Today rashi phalalu – 19 ఫిబ్రవరి 2023, ఆదివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


దూరపు బంధువుల కలయిక. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. అప్రయత్న కార్యసిద్ధి. వాహనాలు కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలు తీరతాయి. భూముల క్రయవిక్రయాలు లాభిస్తాయి. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. విద్యార్థులకు కొంత ఊరట. మహిళలకు శుభవార్తలు. అనుకూల రంగులు…… ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు.. కాఫీ. ఆదిత్య హృదయం పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

మిత్రులతో కలహాలు. దూర ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు తప్పవు. అంచనాలు తారుమారు. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు స్థానమార్పులు. పారిశ్రామికవేత్తలకు అవకాశాలు తప్పిపోతాయి. విద్యార్థుల యత్నాలు సఫలం. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు…… గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు.. గోధుమ. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


సన్నిహితులతో వివాదాలు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ. దూరప్రయాణాలు ఉంటాయి. ఎంత కష్టించినా ఫలితం అంతగా ఉండదు. వ్యవహారాలు మందగిస్తాయి. సోదరుల సహాయం అందుతుంది. వ్యాపారాలలో ఒడిదుడకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయ,కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు…… గులాబీ, తెలుపు. ప్రతికూల రంగు.. పసుపు, గణేశాష్టకం పఠించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


ఉత్సాహంగా పనులు పూర్తి. సంఘంలో విశేష గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. రాబడి పెరుగుతుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉన్నతపదవులు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. అనుకూల రంగులు…… పసుపు, ఎరుపు. ప్రతికూల రంగు.. ఆకుపచ్చ. దత్తాత్రేయుని పూజించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


కొత్తగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువుల సహకారం అందుతుంది. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత. అనుకూల రంగులు…… నలుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు.. కాఫీ. శివాష్టకం పఠించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


రుణ ఒత్తిడులు. ఆర్థికంగా ఇబ్బందులు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు. విద్యార్థులు మరింత కష్టపడాలి. మహిళలకు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అనుకూల రంగులు…… ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు.. గోధుమ. ఆంజనేయ దండకం పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు తప్పవు. బంధువులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారులకు అంతగా లాభించదు. ఉద్యోగాల్లో ఒత్తిడులు. రాజకీయవర్గాలకు పదవులు ఊరిస్తాయి. విద్యార్థులకు ఫలితాలు నిరాశ పరుస్తాయి. మహిళలకు ఒక కీలక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అనుకూల రంగులు…… పసుపు, గులాబీ. ప్రతికూల రంగు.. గోధుమ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. కాంట్రాక్టులకు అనుకూల సమయం. వ్యాపారవృద్ధి, పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో గందగోళం తొలగుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అంచనాలు కొన్ని తప్పుతాయి. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు…… ఎరుపు, నీలం. ప్రతికూల రంగు.. కాఫీ. శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


కుటుంబ సభ్యులతో వివాదాలు. ఆస్తి విషయంలో మరింతగా చికాకులు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. రాబడి కొంత తగ్గి నిరాశ చెందుతారు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగులకు అంతగా కలిసిరాదు. పనిభారం. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది. మహిళలకు కుటుంబంలో సమస్యలు. అనుకూల రంగులు…… గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు.. పసుపు, లక్ష్మీస్తుతి పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


కొన్ని వ్యవహారాల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ప్రశంసలు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. మహిళలకు సోదరులు, సోదరీలతో సఖ్యత. అనుకూల రంగులు…… ఆకుపచ్చ, ఎరుపు. ప్రతికూల రంగు.. తెలుపు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


మిత్రులతో అకారణంగా విరోధాలు. ఆదాయానికి మించి ఖర్చులు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు ఉంటాయి. శారీరక రుగ్మతలు. వ్యాపారులు కొత్త పెట్టుబడుల్లో తొందరపడరాదు. ఉద్యోగస్తులకు ఒత్తిడులు తప్పవు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు రద్దు. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు. అనుకూల రంగులు…… ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు.. ఆకుపచ్చ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు సద్దుకుంటాయి.. విలువైన వస్తువులు సేకరిస్తారు. రాబడి ఆశించిన స్థాయిలో ఉంటుంది. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగులకు ఉన్నత పదవులు. రాజకీయ, కళారంగాల వారికి నూతనోత్సాహం. విద్యార్థులకు కొంత గందరగోళం. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు…… పసుపు, ఎరుపు. ప్రతికూల రంగు.. గోధుమ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: