Today rashi phalalu – 21 ఫిబ్రవరి 2023, మంగళవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆకట్టుకునే సంఘటన ఎదురవుతుంది. ఒక ప్రకటనకు నిరుద్యోగులు ఊరట చెందుతారు. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. అనుకున్నది సాధించేందుకు శ్రమిస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు స్వయంకృషితో రాణిస్తారు. ఉద్యోగులకు చిక్కులు వీడతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు మరింత ఉత్సాహం. విద్యార్థులకు వృత్తి విద్యలలో అవకాశాలు. మహిళలకు పురస్కారాలు. అనుకూల రంగులు……. గోధుమ,ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. అంగారక స్తోత్రాలు పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కొన్ని పాత బాకీలు వసూలవుతాయి. పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు ఎట్టకేలకు లభిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు అనుకూలిస్తుంది. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలం. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకూల రంగులు………. కాఫీ,పసుపు. ప్రతికూల రంగు..తెలుపు. దత్తాత్రేయుని ఆరాధన మంచిది.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. మిత్రుల నుంచి కొన్ని ఒత్తిడులు. ఆస్తి వివాదాలు కొంత గందరగోళంగా మారతాయి. ఆరోగ్యం విషయంలో కొంత మెలకువ పాటించాలి. దూర ప్రయాణాలు ఉంటాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు గందరగోళం మ«ధ్య గడుపుతారు. ఉద్యోగులకు వివాదాలు మరింత సర్దుకుంటాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు కొత్త సమస్యలు. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు చేజారవచ్చు. మహిళలకు కుటుంబ సమస్యలు. అనుకూల రంగులు…….బంగారు, తెలుపు. ప్రతికూల రంగు..కాఫీ. దత్తాత్రేయుని పూజించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
వ్యయప్రయాసలు తప్పవు. పనుల్లో అనుకోని ప్రతిబంధకాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో మాటపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొంత సహనంతో మెలగాలి. ఉద్యోగాలలో చిక్కులు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు. మహిళలకు చికాకులు తప్పవు. అనుకూల రంగులు………. కాఫీ, పసుపు. ప్రతికూల రంగు..నీలం. శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇంటాబయటా సమస్యలు తొలగుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులు చేయూతనందిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు సమయానికి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గుతుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు బంధువుల నుండి సమస్యలు. అనుకూల రంగులు……… తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. ఆదిత్య హృదయం పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఆదాయం పెరిగి రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం. వాహనాలు,స్థలాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని నిర్ణయాలపై కుటుంబసభ్యులు సంతృప్తి చెందుతారు. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కొన్ని విజయాలు సాధిస్తారు. విద్యార్థులు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలు విశేష కీర్తి గడిస్తారు. అనుకూల రంగులు……. .. కాఫీ, పసుపు. ప్రతికూల రంగు..నేరేడు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఒప్పందాలను వాయిదా వేసే అవకాశం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొన్ని ఇబ్బందులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు రద్దు కాగలవు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు నిరుత్సాహపరుస్తాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు. అనుకూల రంగులు………. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు..పసుపు. గణేశ్ను పూజించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
పనులలో ఆటంకాలు. ప్రయాణాలు విరమిస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధువులు, మిత్రులతో విభేదాలు మిమ్మల్ని చికాకు పరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగావకాశాలు చేజారవచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు విస్తరణయత్నాలలో చికాకులు. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు సామాన్యస్థితి. విద్యార్థులకు కష్టపడ్డా ఫలితం కనిపించదు. మహిళలకు కుటుంబ సమస్యలు. అనుకూల రంగులు……… గోధుమ, తెలుపు. ప్రతికూల రంగు..గులాబీ. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఉద్యోగ యత్నాలు సానుకూలం. సంఘంలో గౌరవం పొందుతారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య వివాదాలు పరిష్కరించుకుంటారు. కొన్ని సమస్యలను ఎట్టకేలకు తీరతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు శుభవార్తలు. ఉద్యోగాలలో విధులు అనుకూలిస్తాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత కలసివస్తుంది. విద్యార్థులు కొంత ఫలితం దక్కుతుంది. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. అనుకూల రంగులు……… ఎరుపు,ఆకుపచ్చ. ప్రతికూల రంగు..నేరేడు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. బంధువుల ద్వారా కొన్ని విమర్శలు రావచ్చు. ఆరోగ్యం కొంత సహకరించదు. దేవాలయుల సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింత భారంగా మారవచ్చు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు సహనంగా వ్యవహరించాలి. విద్యార్థులకు అంచనాలు తారుమారు కాగలవు. మహిళలు నిర్ణయాలలోతొందరపడవద్దు. అనుకూల రంగులు……. .. బంగారు, పసుపు. ప్రతికూల రంగు..తెలుపు. ఆంజనేయ దండకం పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆర్థిక ప్రగతిని సాధించి ముందడుగు వేస్తారు. రుణాలు తీరతాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. నిరుద్యోగుల కృషి కొంత ఫలిస్తుంది. అనుకున్న పనులు చకచకా సాగుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంతోషంగా గడుపుతారు. ఉద్యోగుల శ్రమ కొంత ఫలిస్తుంది. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఊహించని అవకాశాలు సాధిస్తారు. విద్యార్థులు మరిన్ని విద్యావకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. అనుకూల రంగులు………. కాఫీ, పసుపు. ప్రతికూల రంగు..ఎరుపు. శివాష్టకం పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఖర్చులు కూడా మీదపడవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చికాకులు. ఉద్యోగులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పారిశ్రామికవేత్తలు, వైద్యుల యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. మహిళలకు బంధువులతో వివాదాలు. అనుకూల రంగులు……… గోధుమ, తెలుపు. ప్రతికూల రంగు..కాఫీ. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com