Today rashi phalalu – 23 ఫిబ్రవరి 2023, గురువారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
వ్యవహారాల్లో కొంత ఆటంకాలు. బంధువర్గంతో విరోధాలు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. తగు జాగ్రత్తలు పాటించండి. వ్యాపార, వాణిజ్యవేత్తల లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు స్థానమార్పు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, వైద్యులకు కొన్ని ఇబ్బందులు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు సోదరులతో వివాదాలు. అనుకూల రంగులు……. కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు…గులాబీ. అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కార్యక్రమాలను కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. సమాజసేవలో నిమగ్నమవుతారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు తెరపడుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు విస్తరణకార్యక్రమాలు కలసివస్తాయి. ఉద్యోగవర్గాలు విధుల్లో భారం తగ్గి సంతోషంగా గడుపుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు స్వల్ప ధన లాభం. అనుకూల రంగులు……. బంగారు, కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. కనకధారా స్తోత్రం పఠించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
కార్యక్రమాలను సకాలంలో చక్కదిద్దుతారు. కుటుంబ సమస్యలు స్వయంగా పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొంతమేర పరిష్కారం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు ప్రగతిపథంలో పయనిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారుల ఆశలు ఫలించే సమయం. విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. మహిళలకు స్వల్ప ధనలాభం. అనుకూల రంగులు…… ఎరుపు, గులాబీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. ఆదిత్య హృదయం పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
దూర ప్రయాణాలు ఉండవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. రాబడి మునుపటి కంటే నిరాశ కలిగిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యం పై కొంత శ్రద్ధ వహించండి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆటుపోట్లు. ఉద్యోగులకు శ్రమాధిక్యమే. పనిభారం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కష్టపడ్డా సమయం వృథా తప్ప ఫలితం కానరాదు. విద్యార్థులకు ఎటూతేల్చుకోలేని పరిస్థితి. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు……. పసుపు, బంగారు. ప్రతికూల రంగు…తెలుపు. విష్ణు ధ్యానం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఇంటాబయటా ఒత్తిడులు. ఆదాయానికి మించి ఖర్చులు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. బ«ంధువులతో వివాదాలు నెలకొంటాయి. దైవదర్శనాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొంత నిరుత్సాహానికి లోనవుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడులు. చిత్రపరిశ్రమ వారు, పారిశ్రామికవేత్తలకు ఎటు చూసినా నిరాశే. విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు. మహిళలకు కుటుంబంలో సమస్యలు. అనుకూల రంగులు……. నీలం, నలుపు. ప్రతికూల రంగు…పసుపు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఉత్సాహంగా కార్యక్రమాలు చేపడతారు. విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. భూములు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఊహించినరీతిలో పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొన్ని ఆటంకాలు అధిగిమిస్తారు. ఉద్యోగులకు సంతోషదాయకమైన కాలం. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు అన్ని విధాలా అనుకూలం. విద్యార్థుల శ్రమ వృథా కాదు. మహిళలకు శుభవార్తలు. అనుకూల రంగులు…….పసుపు, గులాబీ. ప్రతికూల రంగు..కాఫీ. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
బంధువులతో మెరుగైన సంబంధాలు. రావలసిన బాకీలు అందుతాయి. కార్యక్రమాలలో పురోగతి ఉంటుంది. శ్రమపడ్డా ఫలితం దక్కుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగవర్గాలు తమ పని చక్కబెట్టుకోవడంలో సఫలం కాగలరు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి చికాకులు తొలగుతాయి. విద్యార్థులు అంచనాలు ఫలిస్తాయి. మహిళలకు భూ లాభాలు. అనుకూల రంగులు……. కాఫీ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…గులాబీ. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
కొత్తగా అప్పుల కోసం యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో ఊహించని విభేదాలు. ఇంటాబయటా మీపై ఒత్తిడులు పెరుగుతాయి. దేవాలయాల సందర్శనం. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొంత నిదానం పాటిస్తే మేలు. ఉద్యోగులు విధి నిర్వహణలో కొంత అప్రమత్తత పాటించాలి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు చిక్కులు. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు……. గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…ఎరుపు. సుబ్రహ్మణ్యేశ్వరుని స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
శ్రమకోర్చి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. రాబడి తగ్గి అవసరాలకు ఇబ్బందిపడతారు. బంధువులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తూ సకాలంలో ఆహార విహారాదులు పూర్తి చేయడం మంచిది. ఆలయ దర్శనాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులు అదనపు ఒత్తిడులు. రాజకీయవేత్తలు, వైద్యులకు కొంత తొందరపాటు వల్ల ఇబ్బందులు. విద్యార్థులు అవకాశాలపై నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అనుకూల రంగులు……. నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
పూర్వపు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాలు అనుకున్న రీతిలో సాగుతాయి. గృహ, వాహనయోగాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులపై సందిగ్ధత తొలగుతుంది. ఉద్యోగులకు కొన్ని వివాదాలు పరిష్కారం. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. విద్యార్థుల శ్రమ ఫలించే రోజు. మహిళలకు విశేష గౌరవం లభిస్తుంది. అనుకూల రంగులు……. ఎరుపు, లేత పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. శ్రీ కృష్ణ స్తోత్రాలు పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
కుటుంబ సభ్యులతో అకారణంగా విరోధాలు. శ్రమాధిక్యంతో వ్యవహారాలు పూర్తి. కొన్ని కాంట్రాక్టులు రద్దు చేసుకుంటారు. ఆర్థికపరమైన చిక్కులు ఎదుర్కొంటారు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అధికారుల ద్వారా కొన్ని ఇబ్బందులు. ఉద్యోగులకు విధి నిర్వహణ కష్టసాధ్యంగా మారవచ్చు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు వివాదాలు. విద్యార్థుల యత్నాలు కొంత ఫలిస్తాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……. గోధుమ, తెలుపు. ప్రతికూల రంగు…చాక్లెట్. శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. అందరిలోనూ మీపట్ల గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శత్రువులు కూడా మీపక్షానికే వస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు కోరుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు కీలక సమాచారం. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఆహ్వానాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు గౌరవం పెరుగుతుంది. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు…నీలం. శివ పంచాక్షరి పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com