…పసుపు. శివ స్తోత్రాలు పఠించాలి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


దూర ప్రయాణాలు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. కష్టపడినా ఆశించిన ఫలితం కనిపించదు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.. కార్యక్రమాలు కొన్ని ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సమస్యలు అధికమవువుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు, సమస్యలు రావచ్చు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు కాస్త ఇబ్బందికర పరిస్థితి. విద్యార్థులు కొంత ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పవు. అనుకూల రంగులు…… గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. హనుమాన్చాలీసా పఠించాలి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ఆర్థిక ఇబ్బందులు తప్పవు. రుణ యత్నాలు సాగిస్తారు. దూర ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. చేపట్టిన కార్యక్రమాలలో మరింత జాప్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లేనిపోని సమస్యలు మీదపడతాయి. ఉద్యోగులు ఓపిగ్గా వ్యవహరించాలి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. విద్యార్థులు అవకాశాలపై నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు…… నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నలుపు. ఆంజనేయ దండకం పఠించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: