Today rashi phalalu – 15 ఫిబ్రవరి 2023, బుధవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఇంటాబయటా వ్యతిరేకత, సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబసభ్యులతో విభేదాలు. రాబడి అనుకున్నంత లేక దిగాలు చెందుతారు. ప్రయాణాల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాల కోసం మరింత శ్రమపడాలి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అవకాశాలు చేజారతాయి. విద్యార్థుల అంచనాలు తప్పవచ్చు. మహిళలకు కుటుంబసమస్యలు. అనుకూల రంగులు…….. ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. ఆదిత్య హృదయం పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు రావలసిన బకాయిలు అందుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు తగినంతగా లాభాలు గడిస్తారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు చేస్తారు. విద్యార్థులు అనుకోని అవకాశాలతో ఉబ్బితబ్బిబ్బవుతారు. మహిళలకు శుభవర్తమానాలు రాగలవు. అనుకూల రంగులు…….. బంగారు, గులాబీ. ప్రతికూల రంగు…తెలుపు. శివాష్టకం పఠించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఖర్చులను తగ్గించుకుని ఆదాయం పెంచుకుంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు రాగలవు. పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఎంతటి పని చేపట్టినా వేగవంతంగా పూర్తి చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు భాగస్వాముల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగులు విధులను చాకచక్యంగా పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి ప్రోత్సాహకరమైన కాలమనే చెప్పాలి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు విశేష గౌరవం దక్కుతుంది. అనుకూల రంగులు…….. ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు…ఎరుపు. శ్రీ గణేశ్ స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
రుణ యత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు రదు ్దచేసుకుంటారు. ఆరోగ్యం పై నిర్లక్ష్యం వద్దు. భూవివాదాలు నెలకొంటాయి. సోదరులతో విభేదాలు ఉంటాయి. ఉద్యోగులకు విధులు కత్తిమీద సాముగా నిలుస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చిక్కులు ఎదురవుతాయి. పారిశ్రామిక,రాజకీయవేత్తలు కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థుల ప్రయత్నాలు ముందుకు సాగవు. మహిళలకు నిరుత్సాహం తప్పదు. అనుకూల రంగులు…….. తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు…నీలం. అంగారక స్తోత్రాలు పఠించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
భూ సంబంధిత వివాదాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. కష్టించినా ఫలితం అంతగా దక్కక మదనపడతారు. బంధువులతో లేనిపోని వివాదాలు. దూరప్రయాణాలు ఉండవచ్చు. రాబడి నిరాశ కలిగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాల్లో పని ఒత్తిడులు, సహచరులతో వివాదాలు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు ఏకాగ్రత లోపించి ఎటూ నిర్ణయించుకులేరు. విద్యార్థులకు ఒత్తిడులు తప్పవు. మహిళలకు మనోవేదన. అనుకూల రంగులు…….. తెలుపు, లేత ఎరుపు. ప్రతికూల రంగు…నేరేడు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యతిరేకులు ఎట్టకేలకు మీకు స్నేహితులుగా మారతారు. ఆధ్యాత్మిక భావాలుపెరుగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు మరింత దక్కుతాయి. ఉద్యోగాల్లో మీ సమర్థత, పట్టుదల నిరూపించుకంటారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. మహిళలకు సంతోషం కలిగించే సమాచారం. అనుకూల రంగులు…….. లేత నీలం, పసుపు. ప్రతికూల రంగు…తెలుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. కొత్త రుణాల యత్నాలలో నిమగ్నం. ఆలోచనలు నిలకడగా ఉండవు. తీర్థయాత్రలుచేస్తారు. వ్యతిరేకులతో అప్రమత్తంగా మెలగండి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలు లేక నిరాశ కలుగుతుంది. ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయ, క్రీడాకారులు కృషి చేసినా ఆశించిన ఫలితం కనిపించదు. విద్యార్థుల అన్వేషణ ముందుకు సాగదు. మహిళలకు నిరుత్సాహం. అనుకూల రంగులు…….. బంగారు, గోధుమ. ప్రతికూల రంగు…పసుపు. శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఉత్సాహంగా కార్యక్రమాలు చేపడతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలు చేసుకుని అవసరాలు తీర్చుకుంటారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో ఏ బాధ్యత తీసుకున్నా తేలిగ్గా పూర్తి చేస్తారు. క్రీడాకారులు, శాస్త్రవేస్తలకు యోగదాయకమైన కాలం. విద్యార్థులకు అరుదైన అవకాశాలు. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు…….. ఆకుపచ్చ., కాఫీ. ప్రతికూల రంగు…ఎరుపు. ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
రుణాలు చేయాల్సివస్తుంది. ఇంటాబయటా సమస్యలు, వివాదాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం పై నిర్లక్ష్యం వీడి తగు నియమాలు పాటించండి. దూర ప్రయాణాలు ఉండవచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు అంతగా కనిపించవు. ఉద్యోగులకు విధులు ఇబ్బంది కలిగిస్తాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు విదేశీ పర్యటనలను వాయిదా వేస్తారు. విద్యార్థులు కొన్ని అవకాశాలు పోగొట్టుకుంటారు. మహిళలకు కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. అనుకూల రంగులు…….. ఎరుపు, బంగారు. ప్రతికూల రంగు …తెలుపు. శ్రీ నృసింహ స్తోత్రాలు పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన విధంగా సహాయం అందుతుంది. మీ మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. చిన్ననాటి స్నేహితులతో సంతోషంగాగడుపుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆదాయం పెరిగి ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఊహించని లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాల్లో ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకుంటారు. క్రీడాకారులు, వైద్యులకు కీలక సమాచారం రాగలదు. విద్యార్థులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు…….. నీలం, నలుపు. ప్రతికూల రంగు…గులాబీ. విష్ణు ప్రార్ధన మంచిది.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
మీ పరపతి, ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. కార్యక్రమాల పూర్తిలో స్నేహితులు సహకరిస్తారు. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఉల్లాసంగా గడుపుతారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సంస్థల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులు సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు విదేశీ పర్యటనలు జరుపుతారు. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. మహిళలు కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ముందడుగు వేస్తారు. అనుకూల రంగులు…….. గులాబీ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. రాఘవేంద్ర ధ్యానం చేయండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
కుటుంబ సమస్యలు మరింత వేధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. అనుకోని ప్రయాణాలు సంభవం. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మరింత సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులు విధుల్లో శ్రద్ధ , ఏకాగ్రత చూపాలి. రాజకీయవేత్తలు, వైద్యులకు కొత్త చిక్కులు. విద్యార్థులు మరింత శ్రమపడాలి. మహిళలకు చికాకులు పరుస్తాయి. అనుకూల రంగులు…. పసుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు..గులాబీ. శివ స్తుతి మంచిది.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com