Today rashi phalalu – 12 ఫిబ్రవరి 2023, ఆదివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఊహించని సహాయం. సంఘంలో ప్రత్యేకత చాటుకుంటారు. వాహనాలు,ఆభరణాలు కొంటారు. కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టర్లకు అంచనాలు కొన్ని తప్పుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాల వేటలో విజయం సాధిస్తారు. ఉద్యోగాల్లో విధులు మరింత తేలిక పడతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలలో పురోగతి. విద్యార్థులకు అన్నింటా విజయమే. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. అనుకూల రంగులు…ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు..నేరేడు. ఆదిత్య హృదయం పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కొంతకాలంగా రావలసిన సొమ్ము అంది అవసరాలకు ఆదుకుంటుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొత్త అంచనాలతో లావాదేవీలు నడిపిస్తారు. ఉద్యోగాల్లో ఎటువంటి సమస్యనైనా అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు చిక్కులు తొలగుతాయి. విద్యార్థులు కొత్త అవకాశాలతో సంతోషంగా గడుపుతారు. మహిళలకు సంతోషకరమైన సమాచారం. అనుకూల రంగులు…… పసుపు,గులాబీ. ప్రతికూలరంగు…నేరేడు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
కుటుంబ సభ్యులతో లేనిపోని విరోధాలు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆస్తుల విషయంలో సోదరులతో తగాదాలు. రాబడి కంటే ఖర్చులు అధికం. వ్యాపార, వాణిజ్యవేత్తలు శ్రమకు తగిన ఫలితం అందులేరు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు నిరుత్సాహం. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు మానసిక సమస్యలు. అనుకూల రంగులు…… కాఫీ, పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. శివస్తుతి మంచిది.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. కొన్ని రుణయత్నాలు కూడా ఫలించవు. భూ వివాదాలు నెలకొంటాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు విషయంలో సందిగ్ధత. దూర ప్రయాణాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించడం వంచిది. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఇబ్బందికర పరిస్థితి. విద్యార్థులు అవకాశాలు చేజారి నిరుత్సాహం చెందుతారు. మహిళలకు అనారోగ్యం. అనుకూల రంగులు…… గులాబీ, బంగారు. ప్రతికూల రంగు…నేరేడు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక రావనుకున్న బాకీలు వసూలవుతాయి. ఎంతటి వారినైనా మీదారికి తెచ్చుకోవడంలో సఫలమవుతారు. గృహ నిర్మాణయత్నాలు సాగిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలను పకడ్బందీగా నిర్వహిస్తారు. ఉద్యోగులు కష్టపడ్డా ఫలితం కనిపిస్తుంది. క్రీడాకారులు, వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు కొత్త అవకాశాలు పొందుతారు. మహిళలకు ఆస్తి లాభం కలుగుతుంది. అనుకూల రంగులు…… తెలుపు, ఎరుపు. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
కుటుంబ సభ్యుల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మానసిక అశాంతి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. జ్వరం, జలుబు వంటి రుగ్మతలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థులు అవకాశాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు నిరాశే. అనుకూల రంగులు…… నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…పసుపు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
భూవివాదాల పై చర్చలు సఫలం. కుటుంబంలో శుభకార్యాలు, ఇతర వేడుకలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకుంటారు. పాత మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆభరణాలు, స్థలాలు కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు విశేష లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు విధులు సజావుగా సాగుతాయి. చిత్ర పరిశ్రమ వారు, వైద్యులు ఒత్తిడులు అధిగమిస్తారు. విద్యార్థులు విదేశీ విద్యలపై దృష్టి సారిస్తారు. మహిళలకు ఆస్తి విషయంలో చిక్కులు అధిగమిస్తారు. అనుకూల రంగులు…… గులాబీ, లేత ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
కుటుంబ సభ్యులతో కలహాలు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. రాబడి నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సమస్యలు వెంటాడతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు గందరగోళంలోపడతారు. విద్యార్థులు అవకాశాలను సైతం వినియోగించుకోలేరు. మహిళలకు ఆరోగ్య భంగం. అనుకూల రంగులు…… నీలం, పసుపు. ప్రతికూల రంగు…గులాబీ. గణేశాష్టకం పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
నూతన ఉద్యోగాలు చేజిక్కించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సోదరులు, స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనాలు,ఆభరణాలు కొంటారు. మీకు వ్యతిరేకంగా ఉన్న వారు కూడా సానుకూల వైఖరి అనుసరిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థలను సజావుగా నడిపిస్తారు. ఉద్యోగాల్లో కొత్త విధులు చేపడతారు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. విద్యార్థులకు సాంకేతికపరమైన విద్యావకాశాలు. మహిళలు శుభవార్తలు వింటారు. అనుకూల రంగులు…… ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు…పసుపు. నరసింహస్వామిని పూజించాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. అంచనాలు కొన్ని నిజం కాగల సమయం. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొన్ని చికాకుల నుండి గట్టెక్కుతారు. ఉద్యోగులకు విధి నిర్వహణ సాఫీగా సాగిపోతుంది. క్రీడాకారులు, వైద్యులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు తమలోని ప్రతిభను చాటుకుంటారు. మహిళలకు ఆస్తిలాభాలు. అనుకూల రంగులు…… నీలం. తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. కాలభైరవాష్టకం పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయానికి మించి ఖర్చులు ఎదురవుతాయి. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులు, స్నేహితులతో విభేదాలు. ఆరోగ్యం పై కొంత శ్రద్ధ అవసరం. ఉద్యోగ ప్రయత్నాలు అతి నెమ్మదిగా సాగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభనష్టాలు సమానంగా భరించాల్సివస్తుంది. ఉద్యోగులు విధుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. క్రీడాకారులు, పరిశోధకులకు కొత్త చిక్కులు. విద్యార్థులు అవకాశాలపై నిరుత్సాహపడతారు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. అనుకూల రంగులు…… ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…పసుపు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
కార్యక్రమాలను పూర్తి చేయడంలో అవరోధాలు. భూవివాదాలు చికాకు పరుస్తాయి. ఒక సమాచారం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. సోదరులతో విభేదిస్తారు. ఆదాయంపై కలత చెందుతారు. ఉద్యోగాల్లో విధులు నిర్వర్తించలేని పరిస్థితి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలపై అంతగా సంతృప్తి చెందరు. క్రీడాకారులు, వైద్యులకు విదేశీ పర్యటనలు రద్దు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం తప్పదు. మహిళలకు చికాకుల మధ్యే గడుపుతారు. అనుకూల రంగులు… పచ్చ, కాఫీ. ప్రతికూల రంగు… ఎరుపు. శివ స్తోత్రాలు పఠించాలి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com