Today rashi phalalu – 22 ఫిబ్రవరి 2023, బుధవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
కొత్తగా రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు సంభవం. ఎంత కష్టపడ్డా ఫలితం అందుకోలేరు. శారీరక రుగ్మతలు. కుటుంబసభ్యుల తీరు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలపై నిరాశ చెందుతారు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలలో మార్పులు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు……… గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు..పసుపు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించాలి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. పూర్వపు మిత్రులను కలుసుకుని ఉత్సాహంతో గడుపుతారు. ఊహలు నిజం చేసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు తగినమొత్తంలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు సంభవం. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. విద్యార్థులు కొత్త అవకాశాలతో ముందుకు సాగుతారు. మహిళలకు శుభ వర్తమానాలు. అనుకూల రంగులు…….. ఆకుపచ్చ, బంగారు. ప్రతికూల రంగు..నేరేడు. వేంకటేశ్వరస్వామిని పూజించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
వివాహయత్నాలలో శుభవార్తలు అందుతాయి. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అధికంగా లాభాలు రాగలవు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు ఆందోళన నుండి బయటపడతారు. మహిళలు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. అనుకూల రంగులు…..గోధుమ, తెలుపు. ప్రతికూలరంగు.. గులాబీ. గణపతి అభిషేకం చేయండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
పనులు మరింత నత్తనడకన సాగుతాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. పరిస్థితులు అనుకూలించవు. మీరు తీసుకున్న నిర్ణయాలు తిరిగి పరిశీలిస్తారు. ఆరోగ్య సమస్యలు. రాబడి కొంత తగ్గి రుణాల కోసం ప్రయత్నిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగవర్గాలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దూరం కాగలవు. మహిళలకు నిరుత్సాహం. అనుకూల రంగులు……… గులాబీ, గోధుమ. ప్రతికూల రంగు..నేరేడు. శివ స్తోత్రాలు పఠించాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
కార్యక్రమాలు ముందుకుసాగవు. బంధువులతో తగాదాలు. ఎంతకష్టపడ్డా ఫలితం కనిపించదు. యుక్తితో వ్యవహారాలు ముగించడం మంచిది. అనారోగ్యం, మనశ్శాంతి కొంత లోపిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు అధికారుల ద్వారా ఇబ్బందులు పడతారు. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. రాజకీయవేత్తలు, వైద్యులకు సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులకు మానసిక అశాంతి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……… కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. పనులు పూర్తి చేయడంలో ముందడుగు వేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు విస్తరణ కార్యక్రమాలలో వేగం పెరుగుతుంది. ఉద్యోగాలలో విధులు కొంత అనుకూలిస్తాయి. క్రీడాకారులు, చిత్రపరిశ్రమ వారు శుభవార్తలు వింటారు. విద్యార్థులు కొత్త విద్యావకాశాలు పొందుతారు. మహిళలకు కొద్దిపాటి ధన ప్రాప్తి. అనుకూల రంగులు……… నీలం, తెలుపు. ప్రతికూల రంగు..గులాబీ. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కార్యక్రమాలలో ఆటుపోట్లు ఎదురై ముందుకు సాగవు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు కొలిక్కి రాక నిరాశ చెందుతారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. వ్యాపార లావాదేవీలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు వివాదాలు. విద్యార్థులు పోటీతత్వంలో కొంత వెనుకబడతారు. మహిళలకు కుటుంబ సమస్యలు. అనుకూల రంగులు……… కాఫీ, పసుపు. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిరకాల కోరిక నెరవేరుతుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. తీర్థయాత్రలకు పయనమవుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సమస్యలు తీరి ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగవర్గాలకు పైస్థాయి ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, వైద్యులకు అన్నింటా విజయాలే. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కవచ్చు. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు………. ఆకుపచ్చ, బంగారు. ప్రతికూల రంగు..నేరేడు. సుబ్రహ్మణ్యేశ్వరున్ని పూజించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక ఇబ్బందిపడతారు. సన్నిహితుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. పరిస్థితులు అంతగా అనుకూలించవు. వివాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్య సమస్యలతో కొంత కుస్తీపడతారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు విస్తరణలో తొందరపాటు వీడాలి. ఉద్యోగులకు బలవంతంగా కొన్ని మార్పులు ఉంటాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు లేనిపోని సమస్యలు ఎదురుకాగలవు. విద్యార్థులకు చికాకులు పెరుగుతాయి. మహిళలకు నిరుత్సాహం. అనుకూల రంగులు………. పసుపు, ఎరుపు. ప్రతికూల రంగు..నీలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
శ్రమ ఫలించే సమయం. మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. భూములు, ఇళ్లు కొంటారు. పనులు మరింత చురుగ్గా ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం కలుగుతుంది. కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సంతోషకరంగా గడుస్తుంది. ఉద్యోగవర్గాలకు పదోన్నతులు. క్రీడాకారులు, చిత్రపరిశ్రమ వారి యత్నాలు సఫలం. విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. మహిళలు ఆస్తి లాభం పొందుతారు. అనుకూల రంగులు……… గోధుమ, గులాబీ. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. సత్యనారాయణస్వామిని పూజించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చిక్కులు. ఉద్యోగవర్గాలకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. క్రీడాకారులు, వైద్యులకు ఒత్తిడులు. విద్యార్థులు ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు ఆరోగ్యభంగం. అనుకూల రంగులు…….. ఆకుపచ్చ, బంగారు. ప్రతికూల రంగు..ఎరుపు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
శుభ వార్తలు అందుతాయి. వ్యవహారాలు మరింత సానుకూలమవుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగి ఊరట చెందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల విస్తరణ యత్నాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు,క్రీడాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు కుటుంబంలో గౌరవం. అనుకూల రంగులు……… పసుపు, గులాబీ. ప్రతికూలరంగు.. గోధుమ. దుర్గాదేవిని పూజించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com